“Praja Sagrama Yatra-5” Update: 8వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, ఈ రోజు 14.3 కిలోమీటర్ల

BREAKING

Hyderabad:

డా. గంగిడి మనోహర్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ & రాష్ట్ర ఉపాధ్యక్షుడు:

5వ విడత పాదయాత్రలో స్వల్ప మార్పు

ఈనెల 16న కరీంనగర్ లో ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిస్తుంది. కరీంనగర్ లోని SRS కాలేజ్ గ్రౌండ్స్ లో ముగింపు సభ

ముగింపు సభకు ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారు. నడ్డా గారికి 16న మాత్రమే అనుకూలమని చెప్పడంతో పాదయాత్ర ను ఒక రోజు కుదించాం. డైలీ నడిచే కిలోమీటర్ల సంఖ్యను పెంచి, ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే పాదయాత్ర ను పూర్తి చేస్తాం.

“బీజేపీ నేతల ప్రెస్ మీట్ @ నర్సాపూర్ లంచ్ శిబిరం’

సోయం బాపూరావు, ఆదిలాబాద్ ఎంపీ కామెంట్స్:

“ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నిన్న మేము నిర్మల్ లో సభ పెట్టాం. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎలా భూ కబ్జాలకు పాల్పడ్డారు వివరించారు. అల్లకల్లోలం అయి ఐకే రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. చెరువు భూముల విషయంలో హైకోర్టు స్పందించి, ఎందుకు కమిటీ ని పంపింది? మీ అవినీతి ఏంటో ప్రజలకు తెలుసు… ప్రజలే సాక్ష్యం. 25 ఏళ్ల క్రితం సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మింది మీరు కాదా? మీ అవినీతి ని పూర్తిస్థాయిలో బయటికి తీస్తాం. D1 పట్టాలు ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా మాకు తెలుసు. అల్లోల కుటుంబం దోపిడీకి ఎలా పాల్పడిందో ప్రజలకు తెలీదా? సోయం బాపురావు గాలిలో గెలిస్తే… మరి నువ్వెలా గెలిచావ్ ఐకే రెడ్డి? ఐకే రెడ్డి భూ దందా అంతా బయటికి తీస్తాం. రైల్వే ప్రాజెక్టులలో 40% వాటా రాష్ట్రప్రభుత్వం ఇస్తే… 60% నిధులను కేంద్రం భరిస్తుంది. ఈ మాత్రం తెలీదా ఐకే రెడ్డి? ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. కొన్ని రూల్స్ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రూ. 2072 కోట్లతో జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి”

“కేంద్రప్రభుత్వం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. పోడు భూముల సమస్య పరిష్కరించలేదు… పట్టాల పంపిణీకి దిక్కే లేదు. మీరు పట్టాలు పంపిణీ చేసుంటే… ఫారెస్ట్ ఆఫీసర్ ను గొత్తి కోయలు ఎందుకు చంపేవారు? ట్రిపుల్ ఐటీ లో ఏం జరుగుతుందో కూడా మంత్రికి తెలీదు. విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ని ఉట్నూర్ కి కేంద్రం మంజూరు చేస్తే… దాన్ని మీరు ములుగు కు తరలించారు. ఐకే రెడ్డి కాదు… ఆయన సికే(చెరువుల కబ్జా) రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఐకే రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు.”

డా. గంగిడి మనోహర్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ & స్టేట్ వైస్ ప్రెసిడెంట్:

“జనవరి 10 లోపు మున్సిపల్ ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకుంటే… నిర్మల్ కి వచ్చి, మేమేoటో చూపిస్తాం అని బండి సంజయ్ అన్నారు. మేము అన్న మాటకు కట్టుబడి ఉన్నాం. కచ్చితంగా ఆధారాలతో సహా నిరూపిస్తాం. కేసీఆర్ అరాచక, కుటుంబ పాలనకు చరమగీతం పాడుతాం. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలోని నర్సాపూర్ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. నర్సాపూర్ గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు.”

హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాల్సిందే…

డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉంది

సీబీఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుంది

అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు స్కెచ్ వేస్తున్న కేసీఆర్

కేసీఆర్… ఎందుకీ అర్ధం పర్ధం లేని మాటలు

నీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి

బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే… అదెలా సాధ్యం?

