Happy Birthday : 17న CM KCR జన్మదినం సందర్భంగా సీతారాముల కళ్యాణం

హైదరాబాద్ : ఈ నెల 17 న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 69 వ జన్మదినం సందర్భంగా, కెసిఆర్ గారి చిన్ననాటి గురువైన తెలుగు పండిట్ శ్రీ వేలేటి మృత్యుంజయ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు నల్లకుంట, కోరంటి హాస్పిటల్ ప్రక్కన పురాతన రామాలయం మందిరంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపతలపెట్టినారు. ఇట్టి కార్యక్రమంలో కెసిఆర్ గారి కుటుంభ సభ్యులతో పాటు 11 జంటలు ఈ కళ్యాణం లో పాల్గొంటారు.

భారత రాష్ట్ర సమితి పార్టీ కెసిఆర్ గారి నాయకత్వంలో దేశం మొత్తం విస్తరించి, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కెసిఆర్ గారు కీలకపాత్ర పోషించి, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే బలం ఆ భగవంతుడి కెసిఆర్ గారికి ప్రసాదించాలని, కెసిఆర్ గారు ఆయురారోగ్యాలతో పాటు వారు అనుకున్న లక్ష్యాలు నెరవేరేలా, భవిష్యత్తులో కెసిఆర్ గారు భారత ప్రధాని కావాలని, ఆ దేవుని ఆశిస్సులు వారికి వుండాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

ఇట్టి కార్యక్రమానికి వచ్చిన అతిధులకు తీర్థ ప్రసాదాలతోపాటు భోజన తాంబూలాలు ఏర్పాటు చేయడమైనది. కార్యక్రమం నిర్వహించువారు శ్రీమతి & శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి మాజీ చైర్మన్ తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మరియు BRS రాష్ట్ర నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X