ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థకి ప్రక్షపాతి అని, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను అడ్డుకున్నారని గుర్తు చేశారు.
సింగరేణ సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం రోజున టీబీజీకేఎస్ సంఘం నాయకులు కవితను హైదరాబాద్ లో కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు.
కవిత మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ ఎప్పడూ మరచిపోబోరని అన్నారు. అవకాశం ఉన్న ప్రతీసారి కార్మికులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని తెలిపారు. కార్మికులకు అత్యధిక బోనస్ ప్రకటించిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని, 2014లో 18 శాతం బోనస్ ఉండగా…. 2022 నాటికి 30 శాతానికి పెంచామని, ఈ సారి 32 శాతానికి పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పాటు పడుతుందని, తమ పార్టీ అన్ని విధాలుగా కార్మికులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మరియు టీబీజీకేస్ నాయకులు పాల్గొన్నారు.
————————————-
ఎమ్మెల్సీ కవిత తో బీఆరెస్ ఎన్నారైల బృందం భేటీ.
మహిళా బిల్లుపై శుభాకాంక్షలు తెలిపిన బృందం
రాబోయే ఎన్నికలలో ఎన్నారైల ప్రచార ప్రణాలికను వివరించిన బృందం.
హైదరాబాద్ : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని బీఆరెస్ ఎన్నారైల బృందం అన్నారు, మహేష్ బిగాలా అద్వ్యర్యములో ఈరోజు వివిధ దేశాల ఎన్నారైలు అమెరికా నుంచి మహేష్ తన్నీరు (బీఆరెస్ USA అడ్విసోరీ చైర్) , చందు తల్లా (బీఆరెస్ USA కన్వీనర్), హరీష్ రెడ్డి & సురేష్ ఎమ్మెల్సీ కవిత ని కలిసి అభినందించారు అలాగే వివిధ అంశాలపై వారు చర్చించారు.
ఎన్నారైలు మాట్లాడుతూ మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని పోరాటం చేశారని, దాని ఫలితంగానే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారని , ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు
అలాగే పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం ఓబీసీలకు, 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు చేపట్టాలి అని అదే పోరాట పటిమతో ముందుకు వెళ్లాలని అన్నారు , అలాగే రిజర్వేషన్లకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అని అన్నారు.
రాబోయే ఎన్నికలలో అమెరికాలో ఎన్నారైలందరు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా బీఆరెస్ చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలలోకి తీసుకెళ్తామని అలాగే ఎన్నారైల తరపున ఎన్నికల ప్రచార ప్రణాలికను సిద్ధం చేసారని అన్నారు. వివిధ దేశాల ఎన్నారైలు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారములో పాల్గొంటారని అలాగే సోషల్ మీడియా క్యాంపెయిగ్న్ అండ్ టెలీఫోనిక్ కాంపెయిన్ లతో ప్రజల్లోకి బీఆరెస్ పథకాలను తీసుకెళ్తామని అన్నారు.
———————————
బి అర్ ఎస్ లో చేరిన కోడకండ్ల మండలం రామేశ్వరం గ్రామ కాంగ్రెస్ నాయకులు!
పాలకుర్తి నియోజకవర్గం కోడకండ్ల మండలం రామేశ్వరం గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కాశి రామచంద్ర స్వామి, యువజన నాయకులు గుండె సతీష్, ఉద్గురి శ్రీనివాస్, తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు నాయక్, మాజీ సర్పంచ్ లాలు నాయక్, మండల ST సెల్ ఉపాధ్యక్షుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
————————–
ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి బాపూజీకి ఘన నివాళులు
మాజీ మంత్రి, తెలంగాణ పోరాటయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఘన నివాళులర్పించారు.
బాపూజీ 108వ జయంతి సందర్భంగా ఖమ్మంలోని ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహానికి బుధవారం ఉదయం ఎంపీ రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి పూలమాల వేసి ఆయన దివ్య స్మృతికి ఘనంగా నివాళులర్పించారు.
———————————–
Active Politics and Social Work are Symbiotic
Vanam Jwala Narasimha Rao
In two recent letters addressed to Telangana Chief Minister K Chandrashekhar Rao and State Chief Secretary A Santhi Kumari, Governor Tamilisai Soundararajan, as predicted by some political analysts, rejected to clear names of young Dr Dasoju Sravan and Kurra Satyanarayana for nomination to State Legislative Council in Governor’s Quota.
