Phone Tapping Case : केसीआर की रिक्वेस्ट खारिज, 1 फरवरी को यहां पर होगी पूछताछ కేసీఆర్ రిక్వెస్ట్ రిజెక్ట్

हैदराबाद : फ़ोन टैपिंग केस में एक और बड़ा डेवलपमेंट समाने आयाहै। सिट अधिकारियों ने पूर्व मुख्यमंत्री केसीआर की रिक्वेस्ट खारिज कर दी है। दूसरी बार नोटिस जारी किया गया हैं नोटिस में कहा गया है कि 1 फरवरी को दोपहर 3 बजे हैदराबाद के नंदीनगर में अपने घर पर पूछताछ के लिए पेश होना है। केसीआर की एरावेली फार्महाउस पर पूछताछ की रिक्वेस्ट खारिज होने के बाद बीआरएस के कार्यकर्ता गुस्से में हैं। अब यह देखना दिलचस्प है कि पार्टी के नेता इस पर कैसी प्रतिक्रिया देते हैं।

गौरतलब है कि गुरुवार को जारी नोटिस में सिट अधिकारियों ने कहा था कि उनकी 65 साल की उम्र को देखते हुए पुलिस स्टेशन आने की कोई ज़रूरत नहीं है। यह सुझाव दिया गया था कि उन्हें पूछताछ में शामिल होने के लिए हैदराबाद शहर की सीमा के अंदर किसी भी इलाके की जानकारी देनी चाहिए। हालांकि केसीआर ने सिट को एक लेटर लिखकर फार्महाउस पर पूछताछ करने का अनुरोध किया था।

सिट अधिकारियों ने उनकी रिक्वेस्ट खारिज कर दी और इस तरह शहर की सीमा के अंदर पूछताछ तय कर दी। खबर है कि इसी क्रम में नंदीनगर घर को फाइनल कर दिया गया है। मालूम हो कि सिट अधिकारियों ने हाल ही में इस मामले में पूर्व मंत्री हरीश राव और केटीआर के साथ-साथ पूर्व सांसद संतोष राव से भी पूछताछ की थी।

Related News-

Phone Tapping Case : కేసీఆర్ రిక్వెస్ట్ రిజెక్ట్

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్‌లోని నందినగర్‌లోని నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లోనే విచారించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అని ఆసక్తి నెలకొంది.

కాగా, నిన్న జారీ చేసిన నోటీసుల్లో 65 ఏళ్ల వయసు దృష్ట్యా పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని సిట్‌ పేర్కొంది. విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలపాలని సూచించింది. అయితే కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌజ్‌లో విచారించాలని సిట్‌కు లేఖ రాశారు.

ఆయన విజ్ఙప్తిని తిరస్కరించిన సిట్ దీంతో నగర పరిధిలోనే విచారించాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే నందినగర్‌ నివాసాన్ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇటీవలే మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ సంతోష్‌రావును సిట్‌ విచారించిన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X