ग्रेटर हैदराबाद में लगातार भारी बारिश हो रही है। शहर में दो दिनों से लगातार बारिश जारी है। लगातार हो रही बारिश के कारण शहरवासी परेशान है। तेलंगाना सरकार ने बारिश के कारण स्कूल और कॉलेजों को दो दिन की छुट्टी भी घोषित कर दी है। भद्राचलम के पास गोदावरी नदी उफान पर बह रही है। इसके चलते अधिकारियों ने एक नंबर की चेतावनी जारी की है। दूसरी ओर भारी बारिश के चलते महाराष्ट्र के रायगढ़ में बुधवार रात चट्टान खिसकने से 48 घर तबाह हो गए। हादसे में 13 लोगों की मौत हुई है, जबकि 75 लोगों का रेस्क्यू किया गया। 120 से ज्यादा लोग अभी मलबे में दबे हैं। इर्शालवाड़ी गांव में इन लोगों को रेस्क्यू करने के लिए NDRF की टीमें मौके पर तैनात है। मदद व पुनर्वासन मंत्री अनिल पाटिल ने कहा है कि अगर जरूरत पड़ी तो जख्मी लोगों को एयरलिफ्ट कराया जाएगा। उप मुख्यमंत्री अजित पवार ने कहा कि मृतकों के परिवार को महाराष्ट्र सरकार की तरफ से 5 लाख की आर्थिक मदद दी जाएगी। साथ ही घायलों के इलाज का खर्च भी सरकार उठाएगी। राज्य के 4 जिलों में इन दिनों बाढ़ जैसे हालात हैं। रायगढ़ जिले में 6 में से 3 नदियां खतरे के निशान से ऊपर बह रही हैं। इनमें अंबा, सावित्री और पातालगंगा शामिल हैं।अधिकारियों ने बताया कि कुंडलिका, गढ़ी और उल्हास नदी का जलस्तर खतरे के निशान के करीब पहुंच गया है। बाढ़ जैसे हालात के बीच राज्य में NDRF की 12 टीमें तैनात की गई हैं। मौसम विभाग ने देश के 20 राज्यों में आज भारी बारिश का अलर्ट जारी किया है। वहीं, 4 राज्यों में मध्यम बारिश होने की संभावना जताई है।
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తూనే ఉంది. రెండు రోజుల నుంచి నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. అస్సలు ఆగకుండా పడుతున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా పాఠశాలలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించేసింది. భద్రాచలం సమీపంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు నంబర్ వన్ హెచ్చరిక హెచ్చరిక జారీ చేసింది.
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు.
మరోవైపు నగరంలో అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుండగా.. అత్యధికంగా మియాపూర్‌లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యాయి. అలాగే టోలీచౌకిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హెచ్‌ఎంటీ హిల్స్ – 7 సెంటీమీటర్లు, గాజుల రామారం – 6.5 సెంటీమీటర్లు, కాప్రా – 3.7 సెంటీ మీటర్లు, ఆనంద్ బాగ్ – 3.6 సెంటీమీటర్లు, గచ్చిబౌలి – 3.3 సెంటీమీటర్లు, చర్లపల్లి, అల్వాల్ – 3.1 సెంటీమీటర్లు, జీడిమెట్ల, ఉప్పల్ – 2.7, సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్, మోండా మార్కెట్ – 2.4 సెంటీమీటర్లు, మాదాపూర్ – 2.2 సెంటీమీటర్లు, నాగోల్, ఆసిఫ్ నగర్ – 1.8 సెంటీమీటర్లు, బేగంపేట్, మెహదీపట్నంలో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
మరోవైపు… వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ రివ్యూ నిర్వహించారు. జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంజనీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. వాటర్ లాగింగ్, చెట్లు విరిగిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ హెచ్చరించారు.
హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు.