हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 के सुपर-8 मैच में टीम इंडिया ने शनिवार को खेले गए बांग्लादेश को 50 रनों से हराया। इस जीत के साथ ही भारत ग्रुप-2 की प्वाइंट्स टेबल में 4 अंकों के साथ टॉप पर पहुंच गया है। भारत का बांग्लादेश के खिलाफ इस बड़ी जीत के बाद नेट रन रेट +2.425 हो गया है। टीम इंडिया को एक खिलाड़ी ने अकेले दम पर मैच जिताया है। इस धाकड़ खिलाड़ी की पारी ने मैच में दोनों टीमों के बीच बड़ा अंतर पैदा किया है।
विस्फोटक ऑलराउंडर हार्दिक पंड्या टीम इंडिया की जीत के सबसे बड़े हीरो साबित हुए जिसके लिए उन्हें ‘मैन ऑफ द मैच’ चुना गया। हार्दिक पंड्या ने इस मैच में गेंद और बल्ले से अपना कमाल दिखाया है। जब टीम इंडिया को हार्दिक पांड्या से एक तूफानी पारी की दरकार थी तो उन्होंने जिम्मेदारी लेते हुए 27 गेंदों में 50 रन बनाये। हार्दिक पांड्या ने 4 चौके और 3 छक्के लगाये।
हार्दिक पंड्या ने सिर्फ बल्ला ही नहीं गेंद से भी कोहराम मचाया है। हार्दिक पंड्या ने बांग्लादेश की पारी के शुरुआती 5 ओवरों में खतरनाक ओपनर लिटन दास को आउट कर दिया। लिटन दास 10 गेंदों में 13 रन बनाकर आउट हुए। लिटन दास हार्दिक पंड्या की गेंद पर सूर्यकुमार यादव को कैच थमा बैठे। हार्दिक पंड्या इस टी20 वर्ल्ड कप में शानदार फॉर्म में चल रहे हैं। हार्दिक पंड्या भारत के लिए 97 टी20 मैचों में 26.13 की औसत से 1437 रन बना चुके हैं। हार्दिक पंड्या ने टी20 इंटरनेशनल फॉर्मेट 4 अर्धशतक जमाए हैं। हार्दिक पंड्या ने टी20 इंटरनेशनल मैचों में 81 विकेट भी झटके हैं।
संबंधित खबर-
हार्दिक पांड्या के अर्धशतक के बाद कुलदीप यादव के फिरकी के जादू से भारत ने आईसीसी टी20 वर्ल्ड कप के सुपर-8 मैच में बांग्लादेश को 50 रन से हराकर लगातार दूसरी जीत के साथ सेमीफाइनल के लिए अपना दावा बेहद मजबूत किया। इस जीत से भारत के ग्रुप एक में दो मैच में दो जीत से चार अंक हो गए हैं और टॉप शीर्ष पर है। ऑस्ट्रेलिया एक मैच में दो अंक के साथ दूसरे स्थान पर है। लगातार दूसरी हार झेलने वाले बांग्लादेश और अफगानिस्तान का अभी खाता भी नहीं खुला है। भारत के 197 रन के लक्ष्य का पीछा करते हुए बांग्लादेश की टीम कुलदीप यादव (19 रन पर तीन विकेट), जसप्रीत बुमराह (13 रन पर दो विकेट) और अर्शदीप (30 रन पर दो विकेट) की धारदार गेंदबाजी के सामने आठ विकेट पर 146 रन ही बना सकी।
बांग्लादेश की ओर से कप्तान नजमुल हुसैन शंटो ने सर्वाधिक 40 रन बनाए। जबकि सलामी बल्लेबाज तंजीद हसन ने 29 और रिशाद हुसैन ने 24 रन की पारी खेली। इससे पहले पांड्या (नाबाद 50 रन, 27 गेंद, चार चौके, तीन छक्के) के तेजतर्रार अर्धशतक के अलावा विराट कोहली (37), ऋषभ पंत (36) और शिवम दुबे (34) की उपयोगी पारियों से भारत ने पांच विकेट पर 196 रन बनाए। बांग्लादेश की तरफ से तंजीम हसन साकिब ने 32 जबकि रिशाद हुसैन ने 43 रन देकर दो-दो विकेट लिये। (एजेंसियां)
బంగ్లాదేశ్ పై ఇండియా విక్టరీ
హైదరాబాద్ : టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. హార్దిక్ పాండ్యా (27 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్; 1/32)కు తోడు కుల్దీప్ యాదవ్ (3/19), జస్ప్రీత్ బుమ్రా (2/13), అర్ష్‌దీప్ సింగ్ (2/30) సత్తా చాటడంతో సూపర్–8 రౌండ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 50 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.
