తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కవిత దీక్షకు ఐఎన్ఎల్ డీ మద్దతు
భారీ ఎత్తున తరలివచ్చిన బీసీ సంఘాల నాయకులు
72 గంటల నిరాహారదీక్ష కు అడ్డుతగిలిన ప్రభుత్వం
హైకోర్టు ఆదేశాలతో సోమవారం సాయంత్రం దీక్ష విరమణ
హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రణరంగాన్ని సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ఇది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవం కొసం చేస్తున్న పోరాటమని స్పష్ట చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులో ముస్లీంలకు కూడా వాటా ఉందన్న అనుమానం ఉన్నందున దాన్ని ఆపుతున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్లకు సపరేట్ బిల్లును పెడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని సూచించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు వేలాది మంది ప్రజలు, ఆయా కుల సంఘాలు, ప్రజా సంఘాలు హాజరై మద్ధతు ప్రకటించారు. హర్యానకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనువడు అర్జున్ సింగ్ చౌతాలా దీక్షకు హాజరై ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగునప్పుడే తెలంగాణ బాగుటుందని తెలిపారు. ప్రతీ ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, అందరికీ ఆర్థిక అవకాశాలు, సమాజంలో గౌరవం దక్కాలని, సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు రాజకీయంగా సమప్రధాన్యత దక్కాలి అని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం యాథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి మెడలు వంచడంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదింపజేసిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందామని చూస్తోందని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేమో ఇది రాష్ట్రానికి సంబంధించి బిల్లు అని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read-
బీసీ రిజర్వేషన్లలో ముస్లీలకు కూడా వాటా ఉందన్న అనుమానంతో బిల్లులను ఆపుతున్నామని బీజేపీ చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. “సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పెట్టుకొని విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారో లేదా మీరే ప్రెస్ మీట్ పెడుతారో తెలియదు… కానీ ఢిల్లీలో లేదా హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముస్లీంకు 10 శాతం రిజర్వేషన్ల కోసం వేరు బిల్లును అసెంబ్లీలో పెడుతామని ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు. ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్ల కోసం వేరే బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. స్పష్టత ఇవ్వాలని… కానీ బీసీలను మోసం చేయవద్దని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు సపరేట్ గా ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్లను తీసుకురావాలని, అప్పుడు బీజేపీ ప్రభుత్వం బిల్లుపై సంతకం చేయకపోతే ఢిల్లీకి పోయి కూడా ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం 72 గంటల నిరాహాదీ దీక్ష చేస్తున్నామని, ఇది రాజకీయ పోరాటం కాదని, ఇది ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ ప్రతిపాదించిన అహింసా మార్గంలో బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది అని చెప్పారు. 72 గంటల నిరాహార దీక్ష కోసం అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 48 గంటల పాటు నిరాహార దీక్ష చేశామని, ప్రస్తుత పాలకులు ఆంధ్రవాళ్ల కంటే పాపమైపోరారా అని అడిగారు. ధర్నా చౌక్ తెరిచామని ఢిల్లీలో గప్పాలు కొట్టే సీఎం రేవంత్ రెడ్డి నిరాహార దీక్షకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
కాగా, “ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారని కొంత మంది నాయకులు అంటున్నారు. ఎన్ని రోజులైనా ఆపండి. అర్జంట్ ఏముంది ఎన్నికలకు ? రెండేళ్ల నుంచి సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉన్నారా ? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి అభివృద్ధి జరగుతోందా ఇప్పుడు ? మరి ఎన్నికలకు అంత అర్జంట్ ఏముంది ? బీసీలకు రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలు పెట్టండి. గతంలో బీసీల హక్కుల సాధనలో భాగంగా తమిళనాడులో తొమ్మిదేళ్లు ఎన్నికలు పెట్టలేదు మరి మనమేం తక్కువ ?” అని వ్యాఖ్యానంచారు.
