‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు

రాజకీయాలకు అతీతంగా సమాజానికి స్పూర్తినిచ్చేలా మన్ కీ బాత్ నిర్వహించడం గ్రేట్

కాశ్మీర్ నుండి కన్యాకుమారిదాకా అటక్ నుండి కటక్ దాకా ఎన్నో అంశాలను ప్రస్తావించిన మోదీ

ఒక్క పిలుపుతో 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేసిన ఘనత మోదీదే

మన్ కీ బాత్ ద్వారా టెన్షన్ లేకుండా విద్యార్థుల ప్రశాతంగా పరీక్షలు రాసేలా మోదీ చేసిన యత్నం భేష్

సమాజం నిర్లక్ష్యం చేసిన గొప్ప వాళ్లను మన్ కీ బాత్ ద్వారా ప్రపంచానికి చూపి స్పూర్తినింపిన మోదీ

వివిధ రంగాల్లో సమాజానికి సేవలందిస్తున్న తెలంగాణలోని ఎంతోమందిని దేశానికి చూపిన నేతౌ

మోదీ దేశం కోసం కష్టపడుతుంటే… కేసీఆర్ చేస్తున్నదేమిటి తాగి పండటం తప్ప?

స్కాంలు…లిక్కర్… లీకేజీ… ప్యాకేజీలతో దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబం

కేసీఆర్ బాటలోనే కమీషన్లు తీసుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

దళితబంధులో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని సీఎం ప్రకటించడమే ఇందుకు నిదర్శనం

పసిపిల్లలు చనిపోతున్నా కనీసం స్పందించని మూర్ఖుడు కేసీఆర్

కేసీఆర్… మీడియాను అణిచివేస్తుంటే జర్నలిస్టు సంఘాలేం చేస్తున్నయ్?

ఏం తప్పు చేశాయని వీ6, వెలుగు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, రాజ్ న్యూస్ లను రానీయడం లేదు?

మీడియాను అణిచివేయాలనుకున్నోళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారు

అయినా కేసీఆర్, బీఆర్ఎస్ నేతల ముఖాలు చూపించకపోతేనే ఆ టీవీ, పత్రికలకు ఆదరణ పెరుగుతోంది

కేసీఆర్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు

ఏ సర్వే చూసినా బీజేపీకే మొగ్గు ఉందని నివేదికలొస్తున్నాయ్

బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం

‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ లో బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

హైదరాబాద్ : ‘‘మన్ కీ బాత్’’ ప్రపంచ రికార్డు. రాజకీయాలకు అతీతంగా సమాజానికి స్పూర్తినిచ్చేలా మన్ కీ బాత్ నిర్వహించడం గ్రేట్. ఒక్క పిలుపుతో 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేసిన ఘనత మన్ కీ బాత్ దే. కాశ్మీర్ నుండి కన్యాకుమారిదాకా అటక్ నుండి కటక్ దాకా ఎన్నో అంశాలను ప్రస్తావిస్తూ సమాజానికి స్పూర్తి నింపిన మోదీగారికి ధన్యవాదాలు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మోదీ నిరంతరం దేశం కోసం పరితపిస్తుంటే… కేసీఆర్ మాత్రం తాగి పండుకుంటూ తెలంగాణ ప్రజలను కలవడం లేదని విమర్శించారు.

నాలాలో పడి పసిపిల్లలు చనిపోతున్నా… కుక్క కరిచి చనిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే మీడియాను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుంటే జర్నలిస్టు సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మీడియాను అణిచివేయాలనుకున్న పాలకులంతా కాలగర్బంలో కలిసిపోయారని, కేసీఆర్ కూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు ఒక వర్గం వారిని సంత్రుప్తి పర్చేలా నిర్మించిన సచివాలయానికి తాను వెళ్లబోనని పునరుద్థాటించారు. గుజరాత్ లోనూ అదే మోడల్ ఉందనే వాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని.. గుజరాత్ సంస్క్రుతి ఉట్టిపడేలా అక్కడి కట్టడాలున్నాయన్నారు. తెలంగాణ సంస్క్రతిని ప్రతిబింబించేలా సచివాలయంలో మార్పులు చేసిన తరువాతే అందులో అడుగుపెడతానని స్పష్టం చేశారు.

• ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ ఉదయ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, బీజేపీ నేతలు బద్దం మహిపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, రాఘవరావు తదితరులు హాజరయ్యారు. బస్తీకి చెందిన ప్రజలంతా మన్ కీ బాత్ కార్యక్రమానికి హాజరై ప్రధానమంత్రి మోదీ ప్రసంగాన్ని విన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• ఈరోజు ఆదివారం. బస్తీవాళ్లంతా ‘‘మన్ కీ బాత్’’ కు హాజరైతున్నరు. ఇట్లా ప్రతి ఒక్కరూ హాజరవడం సంతోషంగా ఉంది. మోదీగారు మన్ కీ బాత్ పేరుత్ 100 సార్లు మాట్లాడటం చాలా గొప్ప విషయం. ఇది ప్రపంచ రికార్డు. గతంలో అమెరికా అధ్యక్షులు 72 ఎపిసోడ్లు చేస్తే.. భవిష్యత్తులో ఎవరూ దాటలేని స్థితిలో 100 ఎపిసోడ్లు పూర్తి చేసి రికార్డు స్రుష్టించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి కటక్ వరకు ఎన్నో అంశాలను ప్రస్తావించారు. సమాజానికి స్పూర్తినిచ్చారు.

