“పేద ప్రజలు సన్నబియ్యం తినడం బిఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేనట్లు ఉంది”

ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన కారు పార్టీ నాయకులు కారు కూతలు కుయటం మానడం లేదు

రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం

దాలరులను నమ్మి రైతులు మోసపోవద్దు

మాది చేతల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది

తెలంగాణ పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

హైదరాబాద్ : గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఐకేపీ సెంటర్ల పెంచి సులువుగా రైతులు అమ్ముకునేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోల్లు ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష తరుగు, తాలు పేరుతో కోతలు లేవు.. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ.. ఈ దఫా మిల్లర్ల దోపిడీ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో కోతలకు మిల్లర్ల స్వస్తి..దీంతో ప్రతి కింటా పై రైతుకు 150 నుంచి 200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూరేలా పకడ్బందీగా ప్రభుత్వం పని చేస్తుంది రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు.. గతంలో 45 రోజులు పెట్టేది. రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడు. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుంది దీంతో రైతుకు వడ్డీ వ్యాపారుల వేధింపులు లేవు. వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవంతో ఇప్పుడు రైతు బతుకుతున్నడు.

కెసిఆర్ ప్రభుత్వంలో ఫాసల్ బీమా యోజన లేదు. ఉంటే కనీసం పంట నష్టపరిహారం వచ్చేది. అయినప్పటికీ కాంగ్రెస్ రైతు ప్రభుత్వం కాబట్టి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తోంది తడిచిన ధాన్యాన్ని సైతం ఈ ప్రభుత్వం సేకరిస్తుంది. గతంలో కల్లాల్లో వరికుప్పలమీద రైతులు గుండె పగిలి చనిపోయారు. కానీ మాది రైతు ప్రభుత్వం అని తెలిసి రైతులు గుండె ధైర్యంతో బతుకుతున్నారు.తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు 500 బోనస్. తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో సన్న బియ్యం పేరుతోటి దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారు. అలా కాకుండా పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి సన్నబియాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ఇది కూడ చదవండి-

అందుకే మనం దొడ్డు వడ్లు అమ్ముకొనుడెంది, సన్న వడ్లు కొనుక్కునుడేంది.. మనమే మనకు అవసరమైనంత సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టాము. నాట్లేసుకునే సమయం దగ్గర పడుతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీమును ప్రవేశపెట్టాము. భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీములు వర్తింప చేస్తాము. దొడ్డు వడ్లకు 500 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేకపోయినా…మూడు నుంచి ఐదు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తూ, మిల్లర్ల ధాన్యం కోతను అరికడుతూ.. ప్రత్యక్షంగా అంతమేరా రైతుకు ఈ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. అది తెలుసు కనుకనే తెలంగాణ రైతులు నిశ్చింతగా ఉన్నారు. రైతులను కాల్చుకుతిన్న టిఆర్ఎస్ అగ్ర నాయకులు ఇప్పుడు రైతుల పేర నాటకాలు ఆడుతున్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని 2020లో కెసిఆర్ ప్రకటించారు. ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్న నయా పైసా బోనస్ ఇయ్యలేదు అందుకే కేసిఆర్ ను ఓడగొట్టి రైతులు ఇంట్లో కూర్చోబెట్టారు.

ఇది ప్రజా ప్రభుత్వం. ఎక్కడ దుబార చేయకుండా.. కెసిఆర్ అస్తవ్యస్థం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. త్వరలో అన్ని హామీలను నిలబెట్టుకుంటాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీల అమలు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పాము..ప్రారంభించి చూపించాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతాం మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మంత్రి సీతక్క గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ బ్లాక్,మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X