Telangana Gave 8 MP Seats To The BJP But In Return The BJP Govt. At The Center Has Given Only “Donkey Egg” In The 2024 Budget

Telangana Congress party sets up “Gadidha Guddu” (Donkey Egg) flex banners targeting the BJP for discrimination against Telangana in Union Budget

Across Hyderabad, in many places, Congress has set up “Donkey Egg” flexis, attracting people’s attention.

Hyderabad: The Congress party has set up “Donkey Egg” flexis across Hyderabad, highlighting the BJP’s discrimination against Telangana in the recent 2024 budget. The flexis have the write-up: “What BJP has given to Telangana: Donkey Egg.”

In the Lok Sabha elections, the people of Telangana gave 8 MP seats to the BJP, but Telangana got zero in the budget allocations. There is a huge discussion going on among the people of Telangana about the discrimination against the state.

It has become a widely discussed issue throughout the state. The people of Telangana are severely opposing the BJP for this kind of treatment towards their state. Before LS polls, “Gadidha Guddu” was the campaign that was done by Telangana Congress.

బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్ లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుడ్డు

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయంపై వినూత్న రీతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో “గాడిద గడ్డు” ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్

బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై, ప్రజలను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ ఫ్లెక్సీలు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో దక్కింది గాడిద గుడ్డు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై “బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే..కేంద్ర బడ్జెట్ లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు” అంటూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లు చర్చనీయాంశంగా మారాయి.

పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నిరసన

మరోవైపు, కేంద్రం ప్రవేశ పెట్టిన 2024-2025 బడ్జెట్ కు నిరసన గా నేడు పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.బడ్జెట్ ను ఏక పక్షంగా రూపొందించారాని.బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్టాలను విస్మరించారాని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమం లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకులు, విపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఇండియా కూటమి ఎంపీలు ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదని గాడిద గుడ్డు ఇచ్చిందని ఈ నిరసన కార్యక్రమంలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తపరిచిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X