सड़क हादसा: मुस्कान निजी ट्रैवल्स बस महबूब घाट पर पलटी, एक की मौत, तीन अन्य गंभीर रूप से घायल

हैदराबाद : आदिलाबाद से 50 यात्रियों को लेकर हैदराबाद जा रही मुस्कान ट्रैवल्स की एक निजी बस गुरुवार सुबह निर्मल जिले के सारंगपुर मंडल के महबूब घाट पर पलट गई। आदिलाबाद की फरहाना (20) की बेहतर चिकित्सा के लिए हैदराबाद ले जाते समय मौत हो गई, जबकि 25 लोग घायल हो गए और दो की हालत गंभीर है। एक अन्य को हैदराबाद स्थानांतरित कर दिया गया।

इस मौके पर बस में सफर कर रहे यात्रियों ने बताया कि आदिलाबाद से हैदराबाद जाने के दौरान ड्राइवर महबूब घाट पर आते ही चालक ने तेज रफ्तार चलाने के कारण बस अनियंत्रित होकर पलट गई, जिससे सभी यात्री घायल हो गए। इस हादसे में दोनों की हालत गंभीर है। इस दौरान किसी के पैर टूटे हैं तो किसी के हाथ और कमर टूटी है।

यह भी पढ़ें-

Road Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఒకరు మృతి, ముగ్గురు సీరియస్

హైదరాబాద్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్స్‌పై ఆదిలాబాద్ నుండి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు గురువారం తెల్లవారు జామున బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్‌కు చెందిన ఫర్హాన (20) సంవత్సరాల యువతి మృతి చెందింది. మరొకరిని హైదరాబాద్ తరలించారు.

ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో మహబూబ్ ఘాట్స్ వద్దకు రాగానే డ్రైవర్ అతివేగంగా నడపడంతో కంట్రోల్ తప్పి బోల్తా పడిందని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కొందరికి కాళ్లు విరిగితే, కొందరికి చేతులు, నడుము విరిగాయని తెలిపారు.

గాయపడ్డ ప్రయాణికులకు సేవలు అందించిన నిర్మల్ యువకులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఒక డ్యూటీ డాక్టర్ తప్ప మరో వైద్యుడు లేరని, సూపరిండెంట్‌కు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రయాణికులు చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారని జిల్లా మెడికల్ ఆసుపత్రి నిర్మల్‌లో ఉండి ఏం ప్రయోజనం అని అత్యవసర వైద్య సేవలు అందించలేని ఆసుపత్రి ఎందుకని ప్రశ్నించారు . రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోర్లా పడిందని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయని వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X