Sravan, is a multifaceted Socio-Political Activist, who in his own inimitable fashion, committed to Telangana’s Transformation, since the days of second phase of separate statehood movement and also known for his Visionary Professional Development, Academics, Corporate Human Resource Innovations, Mentoring skills, Writing proficiency, Filmmaking, Acting, Media Analysis and Advocacy for Voiceless. Equally competent and eligible is another candidate, Kurra Satyanarayana.
Constitutional Provisions
Governor rejected their nominations despite State Cabinet decision, which normally is binding on Governor, citing couple of Constitutional Provisions. These include, among others, the nominees’ ‘Active Participation in Politics,’ corporate and academic sectors only, but did not include any special achievements in literature, arts, science, cooperative movement, and social service, which makes them ineligible. Governor also mentioned about absence of proper documentation in support of proof of fulfilment of constitutional criteria. And hence, it would be inappropriate for her to consider and nominate them as Members of the Legislative Council.
Governor further made a mention that there are ‘several eminent non-politically affiliated people recognized in the State fulfilling the requisites prescribed under Article 171(5) of the Constitution,’ probably hinting at considering choosing from among them!!! It may be true that for any position, there would be several eligible aspirants, but accommodating all in one go is not possible, until their turn comes. Governor’s decision is seen in intellectual and political circles as, ‘Stirring up yet another political controversy ahead of the Assembly Elections.’
Pertinent Questions
There were strong protests from BRS leadership against the decision of Governor, and from BJP leadership in defense of Governor’s decision. These lead to several pertinent questions and ponderable valid issues, arising out of this development.
The first and foremost ponderable is, in democratic polity, can there be even a remote prospect to delink Politics with other professions, be it social work, academic engagement, legal, medical, engineering, agricultural professions etc. not to speak of several other small and big trades? There are many in this country and abroad who in and out of politics engage themselves in some of the above said professions, and some even while in politics and occupying higher positions including elected posts.
There shall not be a restriction for a ‘Political Activist,’ to carry on social, academic, professional, service etc. activities parallelly being in active politics. There shall not be a ‘Static, Orthodox and unacceptable’ interpretation to provisions quoted in Constitution that come in the way of ‘Progress’ and ‘Career Development’ of any individual, not to speak of those who belong to Backward Classes. Constitutional Provisions shall be ‘Dynamic.’ Social Work and Politics have sometimes distinct and sometimes similar roles and purposes. Both are not mutually exclusive. Social Workers may engage in ‘Advocacy and Lobbying’ to influence ‘Policy Changes.’ Politicians may work to address social issues and vice versa through legislation. The two fields often intersect when addressing complex social problems and striving for societal improvements for betterment of society.
There are Distinguished Politicians who are Excelling in Social Work in India. Nothing prevented them being in ‘Active Politics’ and also in ‘Active Social Work.’ For instance, Dr Achyuta Samanta, Lok Sabha Member from Kandhamal in Odisha State, a noted educationist, and philanthropist and founder of world-class institutions is the classic example. Besides education and tribal upliftment, healthcare, and rural development, Dr Achyuta Samanta has contributed to art, culture, literature, film, media, society, and national integration. ‘Active Politics and Active Social Work are Symbiotic’ if one understands it.
In the ever-changing scenario of needs, desires, values, demands of the society, the Constitution of any democratic country, including that if India, cannot remain static. It should be alive, dynamic and keep on changing itself to suit to the present-day conditions, keeping the basic structure intact. Similarly, ‘Constitutional Conventions’ are rules of good political behavior and are typically rules of self-restraint, not merely ‘Exercising Powers.’ Constitution’s Spirit is the Preamble, and the guiding spirit for Indian Nation and the touchstone of Basic Features of Constitution of India.
Maintaining Relationships
Those who are occupying Constitutional Positions in India, like that of Governor, may please glance into the Genesis and Evolution of British Monarch, that can be compared with Rashtrapathi of India whose relationship with Prime Minister is akin to that of Governor and Chief Minister in the states. Constitutional provisions can be conveniently or inconveniently interpreted but conventions go a long away in maintaining relationships. It is ‘Relationship’ that is important and certainly not ‘Constitutional Provisions’ always. If once Relationship is breached, then Provisions have hardly any meaning and relevance in a democratic polity.
