हैदराबाद: बंगाल की दक्षिण-पूर्वी खाड़ी में बने गंभीर निम्न दबाव के प्रभाव से यह पश्चिम-उत्तर-पश्चिम की ओर बढ़ते हुए वायुराश के रूप में मजबूत हो गया है। मौसम विभाग ने घोषणा की है कि इसके प्रभाव से 2 दिसंबर को तूफान में बदल जाएगा। यह भी घोषणा की गई है कि तूफान के कारण आने वाले दिनों में दोनों तेलुगु राज्यों और तमिलनाडु में भारी से बहुत भारी बारिश होगी।
इस तूफ़ान को मायचॉन्ग नाम दिया गया है। अधिकारियों का अनुमान है कि यह 4 और 5 दिसंबर को एपी तट के करीब आएगा। उन्होंने कहा कि वह क्षेत्र जहां यह तट को पार करता है, अभी तक स्पष्ट नहीं किया गया है। ऐसा कहा जाता है कि आमतौर पर पूर्वोत्तर मानसून के मौसम के दौरान बनने वाले चक्रवात तमिलनाडु, आंध्र प्रदेश और ओडिशा के तट को पार करते हैं। जलवायु परिवर्तन के कारण इस मौसम में दो चक्रवात पहले ही उत्तर की ओर बढ़ चुके हैं।
मौसम अधिकारियों का कहना है कि इसका एक कारण तमिलनाडु से एपी तक समुद्र की सतह का कम तापमान है। आईएमडी ने भविष्यवाणी की है कि रायलसीमा जिलों में 1 दिसंबर से तीन दिनों तक भारी बारिश होगी। मौसम विभाग ने कहा कि कम दबाव के कारण तटीय आंध्र में 65.2 मिमी से 204.4 मिमी तक बारिश हो सकती है। मछुआरों को मछली पकड़ने न जाने की चेतावनी दी गई है।
ముంచుకొస్తున్న మైచౌంగ్ తుఫాన్, భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిని తీవ్ర అల్పపీడన ప్రభావంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో డిసెంబర్ 2వ తేదీన తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను కారణంగా రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని ప్రకటించింది.
ఈ తుఫానుకు మైచౌంగ్ గా నామకరణం చేశారు. డిసెంబర్ 4, 5వ తేదీనా ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. సాధరణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఏర్పడే తుపాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో తీరం దాటుతాయని చెబుతున్నారు. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్లో ఇప్పటికే రెండు తుఫాన్లు ఉత్తరదిశగా వెళ్లిపోయాయి. తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణం అంటున్నారు వాతావరణ అధికారులు.
డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదు అవ్వచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. (ఏజెన్సీలు)