• స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు భేష్…
• పార్టీ నాయకులను అభినందించిన బండి సంజయ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్
• ఇంకా విస్త్రతస్థాయిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని సూచన
• గడువు పొడిగించాలని కోరిన నేతలు
• 28వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహణ గడువు తేదీని పొడిగించిన బన్సల్
• 28న సాయంత్రం 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశం
హైదరాబాద్ : గత 13 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ ల పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సంత్రుప్తి వ్యక్తం చేశారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు భేష్ అంటూ కితాబిచ్చారు.
ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ‘‘బూత్ స్వశక్తీకరణ్ అభియాన్’’ వర్క్ షాప్ సందర్భంగా ప్రజా గోస – బీజేపీ భరోసా పేరుతో నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ పట్ల ప్రజల్లో సానుకూల చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ సంస్థల నివేదికలు కూడా ఇవే చెబుతున్నాయన్నారు. ఇప్పటికే 6 వేలకుపైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పూర్తయ్యాయని… గడువు తేదీలోగా 10 వేలకుపైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని కోరారు.
ఈ సందర్భంగా పలు అధ్యక్షులు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల గడువు తేదీని పొడిగించాలని ముక్త కంఠంతో కోరారు. సానుకూలంగా స్పందించిన సునీల్ బన్సల్ మరో మూడు రోజులు గడువు పొడిగించారు. ఈనెల 28 నాటికి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను పూర్తి చేయాలని సూచించారు. చివరి రోజైన ఆదివారం సాయంత్రం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 5 వేల మందికి తగ్గకుండా సభలు నిర్వహించి జయప్రదం చేయాలని కోరారు.