हैदराबाद: शहर के पहाड़ी शरीफ में एक भीषण सड़क दुर्घटना में तीन की मौके पर ही मौत हो गई। यह हादसा पहाड़ीशरीफ थाना क्षेत्र में घटी है। गंभीर रूप से घायल दो अन्य लोगों का अस्पताल में इलाज चल रहा है। पुलिस को आशंका जताई है कि कार की तेज रफ्तार के कारण यह सड़क हादसा हुआ है। मृतकों में दो युवक और एक विवाहित महिला शामिल है।
पुलिस के मुताबिक, हुसैनी हलाम फते दरवाजा निवासी मोहम्मद साजिद (18) बजाज इलेक्ट्रॉनिक्स में काम करता है। मोहम्मद साजिद के साथ हसन नगर के मोहम्मद अकबर (22), लंगर हौज की नाजिया बेगम (23), नईमुद्दीन (21) और हसन नगर की मुस्कान मेहराज (22) बालेनो कार संख्या टीएस 13 एफए 2843 में शनिवार सुबह चंद्रायणगुट्टा से शादी के समारोह में भाग लेने के लिए निकले। तेज गति से जाते समय बीच सड़क पर अनियंत्रित होकर हार्डवेयर पार्क की रेलिंग से जा टकराई।
इस घटना में कार के परखच्चे उड़ गए और कार चला रहे मोहम्मद साजिद समेत मोहम्मद अकबर और नाजिया बेगम गंभीर रूप से घायल हो गए और उनकी मौके पर ही मौत हो गई। नई मुद्दीन और मुस्कान मेहराज गंभीर रूप से घायल हो गए। मृतक साजिद के पिता राज मोहम्मद की शिकायत के अनुसार पहाड़ी शरीफ पुलिस मामला दर्ज कर जांच कर रही है।
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే మృతి
హైదరాబాద్: నగరంలోని పహాడి షరీఫ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగంగా కారును నడపడం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు యువకులు, ఒక వివాహిత ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుస్సేని హాలం ఫతే దర్వాజ కు చెందిన మెహమ్మద్ సాజిద్ (18) బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో పని చేస్తుంటాడు. మొహమ్మద్ సాజిద్, హసన్ నగర్ కు చెందిన మొహమ్మద్ అక్బర్ (22), లంగర్ హౌజ్ కు చెందిన నజియా బేగం (23), హసన్ నగర్ కు చెందిన నయిముద్దీన్ (21), ముస్కాన్ మెహరాజ్ (22) లతో కలిసి శనివారం తెల్లవారుజామున టిఎస్ 13 ఎఫ్ ఏ 2843 నెంబర్ గల బాలెనో కారులో చాంద్రాయణ గుట్ట నుంచి మామిడి పెళ్లికి బయలుదేరారు. అతివేగంగా వెళ్తుండగా మార్గ మధ్యలో హార్డ్ వేర్ పార్క్ వద్ద అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కావడంతో పాటు కారును నడుపుతున్న మొహమ్మద్ సాజిద్ తో పాటు మెహమ్మద్ అక్బర్, నజియా బేగంలకు తీవ్ర గాయలయి, అక్కడికక్కడే మృతి చెందారు. నయీ ముద్దీన్, ముస్కాన్ మెహరాజ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సాజిద్ తండ్రి రాజ్ మొహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడి షరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)