నిర్మల్ టిఎస్ ఆర్టిసి బస్టాండుకు కొత్త కల రానుంది

కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంతో నయా లుక్

అత్యాధునిక హంగులతో, మెరుగైన వసతులతో టిఎస్ ఆర్టిసి నిర్మల్ బస్ స్టేషన్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం

నిర్మల్ టిఎస్ఆర్టిసి ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా నిర్మించేందుకు నిర్ణయం

నూతనంగా నిర్మించే టిఎస్ ఆర్టిసి కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్ మరియు జి – ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, 1, లక్ష ఎస్ఎఫ్టి తో నిర్మాణం చేయడం జరుగుతుంది

టిఎస్ ఆర్టిసి ద్వారా 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్ లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని – సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు వెల్లడించారు

హైదరాబాద్: ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారితో గౌరవ టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిర్మల్ బస్టాండులో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు..

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సహకారంతో టిఎస్ ఆర్టిసి చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని బస్టాండులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు..

ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారితో టిఎస్ ఆర్టిసి చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆర్టీసీ అధికారులతో నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ బస్టాండ్ గా నిర్మాణం చేసేందుకు, కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలను గౌరవ మంత్రి శ్రీ ఇంద్రగరణ్ రెడ్డి గారితో చర్చించారు.

టిఎస్ ఆర్టిసి సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునికరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది.

ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్కు టిఎస్ఆర్టిసి నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను నడపడం జరుగుతుంది.

టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు.

టిఎస్ ఆర్టిసి నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

నిర్మల్ లో నిర్మించే టిఎస్ఆర్టిసి కమర్షియల్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు ఇవి.

  1. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మించడం జరుగుతుంది.
  2. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ మరియు జి ప్లస్ వన్ నిర్మాణం జరుగుతుంది.
  3. నిర్మల్ టిఎస్ఆర్టిసి ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా నిర్మాణం చేయడానికి కోసం టిఎస్ ఆర్టిసి యాజమాన్యం 35 కోట్ల నిధులను సమకూర్చుకోవడం జరుగుతుంది.
  4. కమర్షియల్ కాంప్లెక్స్ లో శుభకార్యాలు నిర్వహించేందుకు హాలును ప్రత్యేకంగా నిర్మాణం చేయడం జరుగుతుంది.
  5. బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆర్టిసి ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పారు.
  6. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు మరియు వెయిటింగ్ హాల్స్, బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్సిడి తెరలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  7. ప్రయాణికుల భద్రత కోసం టిఎస్ ఆర్టిసి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
  8. మరో 10 తరాలకు అడ్వాన్సుగా ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పారు.
  9. టిఎస్ ఆర్టిసి బస్టాండుల యొక్క ఆధునికరించుకోవడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం జరుగుతుందని, ప్రయాణికులు కూడా ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టిఎస్ఆర్టిసి అందిస్తున్న ప్రత్యేక రాయితీలు మరియు బస్సు సర్వీసులను ఆదరించాలని మరోసారి సంస్థ చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు విజ్ఞప్తి చేశారు.
  10. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టిఎస్ఆర్టిసి ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని తెలియజేశారు.

గౌరవ దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారితో సమీక్ష సమావేశంలో ఆర్టిసి అధికారులు ఈడిఈ వినోద్ కుమార్ గారు, సిటిఎం విజయ్ కుమార్ గారు, సీసీఈ రాంప్రసాద్, సివిల్ ఇంజనీర్ మహేష్ గారు ఇతర ఆర్టీసీ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X