Hyderabd : అందరి సమిష్టి కృషితో నాందేడ్ గురుగోవింద్ సింగ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన సీయం కేసీఆర్ సభ విజయవంతమైందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, మన రాష్ట్ర నాయకులు, గులాబీ శ్రేణులు సభ సక్సెస్‌కు బాగా కష్టపడి పనిచేశారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తొలిసారిగా తెలంగాణ వెలుపల జరిగిన బీఆర్ఎస్ సభ కోసం నాందేడ్ కు వచ్చిన రైతు సంక్షేమ సారథి, రైతు పక్షపాతి, బీఆర్ఎస్ అధినేత, సీయం కేసీఆర్ ను చూడాలని ఎంతో మంది రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. సీయం కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటిన బీఆర్ఎస్ మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, ప్రజలు ముఖ్యంగా రైతులు, వృద్దులు, మహిళలకు ప్రత్యేకంగా దన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభ మంచి విజయం సాధించడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని తెలిపారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన వస్తుందనడానికి ఈ సభ నిదర్శనం చెప్పారు. సభను విజయవంతం చేయడానికి సహకరించిన నాందేడ్ పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు, అనధికారులు, ప్రజాప్రతి నిధులు, రైతులు, ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Related News: