Telangana: 34వేల మంది బిసి బిడ్డలకు చేకూరనున్న లబ్దీ (More News From BRS)

బోజనం, వసతితో పాటు కాస్మెటిక్, బ్లాంకెట్లు, నోట్ బుక్స్ ఇతరత్రా సౌకర్యాలు

బిసి సంక్షేమంలో తిరుగులేని కేసీఆర్ సర్కార్

19 గురుకులాల నుండి 327కు పెంపు, 1,87,320మంది విద్యార్థులు

నిన్ననే జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో బిసి రియంబర్మెంట్ ప్రకటన

ఈనెల 28న బిసి మంత్రులు, బిసి సంఘాల నేతల సమక్షంలో జీవో విడుదల, లోగో లాంచింగ్

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి విద్యా సంబందిత అంశాలైన జాతీయ సంస్థల్లో బిసి రియంబర్మంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు సంబందించి జీవో విడుదల, నూతన లోగో విడుదలను ఈ నెల 28 శుక్రవారం బిసి మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి సంఘం నేతలు ఆర్ క్రుష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్.

ఈ మేరకు కరీంనగర్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యనే అన్నింటికి మూలమని, సామాజిక సమానత్వం విద్యతోనే సాద్యమనే గొప్ప నిర్ణయంతో ముఖ్యమంత్రి బిసిలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. నిన్ననే తెలంగాణ బిసి బిడ్డలకు జాతీయ స్థాయిలోని నేషనల్ ఇన్ట్సిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ తదితర 200కు పైగా విద్యాసంస్థల్లో బిసి విద్యార్థులకు పీజు రియంబర్మెంట్ అందజేసే పథకాన్ని ప్రకటించుకున్నామన్నారు మంత్రి గంగుల.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు కేసీఆర్ సర్కార్ అందిస్తుందన్నారు, రాష్ట్రంలోని 401 ప్రీమెట్రిక్ హాస్టళ్లోని 30,732 మంది విద్యార్థుల మాదిరే రాష్ట్రంలోని బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు సైతం సంపూర్ణ వసతులు కల్పిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 34వేలకు పైగా బిసి విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి బోజన, వసతితో పాటు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ చార్జీలు, వులన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.

గతంలో బోజన, వసతి మాత్రమే అందజేసేవాళ్లమని, నేటి నిర్ణయంతో విద్యార్థులు మరింత ఉత్సాహంతో విద్యను అభ్యసించి రాష్ట్రం పేరును నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటికే బిసి గురుకులాల విద్యార్థులు రాష్ట్రం పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిలుపుతున్నారని, నిన్ననే రాష్ట్ర, అంతర్జాతీయంతో పాటు జాతీయ స్థాయిలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరే బిసి విద్యార్థులకు పీజు రియంబర్మెంట్ ప్రకటించిందని ఇలాంటి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలైన రైతుబందు, ఆసరా పించన్లు, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మీ వంటి పథకాల్లో మెజార్టీ వాటా అందజేయడంతో పాటు, కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో వేలకోట్ల విలువ గల స్థలాల్లో 42కులసంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, కులవ్రుత్తుల పునర్వైబవానికి ఆర్థిక సాయం, గతంలో కేవలం 19 గురుకులాల నుండి 327 గురుకులాలకు పెంచి 152 పదోతరగతి వరకూ, 142 ఇంటర్ వరకూ 33 డిగ్రీ కాలేజీలు ద్వారా 1,87,230 మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య, 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్పులు తదితర ఎన్నో పథకాల ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు సాంస్క్రుతిక సారథి రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

చెన్నై రత్ననగర్ లో హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారిని వారి నివాసంలో కలిసి, అనంతరం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందం


నేను విన్న శ్రీరామ్ సాగర్, నేను కలలు కన్న శ్రీరామ్ సాగర్, నేను కళ్లార చూస్తున్న శ్రీరామ్ సాగర్

ఎస్సారెస్పీకి జలకళ సీఎం కేసిఆర్ గారితోనే సాధ్యం అయ్యింది

  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ: శ్రీరామ్ సాగర్ (SRSP) ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద జరిపిన “శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 60 వసంతాలు వేడుక” కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పై ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌజ్ వద్ద వేడుకలో పాల్గొని మంత్రి ప్రసంగించారు.

1951 లో ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తే..12 సంవత్సరాలు తర్వాత అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1963లో 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 40 కోట్ల వ్యయంతో శంకుస్ధాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. ఎస్సారెస్పీ పూర్తి చేసి 1983 లో డ్యాంలో నీటిని నింపారని అన్నారు. ప్రాజెక్ట్ మొదటి ఫేజ్ పూర్తి కావడానికి సుమారు 20 ఏళ్లు పట్టిందని అన్నారు. 2015-16 సంవత్సరంలో పది లక్షల ఎకరాల అయకట్టు కు నీల్లు అందిచేలా రెండో ఫేజ్ పనులు పూర్తి అయ్యాయనీ తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ కు ఎన్నో అంశాలు అడ్డుగా నిలిచాయని,1956లో ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణను కలిపిన తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ వర ప్రదాయిని నీ నిర్లక్ష్యం చేశారని తెలిపారు.

ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందనీ కేసిఆర్ గారు ఎన్నో సార్లు ఆవేదన వ్యక్తం చేశారని,ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవ ఆలయాలు లాగా,తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలుగా ఉన్నాయని 1996లో ఎస్సారెస్పీ కట్ట మీద ప్రాజెక్ట్ దుస్థితి చూసి కేసిఆర్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఎన్నో సార్లు ఎండిపోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూశానని అన్నారు.

2009-10 సంవత్సరంలో ఆర్మూర్ జెఏసి ఛైర్మన్ జర్నలిస్ట్ చారి అధ్వర్యంలో బాల్కొండ ప్రాంతంలో 100 కి. మీ పాదయాత్ర చేపట్టామని అప్పుడు ఎస్సారెస్పీ ప్రాజెక్టును కళ్ళారా చూశాననీ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు మంత్రి. గంగమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా దీవించు..ఈ ప్రాంతం పచ్చ బడేలా దీవించు,నీవు తరిలా తల్లి అని పూజలు చేశామని తెలిపారు. ఇక్కడ ఎంతో మంది హేమహేమి ఇరిగేషన్ ఇంజనీర్ల నడుమ ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని తెలిపారు. ఒక్కో ఇంజనీర్ తో తన అనుబంధాన్ని మంత్రి ఈ సందర్బంగా పంచుకున్నారు.

ఎస్సారెస్పికి రివర్స్ పంప్ ద్వారా నీరు వస్తుందా అని సందేహలు వ్యక్తం చేశారు కానీ కేసిఆర్ దాన్ని సాధ్యం చేశారని అన్నారు. పునర్జీవ పధకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు లోకి తీసుకొచ్చామని,ఎస్సారెస్పి ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు చేశామన్నారు. ప్యాకేజీ 21,22 ద్వారా ఉమ్మడి జిల్లాలోని గ్రామాలకు కాళేశ్వరం జలాలను త్వరలో అందిస్తామన్నారు. పునర్జీవ పధకం తో రైతులకు భరోసా వచ్చిందన్నారు. పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ ఎప్పుడూ నిండు కుండలా ఉంటుందని తద్వారా అలీ సాగర్,గత్పాలిఫ్ట్,నవాబ్ లిఫ్ట్,లక్ష్మి కెనాల్,చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్, బోదేపల్లి లిఫ్ట్ ల ద్వారా నిజామాబాద్ జిల్లా బాల్కొండ రైతాంగానికి సాగు నీరు అందించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో ఉద్యమ కారుడు, రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు శ్రీధర్ రావుదేశ్ పాండే,ఈఎన్సి నాగేందర్,ఎస్సారెస్పీ సి.ఈ సుధాకర్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సి.ఈ నల్లా వేంకటేశ్వర్లు,నిజామాబాద్ సి.ఈ మధుసూదన్,సి.ఈ శంకర్, ఎస్.ఈ శ్రీనివాస రెడ్డి,సీనియర్ ఇంజనీర్ విజయ ప్రకాష్ పలువురు ఇరిగేషన్ శాఖ ఈ.ఈ లు,ఏ.ఈ లు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

————————-

తెలంగాణకు వస్తా, వ్యవసాయ ప్రగతి చూస్తా

అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని ఉంది

మర్యాదపూర్వకంగా చెన్నైలోని తన నివాసంలో కలిసిన తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి ప్రతినిధి బృందానికి స్పష్టంచేసిన హరిత విప్లవ పితామహులు ప్రొఫెసర్ స్వామినాథన్ గారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయ విజయాలను వివరించాం. మీ స్ఫూర్తితోనే రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపాం.

రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, పంటల కొనుగోళ్ల తీరు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత, రైతువేదికలు వంటి వాటిని వారి దృష్టికి తీసుకెళ్లాం. ఐక్యరాజ్యసమితి Food & Agriculture Organisation వాళ్లు మానవాళిని ప్రభావితం చేసిన 20 బృహత్ పథకాలలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుభీమా పథకాలున్నాయి అన్న విషయం వారి దృష్టికి తీసుకెళ్లాం. అన్ని విషయాలు నాకు తెలుసు, తాను గతంలో FAO చైర్మన్ గా పనిచేసినట్లు తెలిపారు.

98 ఏళ్ల వయసులోనూ వారి ఇంత గొప్ప జ్ఞాపకశక్తి అమోఘం .. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును పరిచయం చెయ్యగానే గతంలో చూసినట్లు తెలిపారు. స్వామినాథన్ గారు తన ఆరోగ్యం కుదుటపడగానే తెలంగాణకు వచ్చి పరిశీలిస్తానని అన్నారు. 98 ఏళ్ల వయసులో వారు స్వయంగా తెలంగాణకు వస్తాను అని చెప్పడమే గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం.

ఈ దేశంలో ఉన్న కోట్లాదిమంది ప్రజల ఆకలి తీర్చిన వ్యవసాయ సంస్కరణల, సస్యవిప్లవ పితామహుడు స్వామినాథన్ గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ మంత్రిగా కలవడం అదృష్టంగా, జన్మకు లభించిన సార్ధకతగా భావిస్తున్నాను. ఇక్రిషాట్ ఏర్పాటుకు ఆద్యుడు స్వామినాథన్ గారు .. వ్యవసాయరంగంలో వచ్చిన అనేక నూతన ఆవిష్కరణలకు ఐకార్ డైరెక్టర్ గా పనిచేసిన స్వామినాథన్ గారు కారణం వ్యవసాయ విస్తరణ, విద్య, సాంకేతిక పరిజ్ఞానం అన్నింటికీ ఆయనే ఆద్యుడు.

2004 యూపీఏ ప్రభుత్వంలో వేసిన వ్యవసాయ కమీషన్ కు నాయకత్వం వహించిన స్వామినాథన్ గారు భారత అవసరాలే కాకుండా ప్రపంచ అవసరాలను తీర్చే దేశం భారతదేశం అని రైతుల ఆదాయం పెరగాలి, వారి ఆదాయం సుస్థిరంగా ఉండాలి అని సూచనలు చేశారు. 2007 లో స్వామినాధన్ గారు నివేదిక ఇచ్చినా 2014 వరకు దానిని యూపీఎ ప్రభుత్వం అమలు చేయలేదు .. దానికి ఆయన బాధపడ్డారు. స్వామినాధన్ గారి నివేదిక అమలు చేయలేదని, ఇది స్వామినాథన్ గారిని అవమానించడమేనని యూపీఏను ప్రశ్నించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని 2013 లో ప్రకటించారు.

2014 లో ఎన్డీఎ అధికారంలోకి వచ్చి , మోడీ ప్రధాని అయ్యాక స్వామినాథన్ కమిటీపై అశోక్ దల్వాయితో మరో కమిటీ వేసి అవమానించారు. దాని మీద వచ్చిన నివేదికతో 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్నారు .. ఇప్పటికి 2023 వస్తున్నా రైతుల ఆదాయం రెట్టింపు సంగతి పక్కన పెడితే నరేంద్రమోడీ ఒక్క హామీ అమలుకాలేదు.

ఉపాధిహామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని గాలికి వదిలేశారు. పైగా స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. యూపీఎ, ఎన్డీఎ ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకపోవడం అత్యంత బాధాకరం. ఈ దేశంలో రైతుకేంద్రంగా, రైతు విధానాలు కేంద్రంగా దేశంలో గొప్ప మార్పు రావాల్సి ఉన్నది .. ఆ దిశగా దేశం ఆలోచిస్తున్నది.

చెన్నై రత్ననగర్ లో హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారిని వారి నివాసంలో కలిసి, అనంతరం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వారి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంలు ఉన్నారు.

——————————–

ఒకవైపు పాలనలో..మరోవైపు రాజకీయాల్లో నిత్యం బిజీబిజీగా గడిపే మంత్రి సత్యవతి రాథోడ్ గారు హోటల్ లో స్వయంగా ఆమ్లెట్ వేసి సందడి చేశారు. మహబూబాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో భోజనం విరామం సమయంలో తొర్రూరులోని రోడ్డు సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్ద ఆగారు మంత్రి.

