हैदराबाद : टीआरएस संसदीय दल का नाम बदलकर बीआरएस संसदीय दल किये जाने को लेकर बीआरएस सांसदों ने राज्यसभा सभापति और लोकसभा अध्यक्ष को आवेदन किया है। गौरतलब है कि हाल ही में केंद्रीय चुनाव आयोग ने टीआरएस को बीआरएस में बदलने की मंजूरी दी है। टीआरएस सांसदों ने राज्यसभा के सभापति जगदीप धनखड़ और लोकसभा अध्यक्ष ओम बिरला को सीएम केसीआर के पत्र को पत्र सौंपा।
बीआरएस सांसदों की अपील पर राज्यसभा के सभापति ने तुरंत प्रतिक्रिया दी। अध्यक्ष ने अब से पार्टी का नाम बदलकर बीआरएस करने का अधिकारियों को निर्देश दिया। लोकसभा अध्यक्ष ने भी टीआरएस की अपील का सकारात्मक जवाब दिया। उन्होंने सांसदों से कहा कि वह इस पर गौर करेंगे और जल्द ही इस पर फैसला लिया जाएगा।
इसके बाद बीआरएस सांसद केशव राव ने कहा कि उन्होंने टीआरएस संसदीय दल का नाम बदलकर बीआरएस संसदीय दल करने के लिए राज्यसभा सभापति और लोकसभा अध्यक्ष को आवेदन किया है। वह कल से आधिकारिक तौर पर संसद में बीआरएस सांसद बन जाएंगे। तेलंगाना मॉडल उनकी नीति है। केशव राव ने कहा कि सभी ने देखा है कि तेलंगाना कैसे विकसित हुआ है।
అధికారికంగా బీఆర్‌ఎస్ ఎంపీ అవుతారు
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ మరియు లోక్‌సభ స్పీకర్ కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి కేసీఆర్ పంపిన లేఖను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు.
బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ వెంటనే స్పందించారు. పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్‌గా మార్చాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. లోక్‌సభ స్పీకర్ సైతం టీఆర్ఎస్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని ఎంపీలకు చెప్పారు.
అనంతరం దీనిపై బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మిడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. రేపటి నుంచి పార్లమెంట్‌లో అధికారికంగా బీఆర్ఎస్ ఎంపీలం అవుతామన్నారు. తెలంగాణ మోడల్ తమ పాలసీ అన్నారు. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారని కేశవరావు పేర్కొన్నారు. (Agencies)