37 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని కూల్చింది నువ్వు

తెలంగాణ ప్రజల ఆశలను కూల్చింది నువ్వు

కంత్రీ మంత్రి…నీ అవినీతి, కబ్జాల చిట్టా ఉంది… పిచ్చపిచ్చగ మాట్లాడితే అంతు చూస్తాం

చలాన్ల పేరుతో నిర్మల్ పోలీసులు రోజుకు లక్ష రూపాయలు వసూలు చేయాలట…

11 ఏళ్లుగా ఇక్కడి డీఎస్పీ తిష్టవేసి కిందస్థాయి సిబ్బందిపై వేధింపులకు గురిచేస్తున్నడు

హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను తక్షణమే రీ ఓపెన్ చేసి విచారణను వేగవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ డిమాండ్ చేశారు. ఈ కేసులు కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని అన్నారు. ఈ కేసును వెంటనే రీఓపెన్ చేసి విచారణ జరిపి దోషులను నడిబజార్లో నిలబెట్టాలని దర్యాప్తు సంస్థలను కోరారు. ఎమ్మెల్సీ కవిత రేపు జరగబోయే సీబీఐ విచారణకు హాజరుకావడం లేదని చెప్పడంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘లక్ష కోట్లతో లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డ విచారణకు పోతే సీబీఐ అరెస్టు చేస్తుందనే భయం పట్టుకుంది. అందుకే తండ్రీబిడ్డలు కూర్చుని ఒకళ్లను పట్టుకుని ఒకళ్లు ఏడుస్తున్నరు. అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారు. ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూతి కోసం స్కెచ్ వేస్తున్నరు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నరు. తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలే. లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తే మీరెందుకు ధర్నాలు చేయాలే’’అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్ర చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందట… కేసీఆర్…ఎందుకీ అర్ధం పర్ధం లేని మాటలు? బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. నీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి. కూల్చడం సాధ్యమా? అయినా నీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేందుకు? తెలంగాణ ప్రజల ఆశలను కూల్చింది నువ్వే. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చినవ్…తెలంగాణ ప్రజలే నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధమైనరు‘‘అని ఘుటుగా వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన కంత్రీ మంత్రికి సంబంధించి అవినీతి, అక్రమాలు, భూకబ్జాల చిట్టా తనవద్ద ఉందని… పిచ్చపిచ్చగా మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. చలాన్ల పేరుతో నిర్మల్ పోలీసులు రోజుకు లక్ష రూపాయలు వసూలు చేయాలని మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

అందులోని ముఖ్యాంశాలు….

కేసీఆర్ ను గద్దె దింపుడే…

కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందా?

కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు

57 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పై అసమ్మతితో ఉన్నట్టు ఆయనే చెప్పుకున్నాడు

బిజెపికి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా?

సంతలో పశువుల్లా 37 మంది ఎమ్మెల్యేలను కొన్నోడే కేసీఆర్

కేసీఆర్ మాత్రమే నీతిమంతుడట

కేసీఆర్ చేస్తే సంసారం… ఇతరులు చేస్తే వ్యభిచారమా?

కేసీఆర్ బిడ్డ సారా(లిక్కర్) దందా చేసింది

లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీకి పోయి దొంగ సార దందా చేశారు

దొంగ దందాలు చేసిన వాళ్ళని గుంజుక పోవాల్నా… వద్దా…?

కవితను అరెస్టు చేస్తే … మన తెలంగాణ బిడ్డను అరెస్టు చేసినట్టు, తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు

బెంగళూరు డ్రగ్స్ కేసును కూడా బయటికి తీస్తున్నాం

క్లోజ్ చేసిన బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్లీ రీ ఓపెన్ చేయాల్సిందే

హైదరాబాద్ డ్రగ్స్ కేసును కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు

లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్లడం ఖాయం

దమ్ముంటే.. డ్రగ్స్, క్యాసినో, లిక్కర్ దందాలో విచారణకు హాజరై, తమ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలి

అన్నీ కాంట్రాక్టులు… దోపిడీలు టిఆర్ఎస్ వాళ్ళవే

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేసిండు

తెలంగాణ అమరవీరులు కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? ఇన్ని రోజులు కేసీఆర్ కు అమరవీరులు ఎందుకు గుర్తుకు రాలేదు?

డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ హామీలు ఏమయ్యాయి?

ఇక్కడ ఎంత మందికి 2bhk ఇచ్చిండు?

రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే

ఒక్క ఎకరానికి… ఒక్క పంటకు.. రైతుకు సబ్సిడీపై 30 వేల రూపాయలను మోదీ ఇస్తున్నారు

‘రైతు సమ్మాన్ నిధి’ కింద రైతులకు పైసలిస్తున్నాం

దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది?

ఇక్కడ మంత్రి, అతని అల్లుడు కబ్జాలకు… అంతే లేదు

మంత్రి పై విచారణ జరపాల్సిందే

విడిచిపెట్టే ప్రసక్తే లేదు

రోజుకు లక్ష రూపాయలు పోలీసులు ఛానళ్ల పేరు మీద వసూలు చేయాలంట

ఇక్కడి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా

వైన్ షాప్ ల నుంచి కేసీఆర్ కు, నీకు కమిషన్ లు పోతాయి

డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో… ఎక్కడ నిర్వహిస్తున్నారో… ఎవరిని బాలి చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు

నిర్మల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్మల్ సంగతేంటో… నేనే చూస్తా

పేదోళ్ల కోసమే పాదయాత్ర చేస్తున్న

సంవత్సరం నుంచి మీకోసమే తిరుగుతున్న

ప్రజలను అప్పులు పాలు చేసి, కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలకు పడగలెత్తింది

మోడీ ఆదేశిస్తేనే… పేదల రాజ్యం కోసం పాదయాత్ర చేస్తున్న

ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది మోదీనే

ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే

టిఆర్ఎస్ నేతలు గుంటనక్కల్లా కబ్జాలు చేసి, వేలకోట్లు దండుకుంటున్నారు

ఈ పాదయాత్రలో కొన్ని గ్రామాలకు రాలేకపోతున్నా… మళ్లీ తప్పకుండా వస్తా

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే… అందరికీ మన ప్రభుత్వం లో న్యాయం చేస్తాం

8వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. నిర్మల్ జిల్లా కండ్లీ సమీపంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. కండ్లీ, రత్నపూర్ కండ్లీ, కనకపూర్, నర్సాపూర్(W), వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామ్డ వరకు సాగనున్న యాత్ర. ఈరోజు మొత్తం 14.3 కిలోమీటర్ల మేర కొనసాగనున్న “ప్రజా సంగ్రామ యాత్ర”. ఇవాళ మామ్డ గ్రామ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.

బాసర వేదభారతి పీఠ వేదవిద్యాలయం సంబందించిన వేదవిద్యార్థుల ఆశీర్వచనం.

రాత్రి శిబిరం వద్ద బండి సంజయ్ ని కలిసిన బాసరకు చెందిన “వేద భారతి పీఠ వేద విద్యాలయం” వేద విద్యార్థులు. బండి సంజయ్ కి వేద ఆశీర్వచనం చేసిన వేద విద్యార్థులు. బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” దిగ్విజయంగా జరగాలని ఆశీర్వదించిన వేద విద్యార్థులు.

అడుగడుగునా వేద విద్యాలయాలు నెలకొల్పడం వలన మన హిందూ ధర్మం రక్షించబడుతుంది. అందరికీ వేదాలు నేర్పించాలన్నదే మా సంకల్పం అన్న వేద విద్యార్థులు. హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నామని వేద విద్యార్థులతో చెప్పిన బండి సంజయ్. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక, వేద పాఠశాలల సంఖ్యను మరింత పెంచే విధంగా కృషి చేస్తామని బండి సంజయ్ హామీ.

“ప్రజా సంగ్రామ యాత్ర – 5”

నేటితో 8వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర. ఇవాళ నిర్మల్ జిల్లా కండ్లీ సమీపంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర. కండ్లీ, రత్నపూర్ కండ్లీ, కనకపూర్, నర్సాపూర్( W), వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామ్డ వరకు సాగనున్న యాత్ర. ఈ రోజు మొత్తం 14.3 కిలోమీటర్ల మేర కొనసాగనున్న “ప్రజా సంగ్రామ యాత్ర”. ఇవాళ మామ్డ గ్రామ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.

Continue Update…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X