In this context, or even otherwise, it would be interesting if one looks at the Indian Constitution objectively, with reference to Governor’s duties, responsibilities, and powers in the ever-changing political scenario. Framers of the Constitution resolved that under Constitutional Scheme of things, the Governor was to be only a ‘Formal Constitutional Head’ with strictly limited powers in the discharge of almost all his or her functions.
The words in Article 163 that ‘there shall be Council of Ministers to advise the Governor in the exercise of his or her functions’ really means that the Governor shall act (necessarily follow) on the advice of Council of Ministers only. Governor thus emerged as a nominal, titular, constitutional head appointed by President of India, heading his or her Government.
The inference of all this is, in the backdrop of Constitutional Spirit, reconsidering of nominating, Dr Dasoju Sravan and Kurra Satyanarayana, as Members of Legislative Council, in accordance with Cabinet’s Recommendations is appropriate and legitimate. Hence, a second, fresh and favorable thought may be given by Governor in this direction.
Social work is a broad profession that intersects with several disciplines and of late more with politics. The study of Political Sociology which is an interdisciplinary field concerned with exploring how governance and society interact and influence each other at the micro to macro levels of analysis, will make one to understand better, the broad contours of relationship between ‘Active Politics and Active Social Work.’
Like Politics, which is not only a mere institution of governance but also a mechanism for achieving societal goals, Social Work too is a mechanism for achieving societal goals. Social work and Politics are practice-based professions to promote social change and development, social cohesion, empowerment, and liberation of people. Political activity of social activists takes place in the broader context of social justice as one of the core values. And hence a ‘Political Activist,’ who is also a ‘Social Activist’ is hundred percent eligible for nomination as MLC.
(Writer is Chief Public Relations Officer to the Chief Minister of Telangana)
———————————-
ఎంపీ వద్దిరాజు పిండిప్రోలులో సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి పిండిప్రోలులో విద్యుత్ సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం చేశారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు తాతా మధు సొంతూరు.ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం బుధవారం ఉదయం స్థానికుల హర్షధ్వానాల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ఇతర ప్రముఖులతో కలిసి అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు.
———————–
ఎంపీ వద్దిరాజుకు టేకులపల్లిలో ఘన స్వాగతం
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండల కేంద్రానికి బుధవారం విచ్చేసిన సందర్భంగా ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్, కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టేకులపల్లి పర్యటనకు తొలిసారి విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అపూర్వ స్వాగతం చెప్పారు.రవిచంద్ర నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా టేకులపల్లిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
——————————-
వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్దం, రుణమాఫీ అమలు, ఆయిల్ పామ్ సాగుపై సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
ఈ వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో సాగయిన వరి. ఇప్పటివరకు ఇది అత్యధికం.
తెలంగాణ చరిత్రలో ఇది ఒక రికార్డ్
ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలో గతంకన్నా ఈ వానాకాలం 24 వేల ఎకరాల్లో పెరిగిన వరి సాగు
సిద్దిపేట, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలలో గతంకన్నా పెరిగిన వరిసాగు. సజావుగా ఎప్పటిలాగే ఎరువుల సరఫరా.
మరోవైపు యాసంగి సాగుకు సన్నద్దం చేయాలని అధికారులకు సూచనలు
గత ఏడాది యాసంగిలో 74 లక్షల ఎకరాల్లో సాగు
ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం
ఈ వానాకాలంలో ఇప్పటి వరకు కోటి 26 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు
మరో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు .. లక్ష 93 వేల ఎకరాలకు చేరిన ఆయిల్ పామ్ సాగు. కొనసాగుతున్న ఆయిల్ పామ్ సాగు.
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు అందుబాటులో ప్రోత్సాహకాలు
ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు
సుమారు 75 నుండి 80 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగవుతాయని అంచనా
రబీ పంటల సాగుకోసం అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయింపు.
