ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన, పరేడ్ గ్రౌండ్ ను సందర్శించిన బండి సంజయ్, కె లక్ష్మణ్ తదితరులు (E)

హైదరాబాద్ : ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు.

• రూ.2,400 కోట్ల వ్యయంతో రైల్వే అభివ్రుద్ది పనులు ప్రారంభించనున్న ప్రధాని

• రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ

• రూ.1231 కోట్లతో సికింద్రాబాద్-మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులు

• రూ.521 కోట్లతో ఖాజీపేట కోచ్ వర్క్ షాప్ పనులు

• 19న వందేభారత్ రైలు ప్రారంభం సందర్భంగా వివిధ అభివ్రుద్ధి పనులు చేపట్టనున్న మోదీ

• దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ

• ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శన, ఏర్పాట్లపై చర్చ

• అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సందర్శన

ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ ఈరోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను సందర్శించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వందే భారత్ రైలు ప్రారంభంతోపాటు ఆరోజు ప్రధాని ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 19న మొత్తం రూ.2400 కోట్ల వ్యయంతో రైల్వేకు సంబంధించి వివిధ అభివ్రుద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు బండి సంజయ్, లక్ష్మణ్ లకు వివరించారు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను, చేపట్టాల్సిన ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బండి సంజయ్, లక్ష్మణ్ రైల్వే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం బండి సంజయ్ తో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన కార్యక్రమాలకు వివరించారు. ఆయనేమన్నారంటే…

• తెలంగాణ ప్రయోజనాల విషయంలో సంకోచించకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలోని జాతీయ రహదారులను నిర్మాణాన్ని కేంద్రం చేపట్టింది. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానానికి చేరుకుంది.

• అట్లాగే రైల్వే లేన్, డబ్లింగ్, ఎంఎంటీఎస్, గేజ్ మార్పిడీ పనులను కేంద్రం పెద్ద ఎత్తున చేపట్టింది. అందులో భాగంగా ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్-విశాఖపట్నం వరకు ‘వందేభారత్’ రైలును జెండా ఊప లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనిద్వారా ప్రయాణీకులకు మూడున్నర గంటట సమయం ఆదా కానుంది. ఈ నేపథ్యంలో రూ.2400 కోట్లతో వివిధ రైల్వే అభివ్రుద్ధి పనులను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించబోతున్నారు.

• సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునికించడంలో సుమారు రూ.700 కోట్లతో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అట్లాగే ఖాజీపేట ఓరాలింగ్ వర్క్ షాప్ పనులను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు.

• అట్లాగే రూ.1231 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభించనున్నారు.

• ఇప్పటికీ ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ గ్రామాల నుండి పట్టణాలకు అనుసంధానిస్తున్నారు. దీంతోపాటు నదుల అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

• తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ… ‘‘నూతన సంవత్సర కానుకగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో రైల్వే అభివ్రుద్ధి పనుల కోసం రూ.2400 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయబోతున్నారు. తెలంగాణకు ప్రయోజనాలకు ప్రధాని పెద్ద పీట వేస్తున్నప్పటికీ….. అబద్దాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఈ పర్యటనతోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా’’అని వివరించారు.

• అనంతరం బండి సంజయ్, లక్ష్మణ్ నేరుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.

Prime Minister Narendra Modi visit to Hyderabad on January 19

Hyderabad: Prime Minister Narendra Modi will be on a lightening visit to Hyderabad on January 19 to launch various development works worth Rs 2,400 crore related to South Central Railways, besides flagging off the Vande Bharat Express train at Secunderabad.

The developmental works to be launched by the Prime Minister include modernisation of Seunderabad railway station at a cost of Rs 700 crore, doubling of railway line between Secunderabad and Mahabubnagar at a cost of Rs 1,231 crore and works on Kazipet railway coach workshop at a cost of Rs 521 crore.

Disclosing this to reporters after holding discussions with the officials of the South Central Railways on Monday, Bharatiya Janata Party Telangana unit president and Karimnagar MP Bandi Sanjay said he, along with BJP parliamentary party board member and Rajya Sabha member Dr K Laxman visited the Secunderabad railway station to oversee arrangements for the Prime Minister’s visit.

Sanjay said Modi had laying uncompromising stand on protecting the interests of Telangana. “The Central government had already taken up national highway development in the state at a cost of Rs 1.04 lakh crore, taking Telangana to No. 2 position in the country,” he said.

Similarly, the Centre had sanctioned several railway projects in the state including doubling of railway lines, MMTS and gauge conversion projects in a big way. “On January 19, the Prime Minister will come to the state to formally flag off Vande Bharat Express train from Secunderabad to Visakhapatnam, which will reduce the travelling time between the two stations by three and a half hours,” he said.

While laying foundation stone for modernisation of the Secunderabad railway station on international standards at a cost of Rs 700 crore, Modi would also start Kazipet railway coach overhauling workshop works through remote control, Sanjay said.

He reminded that the road network between the villages and towns was being developed under PM Sadak Yojana in a big way. Besides, the Modi government has also taken up river-linkage project. “I hope these programmes would be an eye-opener to the Bharat Rashtra Samithi leaders who have launched a false propaganda against the Centre and the Prime Minister,” the BJP state president said.

Later, Sanjay and Laxman visited Secunderabad Parade Grounds to oversee the arrangements for the meeting of the Prime Minister who would address the gathering after launching various projects.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X