కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని 10 తలల దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద తెలంగాణ దశాబ్ది దగా కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. కేసీఆర్10 ఏళ్ల కాలం లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని కేసీఆర్ 10 తలల దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కార్యకర్తలు. మెట్టు సాయి ఆధ్వర్యంలో గాంధీభవన్ నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.

ఎల్బీనగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా కార్యక్రమం. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు.. దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని అడ్డుకున్న పోలీసులు.. మల్రెడ్డి రాంరెడ్డి తో సహా నాయకుల అరెస్టులు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ, స్టార్ కంపెయినర్…

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నిరసనలు వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. ప్రజల హక్కులను కాలరాసే విదంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం దుర్మార్గం. అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతాం.అరెస్టులు చేసిన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల హౌస్ అరెస్ట్ లు.

మాజీ ఎల్ ఓ పి షబ్బీర్ అలీ ని హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు దశాబ్ది దగా పేరు తో ధర్నా కార్యక్రమాలు.

కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

దశాబ్ది ఉత్సవాల పేరితో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తూన్న విషయం వాస్తవం కాదా. ఇది ఖచ్చితంగా దశాబ్ది దగా నే. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.ఒక హామీ అయిన పూర్తిగా అమలు చేసారా. కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే మేము ప్రశ్నిస్తున్నాం.

ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉంది. ముందస్తు అరెస్టులు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు. మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం..రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X