హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల దినోత్సవం అయిన గురువారం సాయంత్రం 3 గంటలకు గన్ పార్క్ నుండి అమరుల జ్యోతి వరకు ర్యాలీగా తరలివెళ్ళనున్న ఎమ్మెల్సీ కవిత.
ఈ ర్యాలీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జాగృతి అధ్యక్షురాలు, ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత, సలహాదారులు క్రాంతి కిరణ్ ప్రారంభిస్తారని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ తెలిపారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో పలువురు జర్నలిస్టులు సైతం ఆత్మార్పణ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని వారికి ఘన నివాళి అర్పించడం తెలంగాణ జర్నలిస్టులుగా అందరి బాధ్యత అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో ఐజేయూ ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, కార్యవర్గ సభ్యులు ఆవ్వారి భాస్కర్, టెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, హైదరాబాద్ నగర అధ్యక్షులు యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ యారా, వీడియో జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు నాగరాజు కార్యదర్శి హరీష్, ఫోటో జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు భాస్కర్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు బీజిగిరి శ్రీనివాస్, కార్యదర్శి అగస్టీన్, ఆన్ లైన్ మీడియా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ లు పాల్గొననున్నట్లు ఈ ర్యాలీలో హైదరాబాద్ నగర జర్నలిస్ట్ లతో పాటు మేడ్చల్, రంగారెడ్డి జర్నలిస్ట్ లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మారుతి సాగర్ కోరారు.
A lyrical tribute to the martyrs who laid down their lives for the cause of separate #Telangana. Their sacrifice will never be forgotten and to make them immortal in the history of our state, Hon'ble Chief Minister has ordered the creation of a unique Martyrs Memorial in the… pic.twitter.com/vMr2jxvrzr
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 22, 2023