Hyderabad: పెంచిన ట్రాఫిక్ ఛాలనాలను తగ్గించాలని అంబర్పేట్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు గారి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాదులో వి.హనుమంతరావు గారి సూచన మేరకు గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వరలక్ష్మి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.
అంబర్పేట సర్కిల్లో రేపటినుండి రాష్ట్ర ప్రభుత్వము మళ్లీ పెంచిన ట్రాఫిక్ చలాన్సు అందుబాటులోకి తీసుకొస్తున్న సందర్భంగా మహిళా కాంగ్రెస్ ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాలొ గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్స్ సునీత రెడ్డి, ఉషా, లావణ్య డివిజన్ ప్రెసిడెంట్ పద్మ, పెద్ద ఎత్తున మహిళ నేతలందరూ ఆందోళన చేపట్టారు.
పబ్లిక్ ని లూటీ చేయొద్దంటూ ప్లక్కార్డ్ లతో నిరసన తెలిపారు. కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తుంటే.. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ చాలన్లతో ప్రజలపై అధిక భారం మోపుతున్నారని త్వరలోనే ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు బుద్ధి చెప్తారని ఆమె అన్నారు.