బొడ్రాయి బాగుంటే ప్రజలంతా బాగుంటారు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సంప్రదాయాలకు పునః వైభవం వస్తోంది
Hyderabad: జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ఘనంగా నిర్వహించుకుంటున్న బొడ్రాయి పునః ప్రతిష్ట మహోత్సవానికి హాజరై, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
బొడ్రాయి పండుగ సందర్భంగా కోలాటాలతో, అమ్మవారి బోనాలతో ఘనంగా మంత్రి గారికి గ్రామస్తులు స్వాగతం పలికారు. మంత్రిగారు బోనం ఎత్తుకొని బొడ్రా వద్దకు మహిళలతో కలిసి వెళ్లారు. అనంతరం కాలినడకన ఊరు చివర్లో ఉన్న దుర్గామాత గుడి వరకు గ్రామస్తులతో కలిసి వెళ్లి శంకుస్థాపన చేశారు.
బొడ్రాయి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు….
గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు.
బొడ్రాయి తీర్చి దిద్దడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
ఈ పండగ మన వెనుకటి సంప్రదాయం.
ఆ సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నాయకత్వములో మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది.
రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం.
సీసీ రోడ్డు మంజార్రు చేస్తున్నాను…ఈ బొడ్రాయి ని మంచి కేంద్రంగా చేస్తాను
మొంద్రయి అన్ని విధాల అభివృద్ది అవుతుంది.
మొండ్రాయికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయి. ఒక్క కాలువ నీళ్ళు వచ్చేది ఉంది.
ఎండాకాలం లోపు అవి కూడా వస్తాయి.
120 గ్రామాలకు మాట ఇస్తే కాలువ నీళ్ళు ఇస్తానని మాట ఇస్తే 100 గ్రామాలకు నీళ్ళు వచ్చాయి.
మిగితా గ్రామాల్లో కోర్టుకు వెళ్ళడం వల్ల పని ఆలస్యం అవుతుంది.
అయినా కోర్టులో స్టే ఎత్తి వేయించి, గ్రామస్తులను భూమి ఇవ్వడానికి ఒప్పించి పనులు చేస్తున్నాను.
అప్పట్లో ఎకరానికి లక్ష రూపాయలు ఉండేది. ఇప్పుడు ధరలు బాగా పెరిగాయి. అందుకే ఎకరానికి ప్రభుత్వం నుంచి 9 లక్షలు ఇచ్చేలా కొట్లాడాను.
మొండ్రాయి చెరువుకు నీరు కచ్చితంగా తెస్తాను.
మీ ఊరి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.
మీ ఆశీర్వాదం నాకు ఉండాలి.
అనంతరం గ్రామంలో దుర్గామాత గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు.
దుర్గామాత గుడి కట్టించడానికి అయ్యే ఖర్చు భరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
గుడి కట్టించేందుకు గ్రామ పెద్దలు ఎవరో ఒకరు ముందుండి పనులు చేయాలని చెప్పారు.
గుడి కట్టిన తర్వాత ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పారు.
తర్వాత గ్రామంలో అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం గ్రామంలో కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితి( బి.ఆర్.ఎస్) పార్టీలో చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో దౌపాటి ఎల్లయ్య, ఉపేందర్, సునీల్, వెంకన్న, ప్రశాంత్, కొండయ్య, పరశురాములు, దేవయ్య, రాము, లక్ష్మణ్, కిష్టయ్య, హరిబాబు, యాకన్న తదితరులు ఉన్నారు.