కాంగ్రెస్ పార్టీని వేళ్లతో సహా పెకిలించాలి – INLD నేత అర్జున్ సింగ్ చౌతాలా
ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సలాం: INLD నేత అర్జున్ సింగ్ చౌతాల వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సలాం అని ఐఎన్ఎల్డీ నాయకుడు అర్జున్ సింగ్ చౌతాలా అన్నారు. “ఒక వ్యక్తి, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయడం లేదు.. ఒక న్యాయమైన డిమాండ్ కోసం ఎమ్మెల్సీ కవిత పోరాడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాటంలో మేము భాగస్వాములవుతాము. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో పోరాడినా… హైదరాబాద్ లో పోరాడినా అండగా ఉంటాం. దేశంలో వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక జబ్బు వంటిది. ఆ జబ్బును నయం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని కూకటివెళ్లతో పెలికించాలి” అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివ శంకర్ మాట్లాడుతూ,కాంగ్రెస్, బీజేపీ లు బీసీలను మోసం చేస్తున్నాయని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ కవిత గారి పక్కన ఉన్న బీసీ నాయకులు అమ్ముడుపోయేవారని ఒక వ్యక్తి ఆరోపిస్తున్నారని.. కానీ ఆయనే బీఆర్ఎస్ లో ఒక పెద్ద నాయకుడికి కోటి రూపాయలకు అమ్ముడు పోయారని ఆరోపించారు. నిరాహారదీక్ష లో యూపీఎఫ్ కో ఆర్డినేటర్ అలకుంటల హరి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో ఆర్డినేటర్లు ఎస్. విజయేందర్ సాగర్, గొరిగే నరసింహ, కుమారస్వామి, ప్రవీణ్ కుమార్, కోల శ్రీనివాస్, సల్వాచారి, రాచమల్ల బాలకృష్ణ, రామకోటి, ఎత్తరి మారయ్య,.సురేందర్, సదానంద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది విరమణ కాదు విరామం మాత్రమే.. ఎమ్మెల్సీ కవిత
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తే, ప్రభుత్వం అనేక సాకులతో దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం సాయంత్రం ధర్నా చౌక్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. తాము 72 గంటల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు దీక్షను వాయిదా వేయాలని హైకోర్టుకు సూచించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు 72 గంటల నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ జాగృతి క్రమశిక్షణ గల సంస్థ అని కోర్టు ఆదేశలను గౌరవిస్తూ 72 గంటల నిరాహారదీక్షను విరమిస్తున్నానని ప్రకటించారు.
ఇది విరమణ కాదు విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూబీసీల తరపున పోరాటం కోన్క్సాగిస్తామన్నారు. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే వెనక్కి తగ్గినట్టు కాదని.. అలాగే తాము ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు వేస్తామన్నది గుర్తు పెట్టుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం ఆగదని అనేక రూపాల్లో కొనసాగిస్తామన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ టైం పాస్ ధర్నాలు చేస్తున్నదని వాటితో సాధించేది ఏమీ లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ ను తొక్కి పెట్టిన గవర్నర్ పై సుప్రీం కోర్టులో కేసు వేయాలన్నారు. ఢిల్లీలో టైమ్ పాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరని హెచ్చరించారు. బీసీ సంఘాలు, నాయకులతో సమాలోచనలు చేసి మరో రూపంలో పోరాటం చేస్తామన్నారు. లోకల్ బాడీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎన్నికలు ఎట్లా ఆపాలో తమకు తెలుసు అన్నారు.
కాళేశ్వరం నివేదికపై స్పందన
పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కేసీఆర్ పేరును 36 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదు అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని తాము ధర్నా చౌక్ వేదికగానే ఎత్తిచూపామన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కమిషన్ నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రాజెక్టులో అత్యధిక టెండర్లు దక్కించుకున్న మేఘా కృష్ణా రెడ్డిని ఎందుకు విచారించలేదో చెప్పాలన్నారు.
