हैदराबाद : मुख्यमंत्री रेवंत रेड्डी ने तेलंगाना राज्य स्थापना दिवस की 10वीं वर्षगांठ मनाने के अवसर पर राज्य के लोगों को शुभकामनाएं दीं है। तेलंगाना राज्य, जिसे लोगों ने मिलकर लड़ा और हासिल किया, अपने गठन के दस साल पूरे करके ग्यारहवें वर्ष में प्रवेश कर रहा है। इस अवसर पर मुख्यमंत्री ने राज्य की प्राप्ति के लिए संघर्ष में अपने प्राणों की आहुति देने वाले शहीदों के बलिदान को याद किया। मुख्यमंत्री ने वर्षों से तेलंगाना आंदोलन में भाग लेने वाले सभी कवियों, कलाकारों, छात्रों, शिक्षकों, कर्मचारियों, बुद्धिजीवियों, पत्रकारों, वकीलों, श्रमिकों, किसानों, महिलाओं और राजनीतिक दल के नेताओं को बधाई दी है।
मुख्यमंत्री ने खुशी जताई कि इस साल 2 जून सबसे महत्वपूर्ण दिन है और इसी दिन तेलंगाना राज्य को पूर्ण मुक्ति मिली है। उन्होंने याद दिलाया कि विभाजन अधिनियम के तहत हैदराबाद, जो अब तक संयुक्त राजधानी थी, अब केवल तेलंगाना की राजधानी होगी। उन्होंने कहा कि अब से शैक्षिक रोजगार के अवसरों का बड़ा हिस्सा हमारे राज्य के लोगों को मिलेगा। मुख्यमंत्री ने आगे कहा कि उनकी सरकार तेलंगाना के लोगों की आशाओं और आकांक्षाओं के अनुरूप राज्य के पुनर्निर्माण के लिए प्रतिबद्ध है।
संबंधित खबर-
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
ఈ ఏడాది జూన్ 2వ తేదీకి అత్యంత ప్రాధాన్యముందని, ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తపరిచారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని గుర్తు చేశారు. ఇకపై విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన రాష్ట్ర ప్రజలకే దక్కుతాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతిన బూనారు.
గడిచిన పదేండ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు, ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందని తెలిపారు.
గాంధీ భవన్
జూన్ 2వ తేది ఆదివారం నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గాంధీ భవన్ లో ఉదయం 8.30 గంటలకు టీపీసీసీ వర్కింగ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, పాల్గొంటారు. దయచేసి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి.
