RRR: ऑस्कर पर खर्च किए 80 करोड़, इस रकम से किया जा सकता था दस फिल्मों का निर्माण: तम्मारेड्डी भारद्वाज

हैदराबाद: आरआरआर (RRR) फिल्म पर पूरा देश गर्व महसूस कर रहा है। यह तेलुगु फिल्म ऑस्कर से एक कदम दूर है। अगर 12 मार्च को ऑस्क आता है तो हम तेलुगु वालों को और ज्यादा गर्व महसूस कर सकते हैं। हालांकि यह सब अच्छा है। सीनियर डायरेक्टर प्रोड्यूसर तम्मारेड्डी भारद्वाज ने आरआरआर पर कड़ी और गंभीर टिप्पणी की है। इस समय इससे जुड़ा वीडियो वायरल हो रहा है। तम्मारेड्डी ने RRR पर ऐसी टिप्पणी क्यों की? उनका असली इरादा क्या है? चलिए पूरे विवरण में जाते हैं …

सीनियर डायरेक्टर और प्रोड्यूसर तम्मारेड्डी भारद्वाज ने हाल ही में रवींद्र भारती में आयोजित एक कार्यक्रम में शिरकत की। फिल्म निर्माण कैसे बदल गया है, इस सवाल के जवाब में उन्होंने आरआरआर पर कठोर टिप्पणी की। उन्होंने कहा, “RRR टीम ने ऑस्कर प्रमोशन के लिए 80 करोड़ रुपये खर्च किए। अगर वे हमें वह 80 करोड़ देते हैं, तो हम 10 फिल्में बनाकर उनके मुंह पर फेंकते।” कुछ नेटिज़न्स अपनी राय व्यक्त कर रहे हैं कि यह सही नहीं है कि उन्होंने प्रचार पर इतना खर्च किया है। भले ही उनकी टिप्पणी आरआरआर को बदनाम करने का इरादा नहीं है।

फिल्म आरआरआर के निर्माण पर पांच सौ करोड़ रुपए से ज्यादा खर्च किया गया है। मेगा पावर स्टार राम चरण ने अल्लूरी सीतारामय्या की भूमिका निभाई और यंग टाइगर एनटीआर ने कोमूरम भीम की भूमिका में दिखाई दिये हैं। फिल्म एक काल्पनिक अवधि के नाटक के रूप में शुरू होती है जिसमें अल्लूरी और भीम आजादी के लिए एक साथ लड़ने की कहानी को प्रतिबिंब करती है। दरअसल भारत सरकार ने RRR को ऑस्कर में नहीं भेजा। इसके साथ ही राजामौली और उनकी टीम मैदान में उतरी और एक बड़ी रकम खर्च कर उसे अमेरिकी वितरकों के जरिए ऑस्कर नामांकन के लिए भेजा।

बाद में आरआरआर को हॉलीवुड क्रिटिक्स एसोसिएशन सहित कई अंतरराष्ट्रीय पुरस्कार मिले। इस फिल्म के नाटू नाटू गीत… को मूल गीत श्रेणी में ऑस्कर के लिए नामांकित किया गया है।

RRR: ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు : తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ

హైదరాబాద్ : RRR సినిమా గురించి దేశం యావ‌త్తు చాలా గ‌ర్వ‌ప‌డుతోంది. తెలుగు సినిమా ఆస్కార్‌కి అడుగు దూరంలో నిలిచింది. మార్చి 12న ఒక‌వేళ ఆస్కార్ వ‌స్తే మాత్రం తెలుగు వాళ్ల‌మైనంద‌కు మ‌నం మ‌రింత‌గా గ‌ర్వ‌ప‌డొచ్చు. ఇదంతా బాగానే ఉన్నా.. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాత్రం RRRపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. అస‌లు ట్రిపులార్‌పై త‌మ్మారెడ్డి ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు. అస‌లు ఆయ‌న ఉద్దేశం ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే…

రీసెంట్‌గా ర‌వీంద్ర భార‌తిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ పాల్గొన్నారు. సినిమా మేకింగ్ అనే ఎలా మారింద‌నే ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆయ‌న మాట్లాడుతూ RRRపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘‘ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం RRR Team 80 కోట్లు ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు మాకు ఇస్తే ఓ 10 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం’’ అన్నారు. ఆయ‌న ఉద్దేశంలో ఆర్ఆర్ఆర్‌ను కించప‌ర‌చాల‌నే ఉద్దేశం లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ కోసం ఇంత ఖ‌ర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టాన‌ర‌టం క‌రెక్ట్ కాద‌ని నెటిజ‌న్స్ కొంద‌రు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

RRR సినిమాను దాదాపు ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఖ‌ర్చు పెట్టి చిత్రీక‌రించారు. అల్లూరి పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌రణ్‌, కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించారు. స్వాతంత్య్రం కోసం అల్లూరి, భీమ్ క‌లిసి పోరాడితే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరెక్కించారు. నిజానికి ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ RRR ను ఆస్కార్‌కు పంప‌లేదు. దీంతో రాజ‌మౌళి అండ్ టీమ్ రంగంలోకి దిగి భారీ మొత్తాన్ని ఖ‌ర్చు పెట్టి అమెరిక‌న్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా ఆస్కార్ నామినేష‌న్స్‌కు పంపారు.

త‌ర్వాత RRR కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్స్ స‌హా ప‌లు అంతర్జాతీయ అవార్డులెన్నో వ‌చ్చాయి. ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్… ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X