हैदराबाद: तेलंगाना में एक और नई पार्टी के उदय होने को तैयार है। तीनमार मल्लन्ना द्वारा स्थापित की जाने वाली नई पार्टी को ‘तेलंगाना निर्माण पार्टी’ के नाम से चुनाव आयोग में आवेदन किया है। चुनाव आयोग की वेबसाइट पर एक घोषणा जारी कर पूछा गया कि क्या पार्टी के नाम पर कोई आपत्ति है। इसमें कहा गया कि इस माह के अंत से पहले आपत्तियां एवं शिकायतें प्राप्त कर ली जाएंगी।
तीनमार मल्लन्ना तेलंगाना निर्वाण पार्टी के अध्यक्ष हैं, जबकि मादम रजनी कुमार (धर्मसागर, हनमाकोंडा जिला) महासचिव हैं, आर भावना (चंपापेट, सरुरनगर, हैदराबाद) कोषाध्यक्ष हैं। मालूम हो कि तीनमार मल्लन्ना ने घोषणा की थी कि वह इस साल अप्रैल में नई पार्टी बनाएंगे। इसी क्रम में नई पार्टी के नाम का भी ऐलान कर दिया है।
चर्चा है कि तीनमार मल्लन्ना अगले विधानसभा चुनाव में मेडचल निर्वाचन क्षेत्र से चुनाव लड़ेंगे। इसके अलावा, तेलंगाना निर्माण पार्टी राज्य के 119 निर्वाचन क्षेत्रों में चुनाव लड़ेगी। इस अवसर पर मलन्ना ने कहा कि अगर सरकार विरोधी वोट बंट भी गए, तो इससे उन्हें कोई लेना-देना नहीं है. वे केसीआर के खिलाफ है और रहेंगे, विपक्षी पार्टियों के विरोध नहीं है। मल्लन्ना ने कहा कि अगर विपक्षी दल उनके साथ काम करने के लिए आगे आते है तो स्वागत है।
आपको बता दें कि तीनमार मल्लन्ना अपने क्यू न्यूज यू ट्यूब चैनल में सीएम केसीआर के खिलाफ लगातार समाचार प्रसारित करते है। मल्लन्ना की भाषाशैली पर विवाद है। उनके खिलाख अनेक मामले दर्ज है। जेल भी गये और बेल पर बाहर आये हैं।
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ, పేరు ఫైనల్
హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి సిద్ధమైంది. తీన్మార్ మల్లన్న స్థాపించబోయే కొత్త పార్టీని ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఈసీ వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెలాఖరు లోపు అభ్యంతరాలు, ఫిర్యాదు స్వీకరిస్తామని తెలిపింది.
తెలంగాణ నిర్మాణ పార్టీ అధ్యక్షుడుగా తీన్మార్ మల్లన్న, ప్రధాన కార్యదర్శిగా మాదం రజనీ కుమార్ (హన్మకొండ జిల్లా ధర్మసాగర్), కోశాధికారిగా ఆర్ భావన (చంపాపేట్, సరూర్‌నగర్, హైదరాబాద్) ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో తీన్మార్ మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ పేరును కూడా అప్పుడే ప్రకటించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మేడ్చల్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రచారం ఉంది. అంతేకాదు తెలంగాణ నిర్మాణ పార్టీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినా తమకేం సంబంధం లేదని.. తాము కేసీఆర్‌కు వ్యతిరేకమని.. ప్రతిపక్ష పార్టీలకు కాదన్నారు. తమతో కలిసి పని చేసేందుకు ఏ ప్రతిపక్ష పార్టీ ముందుకు వచ్చినా స్వాగతిస్తామన్నారు మల్లన్న. (ఏజెన్సీలు)