పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
గొప్ప నిజాయితీ గల నాయకుడు పివికి నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను
హనుమకొండ : దేశ ప్రధానిగా గొప్ప సేవలు అందించి, దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకులు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారు అన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.
పి.వి నరసింహ రావు గారి వర్ధంతి సందర్భంగా నేడు హనుమకొండ జిల్లాలోని పివీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పివీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం చాలా ముందుకెళ్లిందనీ, చాలా నిజాయితీగా పనిచేసిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.
ఇంతటి గొప్ప వ్యక్తి వరంగల్ బిడ్డ కావడం, తెలంగాణ వాడు కావడం, తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రధానిగా ఎలా ఉండాలి? ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి? అని నిరూపించిన మహానుభావుడు పీవీ నరసింహారావు గారు అన్నారు. అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.
పీవీకి ఘన నివాళి అర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహరావు
తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన నాయకుడు
ఉమ్మడి కరీంనగర్ ముద్దుబిడ్డ దేశ ప్రధానిగా సేవలందించడం గర్వకారణం
హైదరాబాద్ : తెలుగు తేజం, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు ఎందరికో స్పూర్తిగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 18వ వర్దంతిని పురష్కరించుకుని కరీంనగర్ లోని తన కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.
• హైదరాబాద్ సంస్థాన విమోచన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన నాయకుడు పీవీ నర్సింహారావు అని స్మరించుకున్నారు.
• స్వయం క్రుషితో అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టిన పీవీ నర్సింహరావు తెలంగాణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డ కావడం గర్వకారణమన్నారు. ఆ మహనీయుడికి తెలంగాణ ప్రజల తరపున ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.