हैदराबाद: तेलंगाना के जडचर्ला नगर पालिका के माचाराम पुल पर 15 अगस्त को सुबह करीब 5.30 बजे एक वोल्वो बस ने लॉरी को पीछे से टक्कर मार दी। इस हादसे में तीन लोगों की मौत हो गई। सीजीआर ट्रैवल की वोल्वो बस 35 यात्रियों को लेकर कडपा से हैदराबाद के लिए रवाना हुई।
इसी क्रम में जडचर्ला मंडल के माचाराम पुल पर पहुँचते ही वोल्वो बस ने एक लॉरी को पीछे से टक्कर मार दी। इस हादसे में बस चालक और दो यात्रियों की मौके पर ही मौत हो गई, जबकि अन्य यात्री गंभीर रूप से घायल हो गए। घायलों को इलाज के लिए स्थानीय जिला अस्पताल में भर्ती कराया गया है। मृतकों की पहचान हैदराबाद के कुकटपल्ली इलाके की लक्ष्मी देवी (65) और राधिका (45) के रूप में की गई है।

मृतक दो यात्री में सास और बहू, अपने दूसरे बेटे और बहू के साथ कडपा में एक शुभ समारोह में शामिल होकर लौट आते समय यह हादसा हुआ। बताया जा रहा है कि घायलों में से लगभग 10 की हालत गंभीर बताई जा रही है। अतिरिक्त पुलिस अधीक्षक रत्नम ने घटनास्थल पर पहुँचकर घटनास्थल का निरीक्षण किया। लॉरी और बस दुर्घटना से राष्ट्रीय राजमार्ग 44 पर भारी यातायात जाम हो गया। संदेह कर रहे हैं कि दुर्घटना का कारण वोल्वो बस चालक की लापरवाही रही है।
లారీని వెనుక నుంచి ఢీకొట్చిన వోల్వో బస్సు, ముగ్గురు మృతి
హైదరాబాద్ : ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలోని మాచారం బ్రిడ్జ్‌పై ఉదయం 5.30 ప్రాంతంలో చోటుచేసుకుంది. కడప నుంచి 35 మంది ప్రయాణికులతో సీజీఆర్ ట్రావెల్ వోల్వో బస్సు హైదరాబాద్‌కు బయలుదేరింది.
ఈ క్రమంలోనే జడ్చర్ల మండల పరిధిలోని మాచారం బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతులు హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి (65), రాధిక (45)గా గుర్తించారు.
మృతి చెందిన ఇద్దరు ప్రయాణికులు అత్తా, కోడళ్లు కాగా వారితో పాటు మరో కొడుకు కోడలితో కలిసి కడపలో ఓ శుభకార్యానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో సుమారు 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ రత్నం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. లారీ, బస్సు రోడ్డు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారి 44పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదానికి కారణం వోల్వో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే అయి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)
