हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव (KCR) ने कहा है कि ‘स्वच्छ भारत मिशन-स्वच्छ सर्वेक्षण ग्रामीण’ में प्रथम रैंक हासिल करना तेलंगाना सरकार के अनुकरणीय प्रदर्शन और पारदर्शी शासन का प्रमाण है। उन्होंने कहा कि तेलंगाना सतत विकास हासिल कर रहा है और देश में दूसरों के लिए एक उदाहरण स्थापित कर रहा है।
विभिन्न श्रेणियों के तहत तेलंगाना की ओर से 13 वार्ड जीतने और “स्वच्छ सर्वेक्षण ग्रामीण” में शीर्ष स्थान हासिल करने से प्रसन्नता व्यक्त करते हुए मुख्यमंत्री ने कहा कि तेलंगाना सरकार सामूहिक प्रयासों के माध्यम से ग्रामीण विकास प्राप्त करके हरित तेलंगाना के निर्माण के लक्ष्य के साथ काम करना जारी रखेगी।
केसीआर ने आगे कहा, “तेलंगाना के प्रत्येक नागरिक को इस बात पर गर्व होना चाहिए कि तेलंगाना विकास में तेजी से प्रगति कर रहा है। देश की प्रगति में अपने गुणात्मक योगदान के माध्यम से अपनी भूमिका निभा रहा है। हम इसे आगे भी जारी रखेंगे।”
मुख्यमंत्री ने पंचायत राज और ग्रामीण विकास मंत्री एर्राबेल्ली दयाकर राव, अधिकारी, कर्मचारी और निर्वाचित प्रतिनिधियों को बधाई दी। साथ ही कहा कि ‘पल्ले प्रगति’ कार्यक्रम के प्रभावी कार्यान्वयन से इस उपलब्धि में योगदान दिया।
తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్’
హైదరాబాద్: సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్’లో మరోసారి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సమష్టి కృషితో, పల్లెప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని పునరుద్ఘాటించారు.
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ కింద పలు విభాగాల్లో రాష్ట్రం 13 అవార్డులు దకించుకొని దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు దోహదం చేసిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రిని, ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచ్‌లను, ఎంపీటీసీలను, గ్రామకార్యదర్శులను సీఎం కేసీఆర్ అభినందించారు. ‘అప్రతిహత ప్రగతితో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తనవంతుగా గుణాత్మక భాగస్వామ్యాన్ని పంచుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపరను కొనసాగిస్తాం’ అని అన్నారు.
ఎర్రబెల్లికి ఫోన్‌లో అభినందనలు
కేంద్రం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్‌లో తెలంగాణ ఆగ్రస్థానంలో నిలిచినందుకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సీఎం కేసీఆర్ అభినందించారు. శుక్రవారం ఫోన్ చేసి అభినందించారని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపినందుకు కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారని, ఇదే తరహా అభివృద్ధిని కొనసాగించాలని సూచించారని చెప్పారు. (एजेंसियां)