हैदराबाद : पुराने शहर हैदराबाद में मजलिस पार्टी ने अपना कब्जा बरकरार रखा है। एआईएमआईएम अध्यक्षअसदुद्दीन औवेसी ने लगातार पांचवीं बार हैदराबाद सांसद सीट जीत ली है। मंगलवार को घोषित लोकसभा चुनाव परिणामों में असदुद्दीन ने अपने निकटतम भाजपा उम्मीदवार माधवी लता पर 3,38,087 (61.8%) वोटों के बहुमत से जीत हासिल की। एआईएमआईएम लगभग साढ़े चार दशकों से पुराने शहर में जीतते आ रही है। 1984 से लेकर 2024 तक वह जीतती आ रही है।
1984 में सलाहुद्दीन ओवैसी ने पहली बार हैदराबाद संसदीय सीट से निर्दलीय उम्मीदवार के रूप में चुनाव लड़ा और जीत हासिल की थी। बाद में 1989 के संसदीय चुनावों में ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन (AIMIM) का गठन किया और सलाहुद्दीन ओवैसी ने उस पार्टी की ओर से चुनाव लड़ा और जीत हासिल की थी। सलाहुद्दीन ओवैसी ने 1991, 1996, 1998 और 1999 में भाजपा उम्मीदवारों के खिलाफ संसदीय चुनाव जीता।
इसके बाद असदुद्दीन ओवैसी ने पहली बार 2004 के संसदीय चुनाव में चुनाव लड़ा और जीत हासिल की। इसके बाद उन्होंने क्रमश: 2009, 2014 और 2019 का चुनाव जीता। ताजा 2024 के चुनाव में असदुद्दीन ओवैसी ने पांचवीं बार जीत हासिल की हैं। इससे यह साबित कर दिया है कि पुराने शहर में उनका कोई सानी नहीं है। गौरतलब है कि पिछले दो दशकों में असदुद्दीन औवेसी को एक लाख से अधिक बहुमत मिला है।
यह भी पढ़ें-
ओवैसी ने 2004 में 1,00,145 (37.39%) बहुमत, 2009 में 1,13,865 (42.14%), 2014 में 2,02,454 (52.94%), 2019 में 2,82,187 (58.9%) और मंगलवार को घोषित चुनाव 2024 में 3,38,087 (61.8%) के भारी बहुमत से जीत हासिल की है।
पुराने शहर पर कब्ज़ा जमाने के लिए बीजेपी पिछले 44 साल से कोशिश कर रही है। हालांकि, वह दूसरे नंबर पर ही सिमट कर रह गई है। इस बार भी चुनाव में बीजेपी की ओर से महिला उम्मीदवार माधवी लता ने असदुद्दीन को कड़ी टक्कर दी। आखिर वह दूसरे स्थान पर ही सीमित रह गईं।
వరుసగా ఐదోసారి విజయం సాధించిన అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్ : హైదరాబాద్ (పాతబస్తీ)లో మజ్లిస్ పార్టీ పట్టు నిలుపుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి వరుసగా ఐదోసారి విజయం సాధించారు. మంగళవారం ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ సెగ్మెంట్‌లో అసదుద్దీన్ తన సమీప బీజేపీ అభ్యర్థి మాధవీ లత పై 3,38,087(61.8%) ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, పాతబస్తీలో మజ్లిస్ పార్టీ దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పాగా వేసింది. 1984 మొదలుకొని 2024 వరకు ఆ పార్టీ గెలుస్తూ వస్తోంది.
1984లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదట ఇండిపెండెంట్‌గా సలావుద్దీన్ ఒవైసీ పోటీ చేసి గెలిచారు. తర్వాత 1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)ను ఏర్పాటు చేసి, ఆ పార్టీ తరఫున సలావుద్దీన్ ఒవైసీ పోటీ చేసి విజయం సాధించారు. 1991, 1996, 1998, 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ సలావుద్దీన్ ఒవైసీ బీజేపీ అభ్యర్థులపై గెలిచారు.
అనంతరం 2004 పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచారు. తాజాగా 2024 ఎంపీ ఎన్నికల్లోనూ ఐదోసారి గెలుపొంది, 20 ఏండ్లుగా పాత బస్తీలో తనకు తిరుగులేదని నిరూపించారు. కాగా, గత రెండు దశాబ్దాలుగా అసదుద్దీన్ ఒవైసీకి లక్షకు తగ్గకుండా మెజార్టీ రావడం గమనార్హం.
2004లో 1,00,145 (37.39%) మెజార్టీ, 2009-లో 1,13,865 (42.14%), 2014లో 2,02,454 (52.94%), 2019లో 2,82,187(58.9%) మెజార్టీ వచ్చింది. తాజాగా మంగళవారం ప్రకటించిన 2024- ఎంపీ ఎన్నికల్లో అత్యధికంగా 3,38,087 (61.8%) మెజార్టీతో ఆయన ఘటన విజయం సాధించారు.
పాతబస్తీపై పట్టుకోసం బీజేపీ గత 44 ఏండ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే, ఆ పార్టీ రెండో స్థానానికే పరిమితమవుతోంది. ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున మహిళా అభ్యర్థి మాధవీలత అసదుద్దీన్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అయితే, కౌటింగ్ ముగిసే సమయానికి ఆమె రెండో స్థానానికే పరిమితమయ్యారు. (ఏజెన్సీలు)