రబీ సాగు కోసం 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి నివేదిక .. 9.2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం
గత యాసంగి కన్నా సాగు పెరిగే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రానికి లేఖ
ఇప్పటి వరకు 21 లక్షల 34 వేల 949 రైతులకు చెందిన రూ.11,812.14 కోట్లు రుణమాఫీ
కొనసాగుతున్న రుణమాఫీ ప్రక్రియ .. అర్హులయిన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తాం
బ్యాంకు ఖాతా మూతపడడం కారణంగా కాని, సాంకేతిక కారణాలతో కానీ, బ్యాంకుల నుండి తిరిగి వెళ్లిన రుణ మాఫీ నగదు కాని లేదా మరే కారణం వలన తిరిగి వెళ్లిన అందరి రైతుల రుణమాఫీ చేస్తాం
రుణమాఫీపై సందేహాలున్న రైతులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను సంప్రదించాలి
రుణమాఫీ సందేహాల నివృత్తి కొరకు రాష్ట్రస్థాయిలో 040 23243667 నంబరులో సంప్రదించగలరు
ఇప్పటి వరకు పెండింగులో ఉన్న రైతుభీమా క్లెయిములన్నీ వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం
రైతులు రసాయనిక ఎరువులు తగ్గించుకుని నేల ఆరోగ్యం పెంపొందించుకునేందుకు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలి
వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్దం, రుణమాఫీ అమలు, ఆయిల్ పామ్ సాగుపై సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకులు విజయ్ కుమార్ , అగ్రోస్ ఎండీ రాములు తదితరులు.
———————————-
తాండూర్ నియోజకవర్గ పర్యటన లో భాగంగా ఈరోజు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గార్లతో కలసి 50 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు గారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ:
రెండో సారి పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నారు. రోహిత్ రెడ్డి సూచన మేరకు 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే నర్సింగ్ కాలేజీకి శంఖుస్థాపన చేసుకున్నాం. మరో పది కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్ ల శంఖుస్తాపన చేసుకున్నాం.
ఇటు పక్క చించోలి అటు పక్క సేడం ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆ రెండు పట్టణాలలో అభివృద్ధి చూడండి.. ఇక్కడ అభివృద్ధి చూడండి. ఇక్కడ పెన్షన్ చూడండి.. అక్కడ పెన్షన్ చూడండి. అంగన్ వాడి, ఆశా వర్కర్ల జీతాలు కర్ణాటకలో కన్నా మన దగ్గర ఎక్కువ.
పీఎం సొంతరాష్ట్రం గుజరాత్ లో అంగన్ వాడీల జీతం 6 వేలు.. మన దగ్గర రెండు రెట్లు ఎక్కువ.
అంగన్ వాడీ ఆశా వర్కర్లను సిపిఐ నాయకులు రెచ్చ గొడుతున్నారు. వాళ్ళ కోసం మోసపోవద్దు. త్వరలో prc నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ అందరి జీతాలు పెరుగుతాయి. కేసీఆర్ మనసును ప్రేమతో గెలవాలి పోరాటంతో కాదు. మోడీ త్వరలో తెలంగాణ వస్తున్నారు. అంగన్ వాడి, ఆశా వర్కర్లు కలిసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జీతాలు ఎందుకు పెంచడం లేదని నిలదీయాలి.
తెలంగాణపై వివక్ష లో A1 కాంగ్రెస్ అయితే A2 బీజేపీ. ఆ రెండు పార్టీలు ఏం చేసినా మళ్ళీ గెలిచేది, హ్యాట్రిక్ కొట్టేది బీ ఆర్ ఎస్, కేసీఆర్ యే. అప్పటి తాండూర్ ఎలా ఉంది ఇప్పటి తాండూర్ ఎలా ఉంది. మంత్రి మహేందర్ రెడ్డి అండతో రోహిత్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.
మొన్న కేంద్రీయ విద్యాలయాలు ప్రకటిస్తే ఒక్కటి కూడా తెలంగాణ కు ఇవ్వలేదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. కేంద్రీయ విద్యాలయం కూడా ఇవ్వని మోడీ ఏం చెప్పేందుకు తెలంగాణ వస్తున్నారు. కోటిపల్లి రిజర్వాయర్ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం.
———————————
కేసిఆర్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ది పై గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయాలి
10ఏళ్ల క్రితం ఎట్లున్న తెలంగాణ… ఇప్పుడెట్లయ్యింది
కేసిఆర్ చేసిన మంచి మీ కళ్ళ ముందే కన్పిస్తున్నది
ప్రజలకు ఏది అవసరమో కేసిఆర్ అదే చేస్తడు.. అర్రాసు పాట హామీలు ఇవ్వడు
కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు
కాంగ్రెస్,బీజేపీ మభ్యపెట్టే మాటలు నమ్మొద్దు
50 ఏళ్లు పాలించి ఏమీ చేయని కాంగ్రెస్..ఇప్పుడు చేస్తామంటే నమ్ముతారా..?
పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన బీజేపీ ఎంపి అర్వింద్ కమ్మర్ పల్లికి ఏం చేశాడు
ఏరు దాటాక..తెప్ప తగలబెట్టే రకం వీళ్ళు..ఓట్ల కోసం ఎంతటి అబద్దాలైన చెప్తారు
ఓట్ల డబ్బాల పడ్డాక..మొహం కూడా చూపించరు
కాంగ్రెస్, బీజేపీ హామీలు నమ్మితే మోసపోతాం
తెలంగాణ బాగు కోరేది కేసిఆర్ ఒక్కడే…కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్పల్లి: బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రికి ప్రజలు,మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి నీరాజనం పలికారు.
ఈ సందర్భంగా హెల్త్ సబ్ సెంటర్ పనుల శంకుస్థాపన 20 లక్షలు
కమ్మర్పల్లి తడపాకల్ రోడ్డు వరద కాలువ వద్ద స్లాబ్ కల్వర్టు పనుల శంకుస్థాపన 50 లక్షల వ్యయం,PACS గో డౌన్ పనుల శంకుస్థాపన 25 లక్షల వ్యయం,గాంధీనగర్,నాగపూర్ రోడ్డు పై స్లాబ్ కల్వర్టు పనుల శంకుస్థాపన 50 లక్షల వ్యయంతో,హాసకొత్తూరు గ్రామంలో హాసకొత్తూర్ నుండి మెట్ల చిట్టాపూర్ బిటి రోడ్ పనుల శంకుస్థాపన 80 లక్షల వ్యయంతో, 6 లక్షల వ్యయంతో PACS గోడౌన్ నిర్మాణ పనుల శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ…
కేసిఆర్ సర్కార్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ది పై ప్రజలు గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయాలనీ కోరారు. 10ఏళ్ల క్రితం ఎట్లున్న తెలంగాణ… ఇప్పుడెట్లయ్యిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. సాగునీరు,24గంటల ఉచిత కరెంట్,ఎరువులు,రైతు బంధు,రైతు భీమా,కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్లు,కుల వృత్తులకు ప్రోత్సాహంతో కేసిఆర్ చేసిన మంచి మీ కళ్ళ ముందే కన్పిస్తున్నది అన్నారు.
ప్రతి పల్లెలో కోటి రూపాయలకు తగ్గకుండా సి.సి రోడ్లు వేశామని అన్నారు.ప్రజలకు ఏది అవసరమో కేసిఆర్ అదే చేస్తడు కానీ కాంగ్రెస్ లాగా అర్రాసు పాట హామీలు ఇవ్వడని ఎద్దేవా చేసారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. ఈ 9ఏళ్లలో కమ్మర్ పల్లి అభివృద్ది కోసం 90 కోట్లు ఖర్చు చేశామని, హాసకొత్తూరు అభివృద్ధి కోసం 43 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
కాంగ్రెస్,బీజేపీ మభ్యపెట్టే మాటలు నమ్మొద్దని 50 ఏళ్లు పాలించి ఏమీ చేయని కాంగ్రెస్..ఇప్పుడు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన బీజేపీ ఎంపి అర్వింద్ కమ్మర్ పల్లికి ఏం చేశాడని నిలదీశారు. చౌట్పల్లి హన్మంతు రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు 24 గంటలు కరెంట్ తో ఏడాదిలో 8నెలలు నడుస్తోందని ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దూకిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని అవి కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాను చేసేది చెప్తానని ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం తనకు చేత కాదని అన్నారు.
కాంగ్రెస్,బీజేపీ ఏరు దాటాక..తెప్ప తగలబెట్టే రకమని..ఓట్ల కోసం ఎంతటి అబద్దాలైన చెప్తారని అన్నారు. ఓట్లు డబ్బాల పడ్డాక..మొహం కూడా చూపించరన్నారు. కాంగ్రెస్, బీజేపీ హామీలు నమ్మితే మోసపోతామని అన్నారు. తెలంగాణ బాగు కోరేది కేసిఆర్ ఒక్కడే అని అన్నారు. కాంగ్రెస్,బీజేపీ లకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటే.. కేసిఆర్ కు తెలంగాణ ప్రజలే హైకమండ్ అన్నారు…కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.