హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు గా మిద్దెల జితేందర్ భాద్యతలు స్వీకరించి నేటికీ సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్బంగా గాంధీభవన్ లొ సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ముఖ్య లక్ష్యంగా సేవాదళ్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
అదే విధంగ .. విధానసభ మరియు పార్లమెంట్ ఎలక్షన్ లో పనిచేసిన కార్యకర్తలందరికీ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో // ఎంపీటీసీ // జడ్పిటిసిలుగా అవకాశం కల్పించాల్సిందిగా కోరుతానన్నారు.
మరియు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు కూడా వీరిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనవి చేయనున్నారు.
Also Read-
సేవాదళ్ అధ్యక్షులు గా భాద్యత తీసుకున్న వెంటనే బుత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు పూర్తి చేయటం జరిగింది అన్నారు. బ్రిటిష్ వలస పాలకులను తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టిన సంస్థలలో ముఖ్యమైన సంస్థ సేవాదళ్ అని కొనియాడారు.
ఇంత గొప్ప చరిత్ర కలిగిన అఖిల భారత కాంగ్రెస్ సేవాదల్ లొ నేను పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ సంవత్సర కాలం పాటు నాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు మరియు అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.