Long Live TANA : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల తెలుగు సాహిత్య సౌరభం

[Note- నిర్వహకులకు మనవి, ‘తానా: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల తెలుగు సాహిత్య సౌరభం’ కార్యక్రము సంబంధించిన వార్త మరియు ఫోటోలతో సహ (telanganasamachar1@gmail.com) పంపగలరు. తెలంగాణ సమాచార్ ప్రచురించగలదు]

हैदराबाद: भारत की आजादी के 75 साल के मौके पर तेलुगू एसोसिएशन ऑफ नॉर्थ अमेरिका (टीएएनए) ‘तेलुगु साहित्य सौरभम’ नाम से एक अभूतपूर्व उत्सव का आयोजन कर रहा है। कार्यक्रम इसी माह (रविवार) की 29 तारीख को भारतीय समयानुसार सुबह 8 बजे से सैकड़ों कवि विद्वानों के साथ पचास से अधिक सारस्वत प्रक्रियाओं में प्रारंभ होगा।

हर महीने तेलुगु वेलुगु

‘ताना’ विश्व साहित्य वेदिका के तत्वावधान में, यह हर महीने तेलुगु वेलुगु शीर्षक के अंतर्गत अंतिम रविवार को आयोजित होने वाला एक विशेष आयोजन है। ताना के अध्यक्ष अंजया चौधरी लाउ, मंच प्रबंधक डॉ. प्रसाद तोटकुरा और समन्वयक चिगुरुमल्ला श्रीनिवास के नेतृत्व में इसे एक असाधारण अक्षर यज्ञ के रूप में यह विशेष बन गया है।

హైదరాబాద్ : మొత్తం 75 వసంతాల భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా, ‘తెలుగు సాహిత్య సౌరభం’ పేరిట అపూర్వ వేడుకను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహిస్తోంది. శతాధిక కవి పండితులతో యాభైకి పైగా సారస్వత ప్రక్రియల్లో ఈ నెల 29వతేదీ (ఆదివారం) భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది.

నెలనెలా తెలుగు వెలుగు

‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యాన, నెలనెలా తెలుగు వెలుగు శీర్షికన, ప్రతీ నెలా ఆఖరి ఆదివారం జరిగే సంబుర విశేషం ఇది. తానా అధ్యక్షులు అంజయ్యచౌదరి లావు, వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని అసాధారణ అక్షర యజ్ఞంగా ఇది ప్రత్యేకత సంతరించుకుంది.

15గంటలు

ఈ 44వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సదస్సు ఒకే వేదిక మీద 15గంటలు పైగా నిర్విరామంగా కొనసాగుతుంది. అనేకానేక సాహితీ రూపాలను ఇలా సమగ్రంగా విశ్లేషించడాన్ని యప్ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. మరెన్నో టీవీ ఛానల్స్ ప్రసారం చేసే ఈ అపురూప సారస్వత ఝురిని అమెరికా వాసులు ఆదివారం సాయంత్రం 6.30 గంటలనుంచి వీక్షించవచ్చు.

విశిష్ట అతిథులు

ఈ సౌరభ కార్యక్రమ విశిష్ట అతిథులుగా అనేకమంది… పద్యం, వచన కవిత్వం, దీర్ఘ కవిత, మినీ కవిత, పాట/గేయం, వచన కవితా కథాకావ్యాలు, రుబాయిలు, గజళ్ళు, హైకూలు, నవల, నానోలు, రెక్కలు, కథ, సమీక్ష, బుర్రకథ, వ్యంజకాలు, ఏకపాత్రాభినయం, బాలసాహిత్యం, నాటకం, నాటిక, రేడియో రూపకం, విమర్శ, నాణెములు, కూనలమ్మ, తంకాలు, మిర్చీలు, ముక్కాలు, లేఖాసాహిత్యం, వ్యాసం, పేరడీలు, సాహిత్య రూపకం, ముందు మాటలు, మామీలు, ముక్కానీలు, ఉపన్యాసం, హరివిల్లు, మొగ్గలు, మణిపూసలు, శతకం, అవధానం, జానపద సాహిత్యం, త్రిపదులు, అనువాదం, చిన్నీలు, ప్రపంచపదులు, చాటువులు, నానీలు, ముత్యాలసరాలు, హరికథ, జీవిత/స్వీయచరిత్ర, గాథ, తదితరాలను విశ్లేషిస్తారని తానా నిర్వాహకులు ప్రకటించారు.

గౌరవ అతిథి

ప్రారంభ సభకు గౌరవ అతిథి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ తెలప్రోలు రజని కాగా- ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, ప్రత్యేక అతిథిగా మూర్తిదేవి పురస్కార గ్రహీత కొలకలూరి ఇనాక్ హాజరవుతారు. ముగింపు సభకు గౌరవ అతిథిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ జనార్ధన్ రెడ్డి ప్రసంగిస్తారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, ప్రత్యేక అతిథిగా ఇన్ కంటాక్స్ కమిషనర్ (హైదరాబాద్) జీవన్ లాల్ లవాడియా పాల్గొంటారు.

ప్రారంభ సభకు ఆత్మీయ అతిథులు: శ్రీయుతులు కత్తిమండ ప్రతాప్, డాక్టర్ వి.డి. రాజగోపాల్, గిడుగు కాంతికృష్ణ, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, దాస్యం సేనాధిపతి, డాక్టర్ రావి రంగారావు. ముగింపు సభకు ఆత్మీయ అతిథులు: శ్రీయుతులు డాక్టర్ జల్ది విద్యాధర్, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆకెళ్ళ రాఘవేంద్ర, డాక్టర్ బిక్కి కృష్ణ, లలిత చిట్టె, యలవర్తి ధనలక్ష్మి.

విశిష్ట అతిథులు – సాహితీ ప్రక్రియలు: శ్రీయుతులు డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్, పచ్చిమాల శివనాగరాజు, డాక్టర్ రాచేపల్లి దేవన్న (పద్యం); సుధామ, డాక్టర్ రాధేయ(వచన కవిత్వం); కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి, డాక్టర్ వి. వింధ్యవాసినీదేవి (దీర్ఘ కవిత); డాక్టర్ పి.వి. సుబ్బారావు (మినీ కవిత); డాక్టర్ వి.వి. రామారావు, భరత్ వేమూరి, డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర(పాట/గేయం); డాక్టర్ ఇ. కోనప్రభ (వచన కవితా కథాకావ్యాలు); డాక్టర్ ఆచార్య ఫణీంద్ర, డాక్టర్ ఎం. ఫామిదాబేగం (రుబాయిలు); డాక్టర్ ఎం.బి.డి. శ్యామల, రెంటాల వెంకటేశ్వరరావు, అబ్దుల్ సత్తార్, వి. లక్ష్మీభవాని (గజళ్ళు); బి. లలితానంద ప్రసాద్ (హైకూ); డాక్టర్ సగిలి సుధారాణి, ఝాన్సీ కొప్పిశెట్టి (నవల); ఈగ హనుమాన్ (నానోలు); తంగిరాల చక్రవర్తి (రెక్కలు); ఝాన్సీ పాపుదేశి (కథ); కళ తాటికొండ,

మంజుల సూర్యప్రతిభా దర్శనం (సమీక్ష), ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు (బుర్రకథ), పొత్తూరి సుబ్బారావు, డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు (వ్యంజకాలు); డాక్టర్ యల్లంభట్ల నాగయ్య (ఏకపాత్రభినయం); డాక్టర్ సిరి (బాలసాహిత్యం), వాడ్రేవు సుందర్రావు (నాటకం), తన్నెటి కాశీవిశాలాక్షిదేవి (నాటిక), ఎ.బి. ఆనంద్ (రేడియో రూపకం), లక్ష్మణ చక్రవర్తి (విమర్శ), ఎస్.ఆర్. పృధ్వీ (నాణెములు), డాక్టర్ వంగరి త్రివేణి (కూనలమ్మ), మాధవీ సనారా (తంకాలు), బత్తుల వీవీ అప్పారావు (మిర్చీలు), డాక్టర్ జి.వి. పూర్ణచందు (ముక్కాలు), రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి (లేఖాసాహిత్యం), డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు (వ్యాసం), ఆచార్య వి. నిత్యానందరావు (పేరడీలు), ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి (సాహిత్య రూపకం), శాంతికృష్ణ, సుమన ప్రణవ్
(ముందుమాటలు); బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి (మామీలు), శ్రీసాగర్ శ్రీరామ కవచం (ముక్కానీలు),

ఆచార్య బన్న ఐలయ్య (ఉపన్యాసం), మామిడి రమేష్ (హరివిల్లు), డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, సునీత బండారు (మొగ్గలు); వడిచర్ల సత్యం, ఎడ్ల లక్ష్మి (మణిపూసలు); రాధశ్రీ (శతకం), డాక్టర్ మరుమాముల దత్తాత్రేయశర్మ (అవధానం), ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి (జానపద సాహిత్యం), డాక్టర్ డి.ఎన్.వి.రామశర్మ (త్రిపదులు), ప్రతిభారత్న రాజ్యలక్ష్మి ఎ., డాక్టర్ మంధెన దామోదరాచారి (అనువాదం); బి.లలితకుమారి (చిన్నీలు), సాధన నరసింహాచార్య (ప్రపంచపదులు), మావుడూరు సూర్యనారాయణ మూర్తి (చాటువులు), సోమేపల్లి వెంకటసుబ్బయ్య, చలపాక ప్రకాష్ (నానీలు); వై.వి. బాలాజీ (ముత్యాల సరాలు), మల్లంపల్లి సు
బ్రహ్మణ్య శర్మ (హరికథ),వూకంటి పద్మావతి, కొండపల్లి నిహారిణి (జీవితచరిత్ర/స్వీయచరిత్ర); డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ (గాథ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X