हैदराबाद : ईडी (Enforcement Directorate) ने दिल्ली शराब घोटाला मामले में बीआरएस एमएलसी कविता को एक बार फिर नोटिस जारी किया है। मीडिया में प्रसारित और प्रकाशित खबरों बताया गया कि कविता आज फिर से सुनवाई के लिए आये। इसके चलते कविता के प्रतिनिधि सोमा भरत तुरंत दिल्ली स्थित ईडी कार्यालय गए।
आपको बता दें कि ईडी इस मामले में तीन बार एमएलसी कविता से पूछताछ कर चुकी है। अधिकारियों ने इस महीने की 11 तारीख को पहली जांच के दौरान कविता का फोन जब्त कर लिया। उसके बाद 21 तारीख को हुई जांच के दौरान स्टील कवर में कविता ईडी को 9 फोन सौंपे।
फोन खोलने के लिए कविता और उनके प्रतिनिधि को गवाह के तौर पर बुलाया गया। फ़िलहाल कविता के प्रतिनिधि सोमा भरत ईडी कार्यालय पहुंच गये हैं। अगर सोमा भरत बाहर आकर मीडिया से बात करते हैं तो पूरी जानकारी मिल पाएगी।
ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు మరోసారి విచారణకు రావాలని ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. దీనితో కవిత ప్రతినిధి సోమా భరత్ హుటాహుటీన ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు వెళ్లారు.
కాగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే మూడు సార్లు విచారించారు. ఈనెల 11న మొదటిసారి విచారణ సమయంలో కవిత ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ తరువాత 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీకి స్టీల్ కవర్ లో అప్పగించారు.
ఈ క్రమంలో ఆ ఫోన్లను తెరిచేందుకు సాక్షిగా కవితను కానీ ఆమె ప్రతినిధిని కానీ రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత ప్రతినిధి సోమా భరత్ ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్లగా..ఆయన బయటకు వస్తే పూర్తి విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. (ఏజెన్సీలు)