हैदराबाद: पड़ोसी देश पाकिस्तान की सीमा पर राजस्थान पुलिस ने हैदराबाद से एक शख्स को गिरफ्तार किया है। पुराने शहर मीरचौक निवासी शख्स पाकिस्तान जाने की कोशिश की। उसे देख सीमा पर पुलिस ने उसे हिरासत में ले लिया। पुलिस ने गिरफ्तार व्यक्ति की पहचान हैमद अली के रूप में की है। पुलिस ने खुलासा किया कि हैमद अली ने फर्जी के पासपोर्ट के सहारे पाकिस्तान जाने की कोशिश की।
पुलिस ने प्राथमिकी जांच में पाया कि हैमद अली पिछले कुछ सालों से हैदराबाद में रह रहा था। उसका पता लगाने के लिए राजस्थान पुलिस हैदराबाद पहुंची है। इतने साल उसने हैदराबाद में क्या किया? पाकिस्तान जाने की क्या वजह है? क्या आतंकवादी समूहों के साथ कोई संबंध हैं? पुलिस हर पहलू से जांच कर रही है। जांच के बाद ही पूरी जानकारी सामने आने की संभवना है।
పాకిస్థాన్ బోర్డర్‌లో హైదరాబాద్ పాతబస్తీ వాసి అరెస్ట్
హైదరాబాద్ : శత్రుదేశం పాకిస్థాన్ సరిహద్దుల్లో హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని పాతబస్తీ మీర్‌చౌక్ నుంచి సదరు వ్యక్తి పాకిస్థాన్ వెళ్లేందుకు ప్రయత్నించగా బోర్డర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి హైమద్ అలీగా పోలీసులు గుర్తించారు. దొంగ పాస్ పోర్టు సాయంతో హైమద్ అలీ పాకిస్థాన్ వెళ్లేందుకు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు.
గతేకొన్నేళ్లుగా హైమద్ అలీ హైదరాబాద్‌లో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి గురించి తెలుసుకునేందుకు రాజస్థాన్ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. అతడు ఇన్నాళ్లు హైదరాబాద్‌లో ఏం చేశాడు. పాకిస్థాన్ వెళ్లటానికి గల కారణమేంటి ? ఉగ్రమూకలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. (ఏజెన్సీలు)