వరుసగా రెండో విక్టరీతో గ్రూప్–1లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. వన్‌సైడ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 196/5 భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (28 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 37), రిషబ్ పంత్ (24 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), శివం దూబే (24 బాల్స్‌లో 3 సిక్సర్లతో 34) రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్, రిషద్ హుస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఛేజింగ్‌లో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 146/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (40), తంజిద్ హసన్ (29), రిషద్ హుస్సేన్ (24) పోరాడినా ఫలితం లేకపోయింది. పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా రెండు ఓటములతో బంగ్లా నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. సోమవారం జరిగే సూపర్8 చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా పోటీ పడుతుంది.
కీలక మ్యాచ్‌లో టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు సత్తా చాటడంతో రోహిత్ సేన భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తొలిసారి మంచి ఆరంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే బౌండ్రీల ఖాతా తెరిచిన హిట్‌మ్యాన్ స్పిన్నర్ షకీబ్ వేసిన రెండో ఓవర్లో మరో ఫోర్ కొట్టగా విరాట్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ రాబట్టాడు.
షకీబ్ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్ 6, 4తో జోరు మీద కనిపించాడు. కానీ, తర్వాతి బాల్కే మరో షాట్‌కు ప్రయత్నించి ఔటవడంతో తొలి వికెట్‌కు 39 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. కాసేపు నెమ్మదించిన కోహ్లీ.. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో సిక్స్‌తో మళ్లీ వేగం పెంచగా పవర్ ప్లేను ఇండియా 53/1తో ముగించింది. వన్‌డౌన్‌లో వచ్చిన పంత్ క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకోగా స్పిన్నర్ రిషద్ హుస్సేన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ సిక్స్‌తో కోహ్లీ అలరించాడు. కానీ, తొమ్మిదో ఓవర్లో పేసర్ తంజిద్ ఇండియాను దెబ్బకొట్టాడు.
కోహ్లీని బౌల్డ్ చేసిన అతను ఎదుర్కొన్న తొలి బాల్నే సిక్స్‌గా మలచిన ఇన్ఫామ్ బ్యాటర్ సూర్య (6)ను కీపర్ క్యాచ్‌తో వెనక్కు పంపడంతో ఇండియా 77/3తో కాస్త డీలా పడింది. అయితే, అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన పంత్.. ముస్తాఫిజుర్ వేసిన 11వ ఓవర్లో 4, 6, 4తో స్పీడు పెంచాడు. రిషద్ బౌలింగ్‌లో 6,4తో స్కోరు వంద దాటించిన అతను తర్వాతి బాల్కే తంజిమ్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.
వరుసగా రెండు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వని బంగ్లా బౌలర్లు పుంజుకున్నట్టు కనిపించారు. కానీ, వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన దూబేకు తోడైన హార్దిక్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్పిన్నర్ మెహిదీ హసన్ బౌలింగ్‌లో 6, 4తో ఇండియా ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. షకీబ్, తంజిమ్ ఓవర్లలో దూబే రెండు సిక్సర్లు కొట్టి స్కోరు 150 దాటించాడు.
రిషద్ వేసిన 18వ ఓవర్లో మరో సిక్స్ కొట్టి బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్‌తో పాటు తంజిమ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన పాండ్యా ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు సహా 18 రన్స్ రాబట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు.
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ తొలి సగం ఓవర్లలో బాగానే ప్రతిఘటించినా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన ఇండియా ఆ జట్టును నిలువరించింది. మొదట్లో ఓపెనర్లు తంజిద్ హసన్ , లిటన్ దాస్ (13) ధాటిగా ఆడారు. స్వేచ్ఛగా బౌండ్రీలు కొడుతూ తొలి వికెట్‌కు 35 రన్స్ జోడించారు.
ఇక్కడి నుంచి ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు. అయితే, హార్దిక్ వేసిన తొమ్మిదో ఓవర్లో కెప్టెన్ నజ్ముల్ శాంటో రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా జోరుకు బ్రేకులు వేశాడు. తంజిద్, తౌహిద్ హృదయ్ (4)ను ఎల్బీ చేసిన అతను రోహిత్ పట్టిన క్యాచ్‌తో ప్రమాదకర షకీబ్ అల్ హసన్ (4)ను వెనక్కుపంపాడు.
16వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న శాంటోను ఔట్ చేయడంతో బంగ్లా పూర్తిగా డీలా పడింది. ఆ వెంటనే అర్ష్‌దీప్ బౌలింగ్‌లో జాకెర్ అలీ (1) కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో 110/6తో బంగ్లా పులుల పరాజయం ఖాయమైంది. వెంటవెంటనే ఓ ఫోర్, మూడు సిక్సర్లు కొట్టిన రిషద్ హుస్సేన్, మహ్ముదుల్లా (13) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. (ఏజెన్సీలు)