Heavy Rain: హెలికాప్టర్లు, రెస్క్యూ టీంలు, పడవలతో, అధికారులు, సిబ్బంది కష్టపడ్డారు (More News From BRS)

ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డాం

సకాలంలో స్పందించి, సహాయక చర్యలు చేపట్టాం

హెలికాప్టర్లు, రెస్క్యూ టీంలు, పడవలతో, అధికారులు, సిబ్బంది కష్టపడ్డారు

లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మందిని పునరావస కేంద్రాలకు తరలించాం

ఆహార పొట్లాలు, మంచినీరు, మందులు అందజేశాం

గతంలో చేపట్టిన శాశ్వత వరద నివారణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి

మరికొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయి

అయినా అతి భారీ వర్షాల వల్లే ఈ అనర్ధాలు

మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి

వరదలు తగ్గి, పూర్వ స్థితి వచ్చే వరకు అధికారులు, సిబ్బంది విశ్రమించవద్దు

అప్పటివరకు సహాయక చర్యలు పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి

సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సిఎస్ ఎప్పటికప్పుడు సహాయ పునరావాస చర్యలపై సమీక్షిస్తున్నారు

వరంగల్ మహా నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని పలు లోతట్టు నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులతో కలిసి పర్యటించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్, హనుమకొండ : అతి భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అపార నష్టం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం రోజున హనుమకొండ పరిమళ కాలనీ, జవహర్ నగర్ లలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి నీటి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అలాగే వరంగల్ – మామునూరు హెలీ ప్యాడ్ నుండి ఏటూరు నాగారం – కొండాయిలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు, భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాధితుల కు ఆహార పొట్లాలు, నీరు, మందులను స్వయంగా దగ్గరుండి హెలికాప్టర్ల ద్వారా మంత్రి ఎర్రబెల్లి పంపించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…. వర్షాలు భారీగా పడుతున్న సమయంలో సకాలంలో స్పందించి, సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అన్నారు. హెలికాప్టర్లు, రెస్క్యూ టీమ్ లు, పడవలు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్చి ఆహార పొట్లాలు, మంచి నీరు, మందులు అందించామన్నారు.

గతంలో వరద వచ్చిన సమయంలో చేపట్టిన శాశ్వత వరద నివారణ చర్యల వల్లే చాలా వరకు ఇబ్బంది తగ్గిందన్నారు. మరికొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తున్నాం అన్నారు. అతి భారీ వర్షాల వల్లే ఈ అనర్ధాలు వచ్చాయని చెప్పారు. ప్రజలు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వరదలు తగ్గి, పూర్వ స్థితి వచ్చే వరకు అధికారులు, సిబ్బంది విశ్రమించవద్దన్నారు.

——————————-

వర్షాల నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోండి

గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ: ఏకధాటిగా భారీ వర్షాలు కురియడంతో అనేకచోట్ల చెరువు కట్టలు తెగి రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న దృష్ట్యా మరో రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు హితవు పలికారు. రహదారుల పై నుండి నీరు ప్రవహిస్తున్న ప్రదేశాల్లో ఎంతమాత్రం రోడ్డును దాటే ప్రయత్నం చేయవద్దని జాగ్రత్తలు సూచించారు.

మూడవ రోజు కూడా మంత్రి పలు మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో నవాబ్ చెరువు మరియు ఇతర చెరువులు తెగడంతో గ్రామానికి వెళ్లే రహదారులు,బ్రిడ్జ్ లు కోతకు గురికావడంతో అధికారులతో కలిసి పోలీస్ బస్ లో ప్రయాణం చేస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ పరిశీలనకు వెళుతూ మార్గ మధ్యలో బాల్కొండ మండల కేంద్రంలో నాయకులు, ప్రజల్ని కలిసి మండలంలో కురిసిన భారీ వర్షాల గురించి ఆరా తీశారు.

లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి నాయకులు సహాయ సహకారాలు అందించాలని,బియ్యం కూరగాయలు అందించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వన్నెల్ బి,బోదెపల్లి,బాల్కొండ మండల ప్రజలను, నాయకుల ను కలుస్తూ గ్రామ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెండోరా మండలం కోడిచెర్ల మరియు సావేల్ గ్రామాల మధ్య రహదారి పై నుండి నిన్నటి వరకు ఉదృతంగా నీరు పారడంతో ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి నుండే ఆర్ అండ్ బి అధికారులకు కాల్ చేసి ఫోన్ లో శాశ్వత ప్రాతిపదికన ఎం చేయవచ్చునో పరిశీలించాలని అదేశించారు.
పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ కు వరద ఎక్కువగా వస్తుండటంతో సుమారు 30 గేట్ల ద్వారా లక్ష 80వేల క్యూసెక్కుల నీరు గోదావరి లోకి వదులుతుండటంతో అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు…

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి పెద్ద ఎత్తున ఇన్ ఫ్లో వస్తున్నందున రిజర్వాయర్ దిగువన గల దూదిగాం, సావెల్, కోడిచెర్ల, చాకిరియాల్, బట్టాపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల తదితర పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నది సమీపానికి వెళ్లే సాహసం చేయవద్దని, అనవసర ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ మేరకు ప్రజలెవరూ గోదావరి నది పరిసరాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మెండోరా, ఏర్గట్ల మండలాల రెవెన్యూ, పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రిజర్వాయర్లో 80 నుండి 82 టీఎంసీ ల వరకు నీరు నిలువ ఉంచుతూ, మిగితా వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.

వరద ప్రవాహం మరింతగా పెరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఐదు లక్షల క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు విడుదల చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. గత నలభై, యాభై సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రులు కూడా ఎస్సారెస్పీని పట్టించుకోలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారి ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతుల కోసం రూ. 22 కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఒకేసారి అన్ని గేట్ల మరమ్మతులు చేపట్టడం సాధ్యపడనందున విడతల వారీగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మరో ఆరు గేట్లకు మరమ్మతులు పూర్తి కావాల్సి ఉందని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

కాగా, వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడం వల్ల వరద తీవ్రత క్రమక్రమంగా తగ్గుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత మూడు రోజుల నుండి తాను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోందన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, జిల్లా యంత్రంగం యావత్తు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు. వరద తాకిడికి గురైన వారిని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వర్షపు జలాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి, సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

వర్షాల వల్ల నివాస గృహాలు దెబ్బతిన్న వారికి ఆపద్బాంధు పథకం కింద ఆదుకుంటామని, పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించామన్నారు. శాశ్వత మరమాతులకు అవసరమైన అంచనాలను సైతం రూపొందించాల్సిందిగా సూచించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామని, బీ ఆర్ ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బాధితులకు భోజన సదుపాయం, ఇళ్ల మరమ్మతులకు ఆర్ధిక సహకారం అందించాలని సూచించారు.

————————–

తెలంగాణలో కరంటు కోత, కొరత ఉండదు

ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ నిర్మాణం

నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలకపాత్ర

అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రతి చోట విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు

24 గంటల విద్యుత్ సరఫరా లేకుంటే పరిశ్రమలు, వర్తక, వాణిజ్యాలు, గృహావసరాలు, వ్యవసాయం మూలంగా కోట్లాది మందికి ఉపాధి లభించేది కాదు.

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ఐటీ, పారిశ్రామిక, చేతివృత్తులలో ఉపాధి లభిస్తున్నది

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో చేసిన పని ఇది

దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నది

తెలంగాణ దరిదాపులలో కూడా ఇతర రాష్ట్రాలు లేవు

రాష్ట్రంలో విద్యుత్ వినియోగాన్ని బట్టే అంతగా ప్రజల అవసరాలు తీరుతున్నాయని, అన్ని పనులు జరుగుతున్నాయని అర్ధం

అభివృద్ధి సూచికలో ప్రధానమైనది విద్యుత్

వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదయింది

అయినా వర్షాధార పంటలయిన పత్తి, మొక్కలకు ఎలాంటి ఇబ్బంది లేదు

నెల రోజులు ఈ సారి కాలం ఆలస్యమయింది .. రైతులు వ్యవసాయ అధికారుల సూచన మేరకు సాగుచేయాలి

ఆరుతడి పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలి

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం, ఉప్పల గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆర్ డి ఓ చంద్రకళ, డి ఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

—————–

మంత్రి హరీశ్ రావు ట్వీట్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవల సిబ్బందికి అభినందనలు. సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న సేవలు అమూల్యం. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో విపత్తు నిర్వహణ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ, అరోగ్య సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు అభినందనీయం. వానలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.

ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X