BJP Telangana Chief Extends Greetings on National Voters’ Day జాతీయ ఓటర్ల దినోత్సవం

Hyderabad : BJP Telangana State President N. Ramchander Rao today extended warm greetings to the people of Telangana on the occasion of National Voters’ Day. Highlighting this year’s theme, “My India, My Vote — Citizen at the Heart of Indian Democracy,”Ramchander Rao said that the day serves as an important reminder to reaffirm our collective commitment towards further strengthening India’s democratic foundations by actively and unfailingly participating in democratic processes at the local, state, and national levels.

He stated that conscious and consistent participation of citizens in elections goes a long way in building a strong, vibrant, and New India. Ramchander Rao urged people from all walks of life to actively create awareness about voter registration and appealed especially to the youth to register themselves as voters if they have not done so already.

“Every single vote cast enhances our democratic fabric. The Constitution of India has given every voter equal power, and the right vote has the strength to show our nation the right direction. It is our moral responsibility to safeguard the purity of our voting system and ensure that no external factor is allowed to pollute it,” he said.

He further noted that celebrating voters assumes special significance this year, as India’s total electorate is approaching the historic milestone of 100 crore voters, reflecting the scale, diversity, and vitality of Indian democracy.

On this occasion, Shri Ramchander Rao called upon citizens to recommit themselves to the pledge of using the power of their vote to build a developed, self-reliant, and powerful India. He once again urged the youth to come forward, register as voters, and play a meaningful and proactive role in shaping the future of the nation.

Also Read-

జాతీయ ఓటర్ల దినోత్సవం

హైదరాబాద్ : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది థీమ్ “నా భారతం – నా ఓటు, భారత ప్రజాస్వామ్య కేంద్రంలో పౌరుడు” అని పేర్కొంటూ, స్థానిక స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ప్రజాస్వామ్య ప్రక్రియల్లో ప్రతి పౌరుడు చురుకుగా, నిరంతరంగా పాల్గొనడం ద్వారా భారత ప్రజాస్వామ్య పునాదులను మరింత బలపరచాల్సిన అవసరాన్ని ఈ రోజు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు.

ఎన్నికల్లో ప్రజలు చైతన్యంతో, నిరంతరంగా పాల్గొనడం ద్వారా బలమైన, సజీవమైన, నూతన భారత నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని తెలిపారు. ఓటరు నమోదు ప్రాధాన్యతపై ప్రతి వర్గంలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చిన రాంచందర్ రావు, ముఖ్యంగా యువత ఓటర్లుగా నమోదు చేసుకొని తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ప్రతి ఓటు భారత ప్రజాస్వామ్య బలాన్ని పెంచుతుంది. భారత రాజ్యాంగం ప్రతి ఓటరికి సమాన శక్తిని అందించింది. సరైన ఓటు దేశానికి సరైన దిశను చూపించే శక్తి కలిగి ఉంది. ఓటింగ్ వ్యవస్థ పవిత్రతను కాపాడటం మన నైతిక బాధ్యత. ఎలాంటి బాహ్య శక్తులు ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని రాంచందర్ రావు పేర్కొన్నారు.

ఈ ఏడాది భారతదేశంలోని ఓటర్ల సంఖ్య చారిత్రకంగా 100 కోట్లకు చేరువవుతున్న నేపథ్యంలో, జాతీయ ఓటర్ల దినోత్సవానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుందని ఆయన అన్నారు. ఇది భారత ప్రజాస్వామ్య విస్తృతి, వైవిధ్యం, శక్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, అభివృద్ధిశీల, స్వావలంబన కలిగిన, శక్తివంతమైన భారత నిర్మాణం కోసం తమ ఓటు శక్తిని వినియోగించాలన్న సంకల్పాన్ని ప్రతి పౌరుడు మరోసారి పునరుద్ఘాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఓటర్లుగా నమోదు చేసుకొని, దేశ భవిష్యత్తు రూపకల్పనలో చురుకైన, అర్థవంతమైన పాత్ర పోషించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X