• దేశంలో రోజు ప్రతిపక్షాలు, లౌకిక కుహానావాదులు అనేకసార్లు ప్రధానిపై విమర్శలు చేశారు. కానీ ఏనాడూ మన్ కీ బాత్ ను రాజకీయంగా ఉపయోగించుకోలేదు. ప్రజల సమస్యలపైనే చర్చించారు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు.

• కరోనా సమయంలో ప్రపంచం అల్లాడితుంటే ప్రధానమంత్రి మోడీ గారు ‘‘మన్ కీ బాత్’ పేరుతో రేడియో, టీవీల ద్వారా ఒక్క పిలుపునిచ్చి 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేయగలిగిన మహానేత మోదీ. ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నానని మన్ కీ బాత్ ద్వారా పిలుపునిస్తే ఇయాళ 200 కోట్లకుపైగా డోసులు వేసుకుని కరోనా ను కట్టడి చేసిన ఘనత మోదీదే.

• పరీక్షలొస్తే పిల్లలంతా టెన్షన్.. అంతకంటే ఎక్కువగా తల్లిదండ్రుల్లో టెన్షన్.. వాళ్లలో మనోధైర్యం నింపుతూ ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేలా మన్ కీ బాత్ నిర్వహించిన ఘనత మోదీదే. కష్టపడి పనిచేసే వారిని మన్ కీ బాత్ ద్వారా పరిచేస్తూ సమాజానికి స్పూర్తినింపారు.

• తెలంగాణ విషయానికొస్తే.. ఏ లాభాపేక్ష లేకుండా ప్రజల్లో విజ్ఝానం నింపాలనే ఆశయంతో సొంత ఖర్చుతో 2 లక్షల పుస్తకాలను సేకరించి సొంతంగా గ్రంధాలయం నిర్వహిస్తూ జ్ఝానాన్ని పంచుతున్న యాదాద్రి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన కూరెళ్ల విఠలాచార్య గారితో మోదీగారు నేరుగా మాట్లాడి… ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. అట్లాగే G-20 ఫ్లాగ్ ను రూపొందించిన సిరిసిల్ల హరిప్రసాద్, ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిజన బిడ్డ పూర్ణా మాలావత్ ను, విటమిన్-డి ట్యాబ్లెట్ ను తయారు చేసి ప్రపంచానికి అందించిన హైదరాబాద్ బిడ్డ చింతల వెంకట్ రెడ్డి, తెలంగాణ కళ పేరిణి న్రుత్య కళాకారుడు రాజ్ కుమార్ నాయక్, మాత్రు నారీ శక్తిగా పేరొందిన వరంగల్ జిల్లా రంగశాయిపేటకు చెందిన అరుణ, ఆత్మనిర్బర్ భారత్ ద్వారా లబ్ది పొంది హన్మకొండ ఎంజీఎం ఆసుపత్రి వద్ద టీ స్టాల్ ను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహమ్మద్ పాషా, కరోనాతో దేశమంతా వణికిపోతూ ధైర్యంగా చెప్పుకోలేని స్థితితో ఉన్న రోజుల్లో కరోనా సోకినా భయపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఎదుర్కొన్న హైదరాబాద్ కు చెందిన రామ్ తేజతోపాటు బోయినిపల్లి మార్కెట్ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచేయం చేసిన నాయకుడు నరేంద్రమోదీ. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మన్ కీ బాత్ నిర్వహించి చరిత్ర స్రుష్టించాం. అందరికీ హ్రుదయ పూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల తరుపున మోదీకి ధన్యవాదాలు చెబుతున్నా.

• మోదీగారు 18 గంటలపాటు పేదల కోసం పనిచేస్తుంటే… కేసీఆర్ మాత్రం 4 గంటలు కూడా పనిచేస్తలేరు. తాగడం పండటం తప్ప చేసిందేమీ లేదు. ప్రజలను కలవడు. వాళ్ల సమస్యలు తెలుసుకోడు. ఎవరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యలే. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడు. ఎంతసేపు కొడుకు, బిడ్డ లంగ దందాల కోసం దోచుకుంటున్నడు.

• నిన్న దళిత బందు పథకంలో 30 శాతం కమీషన్ దొబ్బుతున్నారని మంత్రులను, ఎమ్మెల్యేలను తిట్టాడట… మరి ఎందుకు అడ్డుకోలేదు. నువ్వు అడ్డుకోలేదంటే నీకూ వాటా ఉన్నట్లే కదా? అయినా యధారాజా తథాప్రజా… ప్రాజెక్టులు, స్కీంలు, స్కాంల పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దొబ్బుతుంటే… ఎమ్మెల్యేలు కూడా కమీషన్లు సంపుతూ ఆయన బాటలోనే నడుస్తున్నరు. పేదల దగ్గర కమీషన్లు దొబ్బుతున్నరంటే అంతకంటే సిగ్గు చేటు లేదు.. ఒకామెకు ఒక ఎమ్మెల్యే దళిత బందులో మంజూరైన 10 లక్షల్లో 9 లక్షలు కమీషన్ దండుకుని లక్షే ఇచ్చారట.. అట్లుంది కేసీఆర్ పాలన.

