ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకుడు మల, మూత్ర విసర్జ, కేసు నమోదు

హైదరాబాద్: విమానాల్లో ప్రయాణికుల వికృత చేష్టలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తాజాగా, ముంబయి-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబయి నుంచి ఢిల్లీ బయలుదేరి విమానం ఎక్కిన ప్రయాణికుడు ఫ్లైట్ గాల్లో ఉండగానే సీట్ల మధ్యనే మలమూత్ర విసర్జన చేశాడు. దీంతో అతడ్ని ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు అప్పగించారు. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ముంబయి-ఢిల్లీ ఎయిరిండియా AIC 866 విమానంలోని సీటు నెంబరు 17ఎఫ్‌లో కూర్చున్న రామ్ సింగ్ అనే ప్రయాణికుడు మద్యం మత్తులో మలమూత్ర విసర్జన చేశాడు.

ప్రయాణికుడి దుష్ప్రవర్తన గమనించిన క్యాబిన్ సిబ్బంది అతడ్ని హెచ్చరించి తోటి ప్రయాణికుల నుంచి దూరంగా కూర్చోబెట్టారు. దీని గురించి పైలట్ ఇన్ కమాండ్‌కు కూడా తెలియజేసిన క్యాబిన్ సిబ్బంది ప్రయాణీకుల భద్రత కోరుతూ ఎయిర్‌లైన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఈ చర్యతో చాలా మంది ప్రయాణికులను ఆందోళనకు గురిచేసిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఎయిర్ ఇండియా సెక్యూరిటీ ప్రయాణికుడిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడిపై ఐపీపీ సెక్షన్ 294 (అశ్లీల చర్యలు), 510 (మద్యం సేవించిన వ్యక్తి బహిరంగంగా దుర్వినియోగం) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తోన్న ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు తన పక్కనే ఉన్న మహిళపై మూత్ర విసర్జన చేడయం ఇది జరిగిన పది రోజులకు డిసెంబరు 6న పారిస్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఒక మహిళా ప్రయాణీకురాలిపై మద్యం మత్తులో ఓ యువకుడు మూత్ర విసర్జన చేసిన ఘటనలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)

एयर इंडिया विमान में यात्री ने किया शौच और पेशाब

हैदराबाद: विमान में शौच करने के मामले बढ़ते जा रहे हैं। एक बार फिर एक ऐसा ही मामला प्रकाश में आया है। यह मामला एयर इंडिया की मुंबई-दिल्ली फ्लाइट में सामने आया है। इस फ्लाइट में यात्रा कर रहे एक यात्री ने विमान में कथित तौर पर शौच और पेशाब की। इसके बाद उस यात्रा को दिल्ली के एयरपोर्ट पर यात्री को गिरफ्तार कर लिया गया। आरोपी यात्री अफ्रीका में कुक का काम करता है। मामले में जांच अभी की जा रही है।

यात्री के इस गंदे कृत्य दिल्ली के आईजीआई एयरपोर्ट पुलिस स्टेशन में फ्लाइट कैप्टन द्वारा दर्ज कराई गई। FIR के मुताबिक मुंबई से दिल्ली जाने वाली एयर इंडिया की फ्लाइट AIC 866 में सीट नंबर 17एफ पर एक यात्री ने विमान में शौच किया, पेशाब किया और थूका। FIR में आगे कहा गया है कि यात्रा के इस कृत्य के बाद उसे केबिन क्रू द्वारा चेतावनी भी दी गई थी। बाद में प्लाइट कैपटन को इस  दुर्व्यवहार की जानकारी दी गई। 

लैंड करते ही किया अरेस्ट

इसके बाद कंपनी को तुरंत एक मेसेज भेजा गया और एयरपोर्ट सिक्योरिटी से यात्री के आगमन पर एस्कॉर्ट करने का अनुरोध किया गया। यात्री की ऐसी हरकत की वजह से फ्लाइ के दूसरे सभी यात्रियो में गुस्सा था। जैसे ही विमान ने दिल्ली एयरपोर्ट पर लैंड किया, वैसे ही आरोपी यात्री को गिरफ्तार कर पुलिस स्टेशन ले जाया गया। जिसके बाद यात्री को कोर्ट में पेश किया गया। हालांकि कोर्ट ने उसे जमानत दे दी। (एजेंसियां)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X