तेलंगाना बजट 2024-25, इन योजनाओं पर हैं सबकी नज़रें

నేడే తెలంగాణ బడ్జెట్, ఆ స్కీమ్‌లపైనే అందరి చూపు

हैदराबाद: कांग्रेस सरकार द्वारा पेश किए जाने वाले पहले बजट को लेकर तेलंगाना के लोगों में काफी दिलचस्पी है। चुनाव के दौरान घोषित 6 गारंटियों के अलावा कई गारंटियों के लिए धन का आवंटन कैसा होगा, इसे लेकर सरगर्मी शुरू हो गई है। तेलंगाना के वित्त विभाग को सभी विभागों से कितने प्रस्ताव मिले हैं। यह अभी पता नहीं चल पाया है। क्या यह पिछले वर्ष से बढ़ेगा क्योंकि मुख्यमंत्री ने स्पष्ट कहा है कि व्यवहारिक तरीके से यथार्थवादी बजट बनाया जाना चाहिए या घटेगा? इस पर चर्चा शुरू हो गई है। सचिवालय की ओर से चर्चा है कि इसमें ज्यादा बढ़ोतरी नहीं हो सकती है।

सुबह 9 बजे विधानसभा में ही कैबिनेट की बैठक होगी और बजट को मंजूरी दी जाएगी। डिप्टी सीएम भट्टी विक्रमार्क दोपहर 12 बजे वित्त मंत्री की हैसियत से विधानसभा और विधान परिषद में बजट पेश करेंगे। बीआरएस द्वारा कांग्रेस सरकार द्वारा छह गारंटियों के कार्यान्वयन पर संदेह व्यक्त करने और उन्हें ‘420 वादे’ के रूप में आलोचना करने के संदर्भ में बजट में उनके लिए आवंटन पर विशेष ध्यान दिया गया है।

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఫస్ట్ బడ్జెట్‌పై రాష్ట్రంలో ఆసక్తి నెలకొన్నది. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు పలు హామీలకు నిధుల కేటాయింపు ఏ తీరులో ఉంటుందన్న ఉత్కంఠ మొదలైంది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించిన స్టేట్ ఫైనాన్స్ డిపార్టుమెంటు చివరకు ఎంత ఫైనల్ చేసిందని తెలియాల్సి ఉంది. వాస్తవికమైన బడ్జెట్‌ను, ఆచరణాత్మకమైన తీరులో రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నందున గతేడాదికంటే పెరుగుతుందా? లేక తగ్గుతుందా? అనే చర్చలు మొదలయ్యాయి. పెద్దగా పెరగకపోవచ్చనే టాక్ కూడా సచివాలయ వర్గాల నుంచి వినిపిస్తున్నది.

అసెంబ్లీలోనే ఉదయం 9 గంటలకు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో అసెంబ్లీలో, కౌన్సిల్‌లో మాత్రం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు 12 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై అనేక అనుమానాలను బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ ‘420 ప్రామిస్‌లు’ అంటూ విమర్శిస్తున్న నేపథ్యంలో బడ్జెట్‌లో వాటికి చేసే కేటాయింపులపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరు కానున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రజాస్వామ్య ప్రాధాన్యాన్ని గుర్తించాలని, బాధ్యతాయుతంగా సభకు హాజరుకావాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ నుంచి రియాక్షన్ రావడం గమనార్హం. బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో గట్టిగా కౌంటర్లు వస్తున్న సందర్భంలో కేసీఆర్ హాజరవుతారని గులాబీ పార్టీ లీకులు ఇచ్చింది. చర్చలో స్వయంగా ఆయనే పాల్గొంటారా? లేక హరీశ్‌రావుకు అవకాశం ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్​స్పష్టమైన వ్యాఖ్యలు చేయడంతో వాటికి ఈ బడ్జెట్‌లో కేటాయింపు కీలకాంశమైంది. గతేడాది 2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతి ఏటా యావరేజ్‌గా పెరిగే 15% హైక్ ఉంటుందా అనే సస్పెన్స్ నెలకొన్నది. ఖర్చులు, ఆదాయ వనరులను ప్రభుత్వం ఏ రూపంలో సమీకరించుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెంచిందనే ఆరోపణల నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించనున్నది. గత బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి 17,828 కోట్లు వస్తుందని చెప్పగా ఒక్కపైసా రాలేదు.

కేంద్ర గ్రాంట్ల రూపంలో 41,259 కోట్లు చెప్పినప్పటికీ తొమ్మిది నెలల్లో కేవలం 4,978 కోట్లు (12%) మాత్రమే అందాయి. దీంతో దాదాపు 54 వేల కోట్ల తేడా వచ్చింది. ఇక రాష్ట్ర రెవెన్యూ తొమ్మిది నెలల్లో 1.52 లక్షల కోట్ల అంచనా వేసుకుంటే రూ. 99,593 కోట్లు (65%) సమకూరింది. మొత్తం ఏడాదికి రెవెన్యూ 2.16 లక్షల కోట్లు రావాల్సి ఉండగా 1.25 లక్షల కోట్లు (57%) మాత్రమే సాకారమైంది. విద్య, వైద్య, సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తామని సీఎం చెప్పినందున వాటికి గతం కంటే ఎంత కేటాయింపు ఉంటుందనేది నేడు స్పష్టం కానున్నది. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలకు జవాబు చెప్పేలా భట్టి విక్రమార్క ఈ బడ్జెట్‌ను ఎలా రూపొందించారనేది చూడాల్సిఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X