తెలంగాణలో విషజ్వరాల విజృంభణ, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం

పడకేసిన పల్లె వైద్యం
మంచమెక్కిన మన్యం
సీజనల్ వ్యాధులతో జనం విలవిల
ఊరంతా విషజ్వరాలే
ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లం

హైదరాబాద్ : కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయి. మలేరియా, డెంగీ, గన్యా వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం.

జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని అర్థం. పాలన గాడితప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నరు. ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్ తో వణికిపోతున్నరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డెంగీ కిట్స్ లేక రోగులు ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు.

ఇదంతా చూసీ చూడనట్లు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ వ్యవహరిస్తుండటం శోచనీయం. తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ, విషజ్వరాల కేసులను తక్కువ చేసి చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలి.

Also Read-

విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలి. విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలి. పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X