చాలా సంతోషంగా దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహావిష్కరణ చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు

Hyderabad: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రం లో దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహావిష్కరణ చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఏపీ హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ కురుమ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎడ్ల మల్లేశం, కురుమ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ…

“ఆలేరు నియోజకవర్గం లో ఎంతో స్ఫూర్తిని చూపిస్తూ దొడ్డి కొమురయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తికోసం, విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం.

తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమురయ్య గారి పోరాట స్ఫూర్తితో నే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కురుమ కులస్తులైన రాములు సాంబశివుడు నమ్మిన ధర్మం కోసం చివరి వరకు పోరాటం చేశారు. ఏ కులంలో నైనా ఐక్యత, విద్య ఉండాలి. కురుమ కులస్తులు కూడా ఐక్యమత్యంగా ఉండి విద్యలో రాణించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది.

కురుమ కులస్తులు పిల్లలను బాగా చదివించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఇంగ్లీషులో విద్యాబోధన అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైనా మీరు చదివించవచ్చు కానీ చదివించడం మాత్రం ముఖ్యం. అదేవిధంగా బాల్యవివాహాలు నిర్మూలించేందుకు కల్యాణ లక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. 18 ఏండ్లు నిండిన వారికి మాత్రం కల్యాణ లక్ష్మి వస్తుంది కాబట్టి దానివల్ల సమాజంలో బాల్య వివాహాలు చాలా తగ్గాయి.

తెలంగాణ ప్రభుత్వం దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని పాఠ్య పుస్తకాల్లో చేర్చింది. కొమురవెల్లి మల్లన్న గుడికి ఒక కురుమను చైర్మన్ చేసిన ఘనత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. రాష్ట్ర కురుమ సంఘం భవనం కూడా పూర్తికావచ్చింది. త్వరలోనే దాన్ని పూర్తి చేసి కురుమ కులస్తులకు అంకితం చేయబోతున్నాం. విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గొప్పతనం కాదు దొడ్డి కొమురయ్య గారి స్ఫూర్తిని కొనసాగించినప్పుడే ఆయనకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X