Yatra For Change : रेवंत रेड्डी ने किये वेमुलावाड़ा श्री राजराजेश्वर स्वामी के दर्शन

हैदराबाद: टीपीसीसी के अध्यक्ष रेवंत रेड्डी ने वेमुलावाड़ा में श्री राजराजेश्वर स्वामी के दर्शन किये। भगवान को गाय का भोग लगाकर विशेष पूजा की गई। उन्होंने कहा कि वह भक्तों की मनोकामना पूरी करने वाले राजन्ना के दर्शन करके प्रसन्नता हो रही है। उन्होंने धोखाधड़ी के लिए केसीआर की आलोचना करते हुए कहा कि वे वेमुलावाड़ा मंदिर का विकास करेंगे। उन्होंने कहा कि कांग्रेस के समय मंदिर का विकास हुआ।

रेवंत रेड्डी ने मांग की कि सरकार को मिडमनेरू के पीड़ितों की मदद करनी चाहिए। उन्होंने पूछा कि केसीआर के परिवार के सदस्यों को मदद किया और आदिवासियों को क्यों नहीं दिया है। सवाल किया कि रईसों को एक नीती और आदिवासियों के लिए एक नीति है।

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని  దర్శించుకున్నారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాటతప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్  హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందన్నారు. 

మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరజనులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. దొరలకు ఓ నీతి గిరిజనులకుఓ నీతా అని ప్రశ్నించారు.

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి. వేదాశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం.

ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలిపెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు. దొరలకు ఒక నీతి… గిరిజనులకు ఒక నీతా? మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలి. కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X