हैदराबाद: तेलंगाना के विकाराबाद जिले के तांडूर शहर में एक अप्रिय घटना घटी है। घर में खेल रहे पांच 5 माह के बच्चे को पालतू कुत्ता नोचकर खा गया। कुत्ते के काटने से गंभीर रूप से घायल बच्चे की मौके पर ही मौत हो गई। मिली जानकारी के अनुसार, महबूबनगर जिला निवासी दत्तू और लावण्या दंपत्ति हैं। उनकी इकलौती संतान पांच माह का साईं था। दंपति तांडूर मंडल के गौतापुर ग्राम पंचायत के अंतर्गत बसवेश्वर नगर में नागभूषणम नामक व्यवसायी के पास काम कर रहा है।
हर दिन की तरह दत्तू पॉलिशिंग यूनिट में काम रहा था। इसी समय उसे प्यास लगी और उसने अपनी पत्नी से पानी लेकर आने का आग्रह किया। पत्नी ने बेटे को मकान में सुला दिया और पति को पानी देने के लिए चली गई। इसी समय वहां मौजूद पालतू कुत्ता घर में घुस आया और फर्श पर खेल रहे पांच माह के बच्चे को बड़ी बेरहमी से सिर और गर्दन को नोचकर खा गया।
मां घर में आई और अपने बेटे को खून से लथपथ देखकर हैरान रह गई। अपने पति की मदद से वह तुरंत लड़के को स्थानीय अस्पताल ले गई। लेकिन कोई फायदा नहीं हुआ। बच्चे की जान पहले ही जा चुकी थी। इसी क्रम में गुस्साए परिजनों ने पालतू कुत्ते को पीट-पीटकर मार डाला। इस घटना से माता-पिता का रो-रोकर बुरा हाल हो गया। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है।
పసికందును పీక్కుతిన్న పెంపుడు కుక్క
హైదరాబాద్ : వికారాబాద్ (తెలంగాణ) జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఆడుకుంటున్న ఓ 5 నెలల పసికందును పెంపుడు కుక్క పీక్కుతుంది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు. వీరికి ఐదు నెలల సాయి ఏకైక సంతానం. ఈ దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతి పరిధి బసవేశ్వర నగర్‌లో నాగభూషణం అనే వ్యాపారికి చెందిన నాపరాయి పాలిషింగ్ యూనిట్‌లో పనిచేస్తున్నారు.
రోజువారీగా దత్తు పాలిష్ యూనిట్లో నాపరాయి కట్ చేస్తుండగా అతడికి దాహం వేయడంతో భార్యను నీళ్లు తీసుకు రమ్మని చెప్పాడు.పసికందును తన ఒళ్లో నుంచి ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య భర్తకు నీరు అందించడానికి వెళ్ళింది. ఇంతలో అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఇంట్లోకి చొరబడింది. నేలపై ఆడుకుంటున్న ఐదు నెలల పసికందును అతి క్రూరంగా కొరికింది. తల, మెడ భాగంలో కొరికి పీక్కుతుంది. ఈ ఘటనలో పసికందు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇంట్లోకి వచ్చిన తల్లి రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి షాక్ అయింది. భర్త సాయంతో వెంటనే బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కోపోద్రికులైన కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కుక్కను కొట్టి చంపేశారు. ఈ ఘటనతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగలగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. (ఏజెన్సీలు)