ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచుల ఆత్మ శాంతి చేకూరాలని ధర్నా కార్యక్రమంలో 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు

హైదరాబాద్ : గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేసి నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచుల ఆత్మ శాంతి చేకూరాలని ధర్నా కార్యక్రమంలో 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ధర్నా చౌక్ వద్ద ప్రారంభమైన సర్పంచుల సమస్యల పరిష్కారనీకై ధర్నా. నిధులు, విధుల పై సర్పంచుల శంఖారావం పేరుతో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా.

ధర్నా లో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, అనిల్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ధర్నా లో పాల్గొన్న TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, TPCC ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్.

ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…

“రాష్ట్రంలో సర్పంచుల నిధులు, హక్కుల కాపాడటం కోసం ఈ ధర్నా. గ్రామ స్వరాజ్యం తోనే రాష్ట్ర దేశం అభివృద్ధి జరుగుతుంది. కేవలం ఎన్నికలు నిర్వహణ ద్వారా అభివృద్ధి జరగదని, గ్రామ పంచాయతీల నిధులు కేటాయించాలని రాజీవ్ రోజ్ గారీ యోజన ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి గ్రాంటు, ఇతర గ్రాంటులు నిలిపివేస్తూన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విధుడల చేయకపోగా, కేంద్రం విదుడల చేసిన నిధులు అడ్డుకుంటున్నారు. ఎన్నికల వరకు అప్పులు చేయడం కాదు, అభివృద్ధి చేయడానికి అప్పులు చేసి సర్పంచులు అతహత్యాలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య లకు రాష్ట్ర ప్రభుత్వం భాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్ళిస్తుంది, కేంద్రం వేరే ఖాతాలు ఓపెన్ చేయిచడం ద్వారా విశ్వాసం కోల్పోయిందని చెప్పడంలో సందేహం లేదు.”

“పంచాయితీలు అభివృద్ధి అని గొప్పలు చెప్పుకునే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రాజీనామ చెయ్యాలి. నేర పూరిత ఆలోచన తో నిధులు మల్లించినందువల్ల కేసులు పెట్టాలి. ట్రాక్టర్ ఏజెన్సీల కమీషన్ల కు కకృతి పడి ట్రాక్టర్లు కొనాలని ఒక గుది బండ పంచాయతీల మీద వేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ,ఎస్టీ సర్పంచులకైన కనీసం నిధులు వెంటనే సమకూర్చాలి. ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీల ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఇవ్వలేదు. ఏకగ్రీవం కాకుండా ఎన్నికల్లో తాగి తందనలు ఆడితే అబ్కారీ శాఖకు ఆదాయం వస్తుండే అని ప్రభుత్వం ఆలోచిస్తుంది.”

“గ్రామ పంచాయతీల కు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు తప్ప కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి నిధులు రాలేదు. NRIG నిధులు లేకపోతే ప్రతి సర్పంచ్ రాజీనామాలు చేసేవారు. సర్పంచుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ ఎప్పటికీ అండగా ఉంటుంది. అవసరం అయితే న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీలకు కనీస సమాచారం లేకుండా నిధుల మళ్లింపు చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టాలి. కలెక్టర్ కాంపౌండ్ లో పెట్టిన చెట్లు బతకకపోయి కలెక్టర్ బాధ్యత వహిస్తాడా. విధి దీపాలు కరెంటు బిల్లులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. ట్రాక్టర్ ల EMI లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీల బలోపేతం కోసం, ట్రాక్టర్ల EMI లు, విధి దీపాలు కరెంటు బిల్లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బరించెల మొదటి శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టీ సర్పంచులు అండగా ఉంటాం.”

మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ…

“చెట్లు పెరగక పోతే సర్పంచుల సస్పెండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీల ఖాతాలలో నిధులు ఉన్నట్లు చూపిస్తూనే, డ్రా చేయడానికి విలు లేకుండా కాజేశారు. గ్రామ పంచాయతీల ఖాతాలలో ఉన్న నిధులను ట్రెజరీ కి చూపించి రుణాలు పొందే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేసిఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు. ప్రజాస్వామ్యం ఒక దేవాలయం, అసెంబ్లీ అంటే కేసిఆర్ కి గౌరవం లేదు. అసెంబ్లీ మీద ప్రజల కు ఉన్న నమ్మకం కాపాడాలని మర్రి చెన్నారెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చెప్పేవారు. 73, 74 సవరణల వల్ల గ్రామ పంచాయతీలకు ఇచ్చిన హక్కులను తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తెనే పూర్తిగా వస్తాయి.”

కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి మాట్లాడుతూ…

“స్థానిక సంస్థల బలోపేతం కోసం 73,74వ సవరణ చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కు వ్యతిరేకంగా తెలంగాణ లో తుతు మంత్రంగా నిధులు సమకూర్చుతున్నరు. సర్పంచులకు అధికారాలు అసలే లేవు, నిధులు రావు. అప్పులు చేసి నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఛాంబర్ లో వాదనలు జరిపిన తర్వాత సస్పెండ్ చేసేది. సర్పంచ్ లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు ఎక్కడిది. సస్పెండ్ చేసే అధికారం సీఎం కలెక్టర్లకు అందించడం దుర్మార్గం.”

మల్లు రవి, సీనియర్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ…

“రాష్ట్ర ప్రభుత్వం ఒక నితంతలగా పని చేస్తుంది. సర్పంచుల సమస్యలు, నిధుల విడుదల విషయంలో ఒక ప్రతిపక్షపార్టీ గా మేము ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తామంటే సాయంత్రం 5 గంటల తర్వాత అనుమతి ఇవ్వకుండా రద్దు చేశారు. కోర్ట్ నుంచి అనుమతి తీస్కొని, పోలీసుల నుంచి అనుమతి తీస్కొని ధర్నా చేస్తుంటే మళ్ళీ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులను, సర్పంచులను అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇలా కోర్ట్ ఆదేశాలను కూడా ధిక్కరించి నాయకులను నిర్బంధించి ధర్నా కు రాకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులకు నిధులు నేరుగా విడుదల చేసి గ్రామాభివృద్ధి ఎంతో సహకారం అందించారు. కానీ నేడు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమే కాదు.. ఊరిలో చెట్టు పెరగనున్న.. నీళ్లు రానున్న సస్పెండ్ చేస్తాం అంటూ కలెక్టర్ లు బెదిరిస్తున్నారు. ఈ విషయాలపై కాంగ్రెస్ సర్పంచులకు అండగా ఉంటుంది. హక్కులు సాధించే వరకు పోరాటం చేద్దాం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X