नई दिल्ली/हैदराबाद: प्रधानमंत्री नरेंद्र मोदी ने पेरिस ओलंपिक में रजत पदक जीतने वाले भालाफेंक स्टार नीरज चोपड़ा को बधाई दी है। कहा है कि वह उत्कृष्टता के साकार रूप हैं। तोक्यो ओलंपिक के स्वर्ण पदक विजेता नीरज ने 89.45 मीटर का थ्रो फेंककर पेरिस में रजत पदक हासिल किया। प्रधानमंत्री मोदी ने एक्स पर उन्हें बधाई देते हुए लिखा, “नीरज चोपड़ा उत्कृष्टता का साकार रूप हैं। बार बार उन्होंने अपनी श्रेष्ठता की बानगी दी है। भारत हर्षित है कि उन्होंने एक बार फिर ओलंपिक में सफलता पाई है।”
पीएन ने कहा, “रजत जीतने पर उन्हें बधाई। वह आने वाले असंख्य एथलीटों को अपने सपने पूरे करने और देश को गौरवान्वित करने के लिए प्रेरित करते रहेंगे।” वहीं, राष्ट्रपति द्रौपदी मुर्मू ने लिखा- पेरिस ओलंपिक में रजत पदक जीतने और इतिहास रचने पर नीरज चोपड़ा को हार्दिक बधाई। वह लगातार दो ओलंपिक खेलों में स्वर्ण और रजत पदक जीतने वाले पहले भारतीय एथलीट हैं। भारत को उन पर गर्व है। उनकी यह उपलब्धि आने वाली पीढ़ियों को प्रेरित करेगी। भारत को उम्मीद है कि नीरज चोपड़ा भविष्य में और भी पदक और गौरव लाएंगे।
ज्ञातव्य है कि भारत के स्टार खिलाड़ी नीरज चोपड़ा ने लगातार दो ओलंपिक पदक जीते हैं। तोक्यो ओलंपिक में उन्होंने स्वर्ण पदक जीता था, लेकिन इस बार उन्होंने 89.45 मीटर पर रजत पदक जीता। भाला फेंक के फाइनल में 92.97 मीटर के शानदार थ्रो के साथ पाकिस्तान के अरशद नदीम ने ओलंपिक रिकॉर्ड तोड़ते हुए स्वर्ण पदक जीता। ग्रेनेडा के एंडरसन पीटर्स 88.54 मीटर के थ्रो के साथ तीसरे स्थान पर रहे। नीरज चोपड़ा ने पुरुषों की भाला फेंक क्वालीफिकेशन राउंड में 89.34 मीटर का थ्रो किया और फाइनल में अपनी जगह पक्की की। इस थ्रो ने इस इवेंट में उनका दूसरा सर्वश्रेष्ठ प्रदर्शन दर्ज किया, जो 2022 में स्टॉकहोम डायमंड लीग में हासिल किए गए उनके व्यक्तिगत सर्वश्रेष्ठ 89.94 मीटर से थोड़ा कम है। (एजेंसियां)
यह भी पढ़ें-
పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌కు రజతం
హైదరాబాద్ : పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అతను శ్రేష్ఠత యొక్క స్వరూపుడు అని కోనియాడారు. పారిస్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత నీరజ్ 89.45 మీటర్లు విసిరి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ ప్రధాని మోదీ, “నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రతిరూపం. పదే పదే అతను తన ప్రతిభను చాటుకున్నాడు. ఒలింపిక్స్‌లో మరోసారి విజయం సాధించడం పట్ల భారతదేశం ఆనందంగా ఉంది” అని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచి సంచలనం సృష్టించిన అతను ఈ సారి కూడా గోల్డ్ మెడల్ సాధిస్తాడని అంతా భావించారు. అయితే, అతను సిల్వర్ మెడల్‌తో సరిపెట్టాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ 89.45 మీటర్ల ప్రదర్శనతో రజతం దక్కించుకున్నాడు.
తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన అతను రెండో ప్రయత్నంలో బల్లాన్ని 89.45 మీటర్లు విసిరి రెండో స్థానానికి దూసుకెళ్లాడు. కెరీర్‌లో నీరజ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల ప్రదర్శనతో ఒలింపిక్ వరల్డ్ రికార్డు సృష్టించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో ఈ పోటీ అర్షద్, నీరజ్ మధ్య అన్నట్టు సాగింది.
అయితే, నీరజ్ మిగతా ప్రయత్నాల్లో 90 మీటర్ల మార్క్‌ను అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. నీరజ్ కూడా నమ్మకంగా కనిపించాడు. కానీ, అతను మిగతా ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఐదింట అతను ఫౌల్ చేయడం గమనార్హం. అయితే, మిగతా అథ్లెట్లలో ఎవరూ నీరజ్ ప్రదర్శనను అధిగమించలేకపోయారు. దీంతో నీరజ్ రెండో స్థానాన్ని కాపాడుకుని సిల్వర్ మెడల్ సాధించాడు. ఇప్పటివరకు ఈ విశ్వక్రీడల్లో భారత్‌కు ఇదే తొలి రజతం.
మరోవైపు, అర్షద్ 92.97 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. దీంతో పాక్‌కు అథ్లెటిక్స్‌లో తొలి పతకంతోపాటు మొదటి గోల్డ్ మెడల్ అందించిన అథ్లెట్‌గా అర్షద్ రికార్డు నెలకొల్పాడు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 88.5 మీటర్ల త్రో కాంస్యం గెలుచుకున్నాడు. నీరజ్‌కు వరుసగా ఇది రెండో ఒలింపిక్ మెడల్. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. దీంతో నీరజ్ డబుల్ ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత అథ్లెట్ల జాబితాలో చేరాడు. అతని కంటే ముందు సింధు, మను భాకర్, సుశీల్ కుమార్ ఈ ఘనత సాధించారు. (ఏజెన్సీలు)