తెలంగాణ ఉద్యమ కారుడు కొత్తింటి ప్రవీణ్ కుమార్ మృతి, యూనివర్సిటీలో తీవ్ర విషాదం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కారుడు కొత్తింటి ప్రవీణ్ కుమార్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ టిజెఎసి నాంపల్లి చైర్మన్ గా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. తెలంగాణ వికాస సమితి రాజధాని హైదరాబాద్ జిల్లా సమన్వయ కర్తగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం పునర్నిర్మాణంలో కూడా ప్రవీణ్ కుమార్ విశేషంగా కృషి చేశారు.

ప్రవీణ్ కుమార్ ఎప్పుడూ పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ సభలకు, సమావేశాలకు హాజరయ్యేవాడు. అందరితో చిరునవ్వుతో మాట్లాడడం ఆయన ప్రత్యేకత.

ప్రవీణ్ కుమార్ మృతి పట్ల అంబేద్కర్ యూనివర్సిటీ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రేమ్ కుమార్ , మహేశ్ గౌడ , ఎంవీఎస్ శర్మ, ఉద్యోగులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X