హైదరాబాద్ : ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అని కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్రం ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.
మల్లు రవి మాట్లాడుతూ … కేటీఆర్ అనాలోచితంగా మాట్లాడుతున్నరు. బిఆర్ఎస్ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న మీ నాయకులు పొలిటికల్ టూరిస్టులేనా? టిఎస్ పిఎస్సీ పేపర్ లీకేజీలో ఇద్దరే ఉన్నారని కేటీఆర్ ఎలా చెబుతారు.
మీ దర్యాప్తు సంస్థ సిట్ రిపోర్ట్ ఇవ్వకముందే ఎలా ప్రకటిస్తారు. కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారు. రేవంత్ రెడ్డిని గాడ్సేతో పోల్చడాన్ని ఖండిస్తున్నాం. ప్రియాంక గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి,లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
Related News: