రోడ్డు ప్రమాదం: టిఎస్‌ఆర్‌టిసి బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి, ఆపకుండా వెళ్లిపోయాడు డ్రైవర్

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… కరీంనగర్‌ జిల్లా మానకొండుర్‌ మండలం రాజీవ్‌ నగర్‌ కాలనీ సమీపంలో బుధవారం ఉదయం వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పాదచారులపై నుంచి దూసుకెళ్లింది. మృతులను పస్తం లచ్చవ్వ(40), పోచవ్వ(37)గా గుర్తించారు.

మహిళలు ఎప్పటిలాగే పొలాల్లో పని చేసేందుకు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X