హోటల్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో మంత్రి ముచ్చటించారు. వారు వంట చేస్తుండగా వారితో కలిసి మంత్రి స్వయంగా ఆమ్లెట్ వేసి సిబ్బందికి వడ్డించారు. దీంతో హోటల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులకు తాను స్వయంగా వంట చేసి పెడతానని మంత్రి వివరించారు.


సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఆరేకటిక సమాజం ప్రతినిధులు, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికే అదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు ఈ సందర్బంగా అన్నారు.

స్వరాష్ట్రంలో సంక్షేమం, అభివ్రుది లకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, బి ఆర్ ఎస్ పార్టీలు.. తెలంగాణకు శ్రీ రామరక్ష అన్నదే వాస్తవమని గుర్తించి పార్టీలోకి వస్తున్న వారికి స్వాగతం పలికారు.

వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టే బిఆర్ఎస్ వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, డిసిఎంఎస్ ఛైర్మెన్ శివకుమార్, గుండప్ప, ఉమాకాంత్ పాటిల్, విజయ్ కుమార్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

—————–

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆరు సహకార కేంద్ర బ్యాంక్ లు

రైతాంగానికి సేవలు అందించడంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ల పని తీరు భేష్

యావత్ రైతాంగాం సహకార సంఘాలలో సభ్యత్వం పొందాలి

ఇతర ఆహార ఉత్పత్తుల కొనుగోళ్లు,అమ్మకాలు సహకార కేంద్ర బ్యాంక్ లు చేపట్టాలి

మంత్రి జగదీష్ రెడ్ది

చిట్యాల మండల కేంద్రంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

పాల్గొన్న జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తదితరులు

హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంక్ లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ఆయన ప్రారంభించారు. డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన తరహాలోనే కో-ఆపరేటివ్ రంగం అద్భుతమైన ఫలితాలు సాదించిందన్నారు.అంతకు ముందు కరీంనగర్ జిల్లా ములక నూరు లాంటి సహకార సంఘాలు వేళ్ళ మీద లెక్కించేవి గా ఉన్నాయన్నారు.తదనంతర కాలంలో రైతాంగాంలో గణనీయమైన మార్పులు సంబవించడంతో వ్యవసాయ రంగానికి సహాకర రంగం సేవలు కీలకంగా మరాయన్నారు.

అందులో ముఖ్యంగా రైతాంగానికి సేవలు అందించడంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ ల పనితీరు భేషుగ్గా ఉన్నదని ఆయన కితాబిచ్చారు.విత్తనాలు,ఎరువుల విక్రయాల తో పాటు ధాన్యం కొనుగోళ్లలో సహకార సంఘాల పాత్ర అద్భుతమైన సేవలు అందిస్తున్నదన్నారు.అయితే అదే సమయంలో సహకార సంఘాలు ఇతర ఆహార ఉత్పత్తుల అమ్మకాలు,కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. యావత్ రైతాంగం సహకార సంఘాలలో విధిగా సభ్యత్వం పొంది ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహాకార సంఘలా అభివృద్ధిలో డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గా ఉన్న గొంగిడి మహేందర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్నారు.
సహాకార రంగంలో ఆయన గడించిన అనుభవం తోడైందని ఆయన ప్రశంశించారు.

————————-

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించగలరని కోరుతున్నాను. కంట్రోల్ రూంతో పాటు, నా కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటూ, వరద ప్రభావిత ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుంది.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు , స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితులు, సహాయచర్యలను ఎప్పటకప్పుడు పర్యవేక్షిస్తూ భరోసానిస్తున్నారు.అధికారులు లోతట్టు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల కనీస అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యం, ఆహారం, విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం ఎక్కడికక్కడ త్వరితగతిన చర్యలు తీసుకుంటూ అధికారులు ప్రజలకు భరోసానివ్వనున్నారు.
—————————

లోక్ సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం – మద్దతు ఇచ్చిన మజ్లిస్

లోక్ సభలో భారత రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులు ఇచ్చారు. ఆ అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్టులో చేర్చాలని కోరారు. లోక్‌సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్‌లోని 17వ అధ్యాయంలోని రూల్ 198 (బి) కింద, ఈ క్రింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నోటీసు ఇచ్చింది.

ఇవాళ సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా ఆ పార్టీ కోరింది. దీనికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ [ఏఐఎంఐఎం] పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిపై ఏఐఎంఐఎం అధినేత, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X