పైలట్ రోహిత్ రెడ్డిపై మండిపడ్డ ఎన్వీ సుభాష్
ఎమ్మెల్యేల ఎర కేసులో… ముందు బండి సంజయ్ సవాల్ కు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్
కేసీఆర్ కు దమ్ముంటే… యాదగిరిగుట్టలో ప్రమాణం చేసి, తన నిర్దోషిత్వాన్ని చాటుకోవాలి
లేదంటే… ఎమ్మెల్యే కొనుగోలు డ్రామా అంతా కూడా కేసీఆర్ దే అని అర్దం
ఎవరి డైరెక్షన్ లో ఎవరెలా నటిస్తున్నారో… ప్రజలు గమనిస్తున్నారు
నీ మీద ఉన్న కేసుల సంగతేంటి ?
ఎన్వీ సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Hyderabad: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన నువ్వా… మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో… ముందు మా అధ్యక్షుడు బండి సంజయ్, మీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి విసిరిన సవాల్ ను స్వీకరించి, కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలాయానికి వచ్చి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మీ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు రాలేదు కాబట్టి, ఎమ్మెల్యేలకు ఎర కేసు అంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే… ఆయన అద్భుత దర్శకత్వంలోనే జరగిందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తప్పుడు ప్రమాణాలు చేసి, నీ మీదున్న కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే… ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని… త్వరలోనే దర్యాప్తు సంస్థల దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని పైటల్ రోహిత్ రెడ్డిని హెచ్చరించారు ఎన్వీ సుభాష్. అసలు నీ స్థాయికి, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కడు చాలని, నువ్వు ఎన్ని అబద్దపు సవాళ్ళు విసిరినా… చివరికి నీ మీద ఉన్న కేసుల్లో నువ్వు జైలుకు వెళ్లక తప్పదని ఎన్వీ సుభాష్ జోష్యం చెప్పారు.
ఇక నీ మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో… మీ కేసీఆర్ డైరెక్షన్ లో మీరాడిన డ్రామాలో కూడా నిజానిజాలు నిగ్గుతేలుతాయని… అందులో ఎవరి ప్రమేయం ఏంటో కూడా త్వరలోనే బయటపడుతుందని వెల్లడించారు. 2009 ఎన్నికల సందర్భంగా స్వీడన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ చదివినట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న నువ్వు…. 2018 ఎన్నికల సమయంలో ఇంటర్ పాస్ అయినట్లు అఫిడవిట్ ఇచ్చావు. అంటే ముందు నువ్వు ఇంటర్ పాస్ కాకుండానే… ఎంఎస్ చదివావా..? అని ప్రశ్నించారు ఎన్వీ సుభాష్.
మీ బీఆర్ఎస్ నేతల దొంగదందాలు, స్కామ్ లే కాకుండా…. దొంగ విద్యార్హతలతో ఎన్నికల సంఘాన్ని కూడా తప్పుదోవ పట్టించారని పైలట్ రోహిత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు ఎన్వీ సుభాష్. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన పైలట్ రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని… అతనిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్.