హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అయన విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు లో భాగస్వాములైన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణా అభివృద్ధిలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సిబ్బంది మరింత చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేయాలని, విశ్వవిద్యాలయ విద్యార్థులకు సేవలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, డా. ఎల్. విజయా కృష్ణా రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, డా. భోజు శ్రీనివాస్, ప్రో. రబింద్రనాథ్ సోలమన్, డా. పి. వెంకటరమణ, ఉద్యోగ సంఘం నాయకులు కాంతం ప్రేమ కుమార్, అన్ని విభాగాల డైరెక్టర్స్, అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read-
TELANGANA STATE DECENNIAL FORMATION DAY CELEBRATIONS AT BRAOU
Hyderabad: Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, Dr. B. R. Ambedkar Open University today hoisted the tri-colour National Flag on the occasion of 11th Telangana State Formation Day Celebrations at the campus. Prof. Chakrapani extended State Formation day greetings to the Staff and congratulated the university officials.

He remembered the sacrifices of the martyrs who participated in the formation of Telangana. Dr. L. Vijaya Krishna Reddy, Registrar, Prof. G. Pushpa Chakrapani, Prof.Vaddanam Srinivas, Dr. B. Srinivas, Dr. D. Rabindranath Solomon, Dr. P. Venkata Ramana, Dr. Banoth Dharma, All Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of University Service Associations attended the Telangana State Formation Day Celebrations.
