“శ్రీ సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శం”

వల్మీడికి భద్రాచలానికి మించిన వైభోగం

పాలకుర్తి, బమ్మెర, వల్మీడి ల పై సీఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి

ఈ అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం

వారి కళ్యాణోత్సవాలలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం

సీఎం కెసిఆర్ అధ్వర్యంలో నే దేవాలయాలకు పూర్వ వైభవం

ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వల్మీడి దేవాలయం

శ్రీ భద్రాద్రి తరహాలో వల్మీడి దేవాలయ అభివృద్ధి

చారిత్రక వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు

శ్రీ రామ నవమి సందర్భంగా పలు ఆలయాల్లో ఘనంగా జరిగిన సీతారామ కళ్యాణ ఉత్సవాలకు హాజరు

ఆ ధన్య దంపతులకు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన ఈ పుణ్య దంపతులు

పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతుల సుడిగాలి పర్యటన

వరంగల్ : పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. శ్రీ రామ నవమి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలు వారి సతీమణి ఉషా దయాకర్ రావు తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు, తొర్రూరు, నాంచారి మడూరు, వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి తదితర దేవాలయాల్లో కళ్యాణోత్సవాలకు హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు – ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు దంపతులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X