• ప్రధానమంత్రి దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను కాపాడేందుకు నిరంతరం కష్టపడుతుంటే… కేసీఆర్ మాత్రం తాగి పండుతున్నడు. ఎప్పుడైనా టీవీలో మాట్లాడితే పచ్చి అబద్దాలతో ప్రజలను నమ్మించే మోసం చేస్తున్నడు. నాలాలో పడి చనిపోతే పట్టించుకోడు.. నిన్న పసిపాప చనిపోతే పరిహారమిచ్చి దులుపుకోవాలని చూస్తున్నడు. కుక్క కరిచి చనిపోతే పట్టించుకోడు. బీజేపీ వాళ్లు వెళితే అడ్డుకుంటరు. కేసీఆర్ కు ఇంకా 5 నెలలే టైముంది. ప్రజలు కూడా కేసీఆర్ సంగతి చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..

• నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి వెళ్లకపోవడంపై అడిగిన ప్రశ్నకు… నాకు సచివాలయం లెక్క కన్పిస్తలేదు. నాకే కాదు… ఒవైసీ కూడా తాజ్ మహల్ లెక్క ఉందని చెప్పిండు… ఒక వర్గం ఓట్లు పొందడానికి, ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసం సచివాలయం కట్టిండు. ఒకవర్గానికి చెందిన కల్చర్ ను ప్రోత్సహించేలా సచివాలయం ఉంది. నల్లపోచమ్మ గుడికి రెండున్నర గుంటల జాగా కేటాయిస్తావా? మసీదుకు 5 గుంటల జాగా ఇస్తవా? హిందువులంటే నీకంత చులకన భావమెందుకు? సమాధానం చెప్పాలి. నేను మాట్లాడితే గుజరాత్ లో కూడా డోమ్ లున్నయ్ కదా..అని అంటున్నరు. ఆ డోమ్ లపై గుజరాత్ సంస్క్రతిని ప్రతిబింబించేలా ఉన్నాయ్.. ఇక్కడ తెలంగాణ కల్చర్ ను ప్రతిబింబించేలా లేవనే సంగతి గుర్తుంచుకోవాలి.

• ఏబీఎన్, ఆంధ్రజ్యోతిసహా పలు పత్రికలు, ఛానళ్లకు ఆహ్వానం లేకపోవడంపై అడిగిన పశ్ర్నకు…..జర్నలిస్టు సంఘాలు ఏం చేస్తున్నయ్? మీడియాను పాతాళంలోకి తొక్కి పెడతానంటే జర్నలిస్టులంతా ఏం చేస్తున్నరు? మీడియాను నిషేధిస్తుంటే ఏం చేస్తున్నరు? వీ6, వెలుగు ఏం తప్పుచేశాయని నిషేధించారు. ఇయాళ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ను నిషేధిస్తే మీరంతా ఏం చేస్తున్నరు? ఆంధ్రజ్యోతి, రాజ్ న్యూస్ ను రానీయడట. మరి మీడియా ఛానెల్స్ ఎందుకు? నీ(కేసీఆర్) టీ ఛానల్ ఒక్కటి పెట్టుకుని నిన్ను, నీ అందం చూపించుకోరాదు.. సచివాలయ ప్రారంభోత్సానికి మిగితా వాళ్లు కూడా ఎందకు? నీకు చెక్కభజన చేసే వాళ్లను పిలిపించుకుని భజన చేయించుకోరాదు.. తెలంగాణలో వీ6 చేసిన ఉద్యమం గ్రేట్ అంటివి. ఇప్పుడు నీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే తట్టుకోలేక నిషేధిస్తవా?

• అయినా నీ ముఖం చూసి చూసి జనం విసిగిపోయారు. కేసీఆర్ ముఖాన్ని, టీఆర్ఎస్ పార్టీ నేతల ముఖాలను చూపకపోతేన ప్రజలు టీవీలను ఆదరిస్తున్నరు. జనం సంతోష పడుతున్నరు. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో ఆలోచించండి.. అయినా మీడియాను అణిచిపెట్టాలనుకున్న పాలకులు కాలగర్బంలో కలిశారు.. కేసీఆర్ కు కూడా అదే గతి పట్టబోతోంది.

• ఏ సర్వే చూసినా బీజేపీ అధికారంలోకి రాబోతోందని నివేదికలున్నయ్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం తథ్యమనుకుంటున్నరు. అందుకే కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నరు. బీజేపీకి ఓటేసి అధికారం ఇవ్వాలనుకుంటున్నరు. మేం సింగిల్ గానే పోటీ చేస్తాం.. సింగిల్ గానే అధికారంలోకి వస్తాం… ప్రజాస్వామ్యబద్దంగా పాలన కొనసాగిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X